త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Suicide | హైద‌రాబాద్‌లో విషాదం.. పెళ్లైన నెలకే న‌వ వ‌ధువు ఆత్మ‌హ‌త్య‌

Suicide | హైద‌రాబాద్ న‌గ‌రంలోని అంబ‌ర్‌పేట‌లో విషాదం నెల‌కొంది. పెళ్లైన నెల రోజుల‌కే ఓ న‌వ వ‌ధువు ఆత్మ‌హ‌త్య చేసుకుంది.

S

Hyderabad | Published On Dec 15, 2025, 7.12 pm IST

Suicide | హైద‌రాబాద్‌లో విషాదం.. పెళ్లైన నెలకే న‌వ వ‌ధువు ఆత్మ‌హ‌త్య‌

పెళ్లైన నెలకే న‌వ వ‌ధువు ఆత్మ‌హ‌త్య‌

Advertisement

Suicide | హైద‌రాబాద్ : హైద‌రాబాద్ న‌గ‌రంలోని అంబ‌ర్‌పేట‌లో విషాదం నెల‌కొంది. పెళ్లైన నెల రోజుల‌కే ఓ న‌వ వ‌ధువు ఆత్మ‌హ‌త్య చేసుకుంది.

వివ‌రాల్లోకి వెళ్తే.. అంబ‌ర్‌పేట ప‌రిధిలోని గోల్నాక‌కు చెందిన న‌జీన్ బేగంకు అదే ప్రాంతానికి చెందిన ఆయుబ్ జ‌బ్రీతో ఈ ఏడాది న‌వంబ‌ర్‌లో పెళ్లైంది. గ‌త కొద్ది రోజుల నుంచి ఆయుబ్ జ‌బ్రీ.. అద‌న‌పు క‌ట్నం తేవాల‌ని భార్య‌ను వేధింపుల‌కు గురి చేస్తున్నాడు. బంగారు ఆభ‌ర‌ణాలు కూడా తీసుకురావాల‌ని డిమాండ్ చేస్తున్నారు. పుట్టింటి నుంచి డ‌బ్బులు తేక‌పోతే చంపేస్తాన‌ని ఆమె బెదిరింపుల‌కు గురి చేశాడు. అత్త‌మామ‌ల హింస‌ను, భ‌ర్త డిమాండ్స్‌ను త‌మ త‌ల్లిదండ్రుల‌కు ఫోన్‌లో తెలిపింది న‌జీన్. ఆ త‌ర్వాత ఆదివారం రాత్రి త‌న గ‌దిలో ఉరేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకుంది.

బిడ్డ ఆత్మ‌హ‌త్య‌పై త‌ల్లిదండ్రులు అంబ‌ర్‌పేట పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ఆయుబ్ జ‌బ్రీతో పాటు ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌పై కేసు న‌మోదు చేశారు. న‌జీన్ ఆత్మ‌హ‌త్య‌పై విచార‌ణ జ‌రుపుతున్నామ‌ని అంబ‌ర్‌పేట ఎస్ఐ టీ కిర‌ణ్ కుమార్ తెలిపారు.

Advertisement

తాజావార్తలు

Advertisement