త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ferrari Car Accident | జూబ్లీహిల్స్‌లో ఫెరారీ కారు యాక్సిడెంట్.. సీసీటీవీ ఫుటేజీ వైర‌ల్

Ferrari Car Accident | హైద‌రాబాద్ న‌గ‌రంలోని జూబ్లీహిల్స్‌లో ఆదివారం ఉద‌యం ఫెరారీ కారు బీభ‌త్సం సృష్టించిన సంగ‌తి తెలిసిందే. ఈ ప్ర‌మాద ఘ‌ట‌న‌లో ఫెరారీ కారుతో పాటు మ‌రో రెండు కార్లు, మూడు బైక్‌లు ధ్వంసం అయ్యాయి.

S

Hyderabad | Published On Feb 26, 2026, 7.15 am IST

Ferrari Car Accident | జూబ్లీహిల్స్‌లో ఫెరారీ కారు యాక్సిడెంట్.. సీసీటీవీ ఫుటేజీ వైర‌ల్
Advertisement

Ferrari Car Accident | త్రినేత్ర‌.న్యూస్ : హైద‌రాబాద్ న‌గ‌రంలోని జూబ్లీహిల్స్‌లో ఆదివారం ఉద‌యం ఫెరారీ కారు బీభ‌త్సం సృష్టించిన సంగ‌తి తెలిసిందే. ఈ ప్ర‌మాద ఘ‌ట‌న‌లో ఫెరారీ కారుతో పాటు మ‌రో రెండు కార్లు, మూడు బైక్‌లు ధ్వంసం అయ్యాయి. ఐదుగురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు.

అయితే ఫెరారీ కారు బీభ‌త్సానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ విడుద‌లైంది. ఈ వీడియో ప్ర‌స్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. ఫెరారీ కారు మొద‌ట క‌రెంట్ స్తంభాన్ని ఢీకొట్టి.. త‌ద‌నంత‌రం డివైడ‌ర్‌పై నుంచి దూసుకొచ్చి.. ఎదురుగా వ‌స్తున్న కారును ఢీకొట్టింది. దాని వెనుకాల వ‌స్తున్న మ‌రో కారు కూడా ముందున్న కారును ఢీకొట్టింది. దీంతో మూడు కార్లు, మూడు బైక్‌లు ధ్వంసం అయ్యాయి. ఎయిర్ బెలూన్ల కార‌ణంగా ఎలాంటి ప్రాణ న‌ష్టం సంభ‌వించ‌లేదు. బైక్‌పై ప్ర‌యాణిస్తున్న వ్య‌క్తి గాల్లో ఎగిరిప‌డ్డాడు. కానీ ప్రాణ న‌ష్టం జ‌ర‌గ‌లేదు.

ఫెరారీ కారును డ్రైవింగ్ చేసిన వ్య‌క్తిని క్రాంతిరెడ్డి(30)గా పోలీసులు గుర్తించారు. అయితే మెకానిక‌ల్ ట్రబుల్ కార‌ణంగానే ఫెరారీ కారు ప్ర‌మాదానికి గురైన‌ట్లు పోలీసుల ప్రాథ‌మిక విచార‌ణ‌లో తేలింది. ఈ కారులో ప్ర‌ధానంగా స్టీరింగ్ స‌మ‌స్య ఏర్ప‌డిన‌ట్లు గుర్తించారు. క్రాంతి రెడ్డి వివాహ వేడుక‌కు వెళ్తున్న‌ట్లు నిర్ధారించారు.

https://x.com/TheSiasatDaily/status/2026564204535087546?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2026564204535087546%7Ctwgr%5E7a15de4a94a07d7b549d907524138690e5a112b0%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.siasat.com%2Fcctv-footage-of-ferrari-crash-in-hyderabads-jubilee-hills-reveals-details-3375431%2F

Advertisement
Advertisement