త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Fire Accident | పాత‌బ‌స్తీలో అగ్నిప్రమాదం.. బ‌ట్ట‌ల దుకాణంలో చెల‌రేగిన మంట‌లు

Fire Accident | త్రినేత్ర న్యూస్‌: హైద‌రాబాద్‌లోని చార్మినార్ స‌మీపంలో భారీ అగ్నిప్ర‌మాదం (Fire Accident) జ‌రిగింది. మదీనా రోడ్డులో (Madina Road) ఉన్న బాంబే హౌసరి షాపులో ఒక్క‌సారిగా మంటలు చెలరేగాయి.

G

Hyderabad | Published On Oct 19, 2026, 11.42 am IST

Fire Accident | పాత‌బ‌స్తీలో అగ్నిప్రమాదం.. బ‌ట్ట‌ల దుకాణంలో చెల‌రేగిన మంట‌లు
Advertisement

Fire Accident | త్రినేత్ర న్యూస్‌: హైద‌రాబాద్‌లోని చార్మినార్ స‌మీపంలో భారీ అగ్నిప్ర‌మాదం (Fire Accident) జ‌రిగింది. మదీనా రోడ్డులో (Madina Road) ఉన్న బాంబే హౌసరి షాపులో ఒక్క‌సారిగా మంటలు చెలరేగాయి. క్ర‌మంగా అవి దుకాణం మొత్తానికి వ్యాపించ‌డంతో భారీగా అగ్నికీల‌లు ఎగ‌సిప‌డ్డాయి. దీంతో భయాందోళనకు గురైన స్థానికలు వెంటనే పరుగులు తీశారు. స‌మాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకొని మంటలను ఆర్పేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

యాంటీ డ్రోన్ టెస్టింగ్ యూనిట్‌లో..

మాదాపూర్‌లో ఎన్ క‌న్వెన్ష‌న్ స‌మీపంలో ఉన్న యూనిస్ట్రింగ్ టెక్ సొల్యూషన్స్ (Unistring Tech Solutions) ప్రైవేట్ లిమిటెడ్‌కు చెంది యాంటీ-డ్రోన్ సిస్ట‌మ్‌ తయారీ యూనిట్‌లో (anti-drone testing) అగ్నిప్రమాదం జరిగింది. మూడు అగ్నిమాపక వాహనాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియ‌రాలేదు. అగ్నిప్ర‌మాదంతో రూ.కోటికిపైగా ఆస్తి న‌ష్టం జ‌రిగిన‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. ప్ర‌మాదానికి షార్ట్ స‌ర్క్యూట్ కార‌ణ‌మని నిర్ధారించారు.

Advertisement
Advertisement