త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

OU Police | 100కు ఫోన్ చేసింది.. వ‌చ్చి కాపాడారు..

OU Police | ఆర్థిక ఇబ్బందులతో భ‌ర్త‌ ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేయ‌గా భార్య 100 కు డ‌యల్ చేసింది. వెంట‌నే స‌మ‌య‌స్ఫూర్తితో స్పందించిన ఓయూ సిటీ పోలీసులు బాధిత వ్య‌క్తి ప్రాణాల‌ను నిల‌బెట్టారు. పోలీసు స్టేష‌న్‌కు త‌ర‌లించి కౌన్సిలింగ్ నిర్వ‌హించారు.

S

Hyderabad | Published On May 18, 2026, 5.06 pm IST

OU Police | 100కు ఫోన్ చేసింది.. వ‌చ్చి కాపాడారు..
Advertisement
  • భ‌ర్త ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేయ‌గా స‌మ‌య‌స్ఫూర్తిని ప్ర‌ద‌ర్శించిన భార్య
  • స‌కాలంలో వ‌చ్చి ప్రాణాలు కాపాడిన ఓయూ పోలీసులు
  • కానిస్టేబుళ్ల‌కు అభినంద‌న‌ల వెల్లువ‌

OU Police | త్రినేత్ర‌.న్యూస్: ఆర్థిక ఇబ్బందులతో భ‌ర్త‌ ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేయ‌గా భార్య 100 కు డ‌యల్ చేసింది. వెంట‌నే స‌మ‌య‌స్ఫూర్తితో స్పందించిన ఓయూ సిటీ పోలీసులు బాధిత వ్య‌క్తి ప్రాణాల‌ను నిల‌బెట్టారు. నిమిషాల వ్యవధిలో ఘటనా స్థలానికి చేరుకుని ఈ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. పోలీసు స్టేష‌న్‌కు త‌ర‌లించి కౌన్సిలింగ్ నిర్వ‌హించారు. అనంత‌రం కుటుంబ స‌భ్యుల‌కు అప్ప‌గించ‌డంతో క‌థ సుఖాంత‌మైంది.

ఓయూ పీఎస్ ఇన్‌స్పెక్టర్ ఎమ్. మహేష్ (M. Mahesh) ప్రకారం వివ‌రాలిలా ఉన్నాయి. ఆదివారం రాత్రి సుమారు 21:00 గంటల సమయంలో బోరబండ వద్ద ఉన్న నీలవేణి (Neelaveni)అనే మహిళ నుండి డయల్ 100కు అత్యవసర కాల్ వ‌చ్చింది. తన భర్త మల్లేష్ తమ నివాసంలో ఆత్మహత్యకు ప్రయత్నిస్తున్నాడని ఆమె సమాచారం అందించారు. ప్రాథమిక విచారణలో సదరు వ్యక్తి ఆర్థిక ఇబ్బందుల (Financial Issues) కారణంగానే ఈ ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టినట్లు తెలిసింది. సాంకేతిక సహాయంతో బాధితుడు మల్లేష్ ఉన్న నివాస స్థాలాన్ని ఎమ్.కె నగర్, స్ట్రీట్ నంబర్ 7 సమీపంలో గుర్తించాం.

ఆ వెంటనే బ్లూ కోల్ట్-3 (BC-3) సిబ్బంది పోలీస్ కానిస్టేబుల్ (PC 5584) సి. విజయ్ కుమార్ నాయక్, టీజీఎస్పీ కానిస్టేబుల్ (PC 1699) తిరుపతి హుటాహుటిన‌ ఎమ్.కె నగర్‌లోని బాధిత వ్య‌క్తి ఇంటికి చేరుకున్నారు. క్షణాల వ్యవధిలో అతన్ని అడ్డుకుని సురక్షితంగా కిందకు దించారు. కౌన్సిలింగ్ అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించాం అని ఇన్‌స్పెక్టర్ పేర్కొన్నారు.

కాగా ఆపదలో ఉన్న సమాచారం అందిన వెంటనే స్పందించి ఒకరి ప్రాణాన్ని కాపాడిన పోలీస్ కానిస్టేబుళ్లను ఉన్నతాధికారులు, స్థానిక ప్రజలు ప్రత్యేకంగా అభినందించారు.

Advertisement
Advertisement