త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Firecrackers Seized | ఇంట్లోనే 20 లక్షల విలువైన పటాకులు.. ఎక్క‌డంటే!

Firecrackers Seized | ఎలాంటి అనుమ‌తులు లేకుండానే నివాస ప్రాంతంలోని ఓ గోదాంలో నిల్వ ఉంచిన ప‌టాకుల‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

S

Hyderabad | Published On Oct 17, 2026, 6.51 pm IST

Firecrackers Seized | ఇంట్లోనే 20 లక్షల విలువైన పటాకులు.. ఎక్క‌డంటే!
Advertisement

Firecrackers Seized | త్రినేత్ర న్యూస్: ఎలాంటి అనుమ‌తులు లేకుండానే నివాస ప్రాంతంలోని ఓ గోదాంలో నిల్వ ఉంచిన ప‌టాకుల‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హైద‌రాబాద్ బేగంబ‌జార్‌కు చెందిన రాహుల్ సింగ్ అలియాస్ భీమ్ సింగ్‌, అందులో ప‌ని చేసే ప‌ర్వీన్ సింగ్‌ను పోలీసులు శ‌నివారం అరెస్టు చేశారు. వారి వ‌ద్ద నుంచి రూ.20 ల‌క్ష‌ల విలువైన పేలుడు ప‌దార్థాల‌ను స్వాధీనం చేసుకున్నారు.

హైద‌రాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ అడిషనల్ డిప్యూటీ కమిషనర్ వివ‌రాల ప్ర‌కారం.. ప్ర‌ధాన నిందితుడు రాహుల్ సింగ్ అలియాస్ భీమ్ సింగ్ చుడీ బజార్ (గోషామహల్) ప్రాంతంలోని హౌస్ నెం.14-9-139 గోదాంలో భారీ ఎత్తున ప్రమాదకరమైన బాణాసంచాను నిల్వ చేశాడు. సంబంధిత అధికారుల నుంచి ఎలాంటి లైసెన్స్ లేదా అనుమతులు పొందలేదు. నివాస ప్రాంతాల మ‌ధ్య ముందస్తు భద్రతా చర్యలు లేకుండా పటాకులు నిల్వ చేయడం వల్ల అవాంఛనీయ ప్రమాదం సంభవిస్తే ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని తెలిసి ఈ చట్టవ్యతిరేక చర్యకు పాల్పడ్డాడు.

విశ్వ‌స‌నీయ స‌మాచారం మేర‌కు స‌ద‌రు స్థావరంపై గోల్కొండ టాస్క్ ఫోర్స్ బృందం, గోషామహల్ పోలీసులు సంయుక్తంగా దాడి చేశారు. ఈ దాడిలో రాహుల్ సింగ్‌, ప‌ర్వీన్ సింగ్‌ను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి సుమారు రూ. 20,00,000 విలువైన‌ 569 కార్టన్ల భారీ బాణాసంచా నిల్వలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై గోషామహల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

ఈ దాడిలో గోల్కొండ జోన్ టాస్క్ ఫోర్స్ ఇన్ స్పెక్టర్ ఎం.మహేష్, గోషామహల్ పోలీస్ స్టేషన్ ఇన్ స్పెక్టర్ బి.శ్రవణ్ కుమార్ మార్గదర్శకత్వంలో టాస్క్ ఫోర్స్ ఎస్ఐ ఎన్. నవీన్, గోషామహల్ ఎస్ఐ మహిషా, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
Advertisement