త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Traffic restriction | రేపు ఎల్బీ స్టేడియం ప‌రిస‌రాల్లో ట్రాఫిక్ ఆంక్ష‌లు.. ఎందుకంటే..?

Traffic restriction | రంజాన్ నేప‌థ్యంలో ఈ నెల 15న ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలో ఇఫ్తార్ విందును ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేయ‌నున్నారు. ఈ కార్య‌క్ర‌మానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజ‌రు కానున్నారు.

S

Hyderabad | Published On Mar 14, 2026, 5.12 pm IST

Traffic restriction | రేపు ఎల్బీ స్టేడియం ప‌రిస‌రాల్లో ట్రాఫిక్ ఆంక్ష‌లు.. ఎందుకంటే..?
Advertisement

Traffic restriction | త్రినేత్ర‌.న్యూస్ : రంజాన్ నేప‌థ్యంలో ఈ నెల 15న ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలో ఇఫ్తార్ విందును ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేయ‌నున్నారు. ఈ కార్య‌క్ర‌మానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజ‌రు కానున్నారు. ఈ క్ర‌మంలో ఆదివారం సాయంత్రం 5 గంట‌ల నుంచి రాత్రి 10 గంట‌ల వ‌ర‌కు ఎల్బీ స్టేడియం ప‌రిస‌రాల్లో ట్రాఫిక్ ఆంక్ష‌లు అమ‌ల్లో ఉంటాయ‌ని హైద‌రాబాద్ సిటీ పోలీసులు ప్ర‌క‌టించారు.

ట్రాఫిక్ మ‌ళ్లింపులు ఇలా..

  • ఏఆర్ పెట్రోల్ పంప్ జంక్ష‌న్ నుంచి బీజేఆర్ విగ్ర‌హం వైపు వ‌చ్చే వాహ‌నాల‌ను ఏఆర్ పెట్రోల్ పంపు వ‌ద్ద‌నే మ‌ళ్లించి నాంప‌ల్లి రైల్వే స్టేష‌న్ వైపు మ‌ళ్లించ‌నున్నారు.
  • బ‌షీర్‌బాగ్ నుంచి ఏఆర్ పెట్రోల్ పంపు వైపు వ‌చ్చే వాహ‌నాల‌ను బీజేఆర్ విగ్ర‌హం వ‌ద్ద ఎస్బీఐ, అబిడ్స్, నాంప‌ల్లి స్టేష‌న్ రోడ్డు మీదుగా మ‌ళ్లించ‌నున్నారు.
  • సుజాత స్కూల్ లేన్ నుంచి ఖాన్ ల‌తీఫ్ ఖాన్ బిల్డింగ్ వైపు వ‌చ్చే వాహ‌నాల‌ను సుజాత స్కూల్ జంక్ష‌న్ వ‌ద్ద నాంప‌ల్లి వైపు మ‌ళ్లించ‌నున్నారు.
  • ర‌వీంద్ర భార‌తి నుంచి బీజేఆర్ విగ్ర‌హం వైపు వ‌చ్చే ఆర్టీసీ బ‌స్సుల‌ను ఏఆర్ పెట్రోల్ పంపు వ‌ద్ద మ‌ళ్లించి నాంప‌ల్లి రైల్వే స్టేష‌న్ మీదుగా మ‌ళ్లించ‌నున్నారు. ట్రాఫిక్ ప‌రిస్థితుల‌ను దృష్టిలో ఉంచుకుని వాహ‌నాల‌ను మ‌ళ్లిస్తామ‌న్నారు.

ఈ మార్గాల్లో ప్ర‌యాణం వ‌ద్దు..

ల‌క్డీకాపూల్, ఇక్బాల్ మినార్, ర‌వీంద్ర భార‌తి, బ‌షీర్‌బాగ్, బీజేఆర్ విగ్ర‌హం స‌ర్కిల్, ఎస్బీఐ గ‌న్‌ఫౌండ్రీ, ఏఆర్ పెట్రోల్ పంప్, కేఎల్‌కే బిల్డింగ్, లిబ‌ర్టీ జంక్ష‌న్ మార్గాల్లో వ‌చ్చే వాహ‌న‌దారులు ప్ర‌త్యామ్నాయ మార్గాల‌ను ఎంచుకోవాల‌ని సూచించారు.

 

Advertisement
Advertisement