త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CP Sajjanar | ఆ పక్షి వేదనలో శుభం ఎలా కనిపిస్తుంది?

CP Sajjanar | ద‌స‌రా పండుగ వేళ పాల‌పిట్ట‌ను చూడాల‌నే ఉత్సాహంతో.. దాన్ని చాలా మంది బంధిస్తుంటారు. ఇది వ‌న్య‌ప్రాణి సంర‌క్ష‌ణ చ‌ట్టం నిబంధ‌న‌ల‌కు వ్య‌తిరేక‌మ‌ని తెలిసీ కూడా చాలా మంది ఉల్లంఘ‌న‌ల‌కు పాల్ప‌డుతుంటారు. ఈ నేప‌థ్యంలో న‌గ‌ర పోలీసు క‌మిష‌న‌ర్ వీసీ సజ్జ‌నార్( CP Sajjanar ) ఎక్స్ వేదిక‌గా స్పందించారు.

S

Hyderabad | Published On Oct 20, 2026, 9.14 am IST

CP Sajjanar | ఆ పక్షి వేదనలో శుభం ఎలా కనిపిస్తుంది?
Advertisement

పాల‌పిట్ట‌ను బంధించ‌కండి..
హైద‌రాబాద్ సీపీ స‌జ్జ‌నార్ విజ్ఞ‌ప్తి

CP Sajjanar | త్రినేత్ర న్యూస్ : ద‌స‌రా పండుగ వేళ పాల‌పిట్ట‌ను చూడాల‌నే ఉత్సాహంతో.. దాన్ని చాలా మంది బంధిస్తుంటారు. ఇది వ‌న్య‌ప్రాణి సంర‌క్ష‌ణ చ‌ట్టం నిబంధ‌న‌ల‌కు వ్య‌తిరేక‌మ‌ని తెలిసీ కూడా చాలా మంది ఉల్లంఘ‌న‌ల‌కు పాల్ప‌డుతుంటారు. ఈ నేప‌థ్యంలో న‌గ‌ర పోలీసు క‌మిష‌న‌ర్ వీసీ సజ్జ‌నార్( CP Sajjanar ) ఎక్స్ వేదిక‌గా స్పందించారు.

పండుగ అంటేనే ఆనందం, స్వేచ్ఛ, తోటి ప్రాణుల పట్ల కరుణ చూపించడం. కానీ, దసరా వేళ శుభం అంటూ కొందరు తెలంగాణ రాష్ట్ర పక్షి పాలపిట్ట రెక్కలు కత్తిరించి, బోనుల్లో బంధించి వ్యాపారం చేస్తున్నారు. ఆలోచించండి.. ఒక మూగజీవి స్వేచ్ఛను హరించి, దానికి ఆహారం, నీరు లేకుండా హింసిస్తూ చూస్తే ఎవరికైనా మేలు ఎలా జరుగుతుంది? ఆ పక్షి వేదనలో శుభం ఎలా కనిపిస్తుంది? అని స‌జ్జ‌నార్ ప్ర‌శ్నించారు.

పాలపిట్ట మన పర్యావరణానికి రక్షకుడు, రైతుకు మేలు చేసే నిజమైన నేస్తం. అది నీలాకాశంలో స్వేచ్ఛగా రెక్కలు విప్పి ఎగురుతున్నప్పుడే ప్రకృతికి అందం, మన సమాజానికి గౌరవం. వన్యప్రాణి సంరక్షణ చట్టం-1972 ప్రకారం పాలపిట్టలను బంధించడం, విక్రయించడం, ప్రదర్శించడం నేరం. ఈ పండుగ పూట మూగజీవాలకు స్వేచ్ఛను ప్రసాదిద్దాం. బంధించిన పక్షుల ప్రదర్శనలను ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రోత్సహించకండి. ఎక్కడైనా పాలపిట్టలను బంధించినట్లు మీ దృష్టికి వస్తే వెంటనే టోల్‌ఫ్రీ నంబర్లు 18004255364, 9803338666 లేదా డయల్ 112 కు సమాచారం అందించి బాధ్యతాయుతమైన పౌరులుగా వ్యవహరించండి అని సజ్జ‌నార్ సూచించారు.

Advertisement
Advertisement