త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Shaadi Mubarak Scam | షాదీ ముబార‌క్ పేరుతో స్కామ్ చేశారు.. క‌ట‌క‌టాల‌పాల‌య్యారు

Shaadi Mubarak Scam | షాదీ ముబార‌క్ పేరుతో భారీ స్కామ్ చేసిన ఘ‌ట‌న అత్తాపూర్‌లో వెలుగుచూసింది. పోలీసులు ఆర్ఐతో పాటు ఐదుగురు నిందితుల‌ను అరెస్టు చేశారు. రూ.30 లక్షల వ‌ర‌కు కాజేసినట్లు పోలీసులు గుర్తించారు.

S

Hyderabad | Published On Jun 13, 2026, 6.58 pm IST

Shaadi Mubarak Scam | షాదీ ముబార‌క్ పేరుతో స్కామ్ చేశారు.. క‌ట‌క‌టాల‌పాల‌య్యారు
Advertisement
  • బ‌డంగ్‌పేట ఆర్ఐ స‌హా ఐదుగురి అరెస్టు

Shaadi Mubarak Scam | త్రినేత్ర‌.న్యూస్‌: షాదీ ముబార‌క్ పేరుతో భారీ స్కామ్ చేసిన ఘ‌ట‌న అత్తాపూర్‌లో వెలుగుచూసింది. పోలీసులు ఆర్ఐతో పాటు ఐదుగురు నిందితుల‌ను అరెస్టు చేశారు. అరెస్ట‌యిన వారిలో బడంగ్‌పేట రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ అశోక్‌కిరణ్‌, ఇత్తేమాద్‌, అక్బర్‌, ముషారఫ్‌, సర్ఫరాజ్‌, జఫ్ఫార్‌ ఉన్నారు. వీరు షాదీ ముబారక్‌ పథకంలో రూ.30 లక్షల వ‌ర‌కు కాజేసినట్లు పోలీసులు గుర్తించారు.

నకిలీ డాక్యుమెంట్లు, ఆధార్‌ కార్డులు సృష్టించి ఈ స్కీమ్‌కు తప్పుడు దరఖాస్తులు సమర్పించారు. వివాహం కాకముందే వివాహమైనట్టు దొంగ పత్రాలు సృష్టించారు. 29 అప్లికేషన్ల‌ను స‌మ‌ర్పించ‌గా 21 అప్లికేషన్లను ఎలాంటి ఎంక్వయిరీ చేయకుండా క‌మీష‌న్ తీసుకొని రెవెన్యూ ఇన్‌స్పెక్ట‌ర్ అనుమ‌తులిచ్చారు. రాజేంద్రనగర్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఈ అక్రమాలను గుర్తించి బడంగ్‌పేట్‌లో తలదాచుకున్న ఆరుగురుతో కూడిన గ్యాంగ్‌ని అరెస్ట్ చేశారు. అనంత‌రం అత్తాపూర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న‌ట్లు అత్తాపూర్ పోలీసులు తెలిపారు.

Advertisement
Advertisement