త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Fire Accident | బాలిక‌ల హాస్ట‌ల్‌లో అగ్నిప్ర‌మాదం.. 20 మంది విద్యార్థినుల‌కు అస్వ‌స్థ‌త‌

Fire Accident | హైద‌రాబాద్‌లోని నాంప‌ల్లిలో అగ్నిప్ర‌మాద (Fire Accident) ఘ‌ట‌న మ‌రువ‌క ముందే మ‌రో ఘ‌ట‌న చోటుచేసుకున్న‌ది. సికింద్రాబాద్ అల్వాల్‌లో ఉన్న బాలిక హాస్ట‌ల్‌లో (Girls Hostel) ఆదివారం తెల్ల‌వారుజామున అగ్నిప్ర‌మాదం జ‌రిగింది.

G

Hyderabad | Published On Jan 25, 2026, 8.19 am IST

Fire Accident | బాలిక‌ల హాస్ట‌ల్‌లో అగ్నిప్ర‌మాదం.. 20 మంది విద్యార్థినుల‌కు అస్వ‌స్థ‌త‌
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: హైద‌రాబాద్‌లోని నాంప‌ల్లిలో అగ్నిప్ర‌మాద (Fire Accident) ఘ‌ట‌న మ‌రువ‌క ముందే మ‌రో ఘ‌ట‌న చోటుచేసుకున్న‌ది. సికింద్రాబాద్ అల్వాల్‌లో ఉన్న బాలిక హాస్ట‌ల్‌లో (Girls Hostel) ఆదివారం తెల్ల‌వారుజామున అగ్నిప్ర‌మాదం జ‌రిగింది. నైన్ ఎడ్యుకేష‌న్ హాస్ట‌ల్‌లో వ‌స‌తిగృహం ఐదో అంత‌స్తులో ఒక్క‌సారిగా మంట‌లు చెల‌రేగాయి. పొగ పీల్చ‌డంతో 20 మంది విద్యార్థినులు తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. దీంతో హాస్ట‌ల్ సిబ్బంది వారిని జీడిమెట్ల‌లోని ద‌వాఖాన‌కు త‌ర‌లించారు.

స‌మాచారం అందుకున్న అగ్నిమాప‌క సిబ్బంది ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని మంట‌ల‌ను అదుపుచేశారు. అగ్నిప్ర‌మాదానికి గ‌ల కార‌ణాలు తెలియాల్సి ఉన్న‌ది. ఈ ఘ‌న‌పై కేసు న‌మోదుచేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement