త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kiara Advani | టాక్సిక్‌లో విల‌న్ పాత్ర‌ల‌తో షాకివ్వ‌నున్న స్టార్‌ హీరోయిన్లు – సీక్రెట్‌ రివీల్ చేసిన య‌శ్‌

కేజీఎఫ్ 2 బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌ర్వాత య‌శ్ హీరోగా న‌టిస్తోన్న టాక్సిక్‌పై పాన్ ఇండియ‌న్ లెవెల్‌లో భారీగా బ‌జ్ నెల‌కొంది. పీరియాడిక‌ల్ గ్యాంగ్‌స్ట‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాలో న‌లుగురు హీరోయిన్లు న‌టిస్తోన్నారు. ఇందులో న‌య‌న‌తార‌, కియారా అద్వానీ నెగెటివ్ రోల్స్‌లో క‌నిపించ‌బోతున్నార‌ట‌. టాక్సిక్ ప్ర‌మోష‌న్స్‌లో య‌శ్ ఈ సీక్రెట్ రివీల్ చేశాడు.

N

Entertainment | Published On May 24, 2026, 4.22 pm IST

Kiara Advani | టాక్సిక్‌లో విల‌న్ పాత్ర‌ల‌తో షాకివ్వ‌నున్న స్టార్‌ హీరోయిన్లు – సీక్రెట్‌ రివీల్ చేసిన య‌శ్‌
Advertisement

Kiara Advani | హీరోయిన్లు గ్లామ‌ర్‌, పాట‌ల‌ కోస‌మే అనే ట్రెండ్‌ను నేటిత‌రం నాయిక‌లు తిర‌గ‌రాస్తున్నారు. హీరోలుగా ధీటుగా యాక్ష‌న్ రోల్స్‌తో అద‌ర‌గొడుతోన్నారు. అవ‌స‌ర‌మైతే విల‌న్స్‌గా కూడా న‌టించ‌డానికి రెడీ అంటున్నారు. తాజాగా య‌శ్ టాక్సిక్‌లో స్టార్ హీరోయిన్లు న‌య‌న‌తార, కియారా అద్వానీ నెగెటివ్ షేడ్స్‌లో క‌నిపించ‌బోతున్నార‌ట‌. ఈ విష‌యాన్ని హీరో య‌శ్ స్వ‌యంగా రివీల్ చేశాడు.

న‌లుగురు హీరోయిన్లు...

య‌శ్ హీరోగా న‌టిస్తోన్న టాక్సిక్‌కు మ‌ల‌యాళ ఫిల్మ్ మేక‌ర్ గీతూ మోహ‌న్ దాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. పీరియాడిక‌ల్ గ్యాంగ్‌స్ట‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాలో న‌య‌న‌తార‌, కియారా అద్వానీ, తారా సుతారియా, రుక్మిణి వ‌సంత్ హీరోయిన్లుగా న‌టిస్తోన్నారు.

సీక్రెట్ రివీల్‌...

ఈ న‌లుగురు హీరోయిన్ల ఫ‌స్ట్ లుక్‌ల‌ను ఇటీవ‌ల మేక‌ర్స్ రిలీజ్ చేశారు. అయితే వారి పాత్ర‌ల గురించి మాత్రం ఎలాంటి వివ‌రాలు వెల్ల‌డించ‌లేదు. తాజాగా టాక్సిక్ ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూలో న‌య‌న‌తార‌, కియారా అద్వానీ రోల్స్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ సీక్రెట్‌ను య‌శ్ బ‌య‌ట‌పెట్టాడు.

నెగెటివ్ షేడ్స్‌తో...

ఈ సినిమాలో న‌య‌న‌తార‌తో పాటు కియారా అద్వానీ పాత్ర‌లు పూర్తిగా నెగెటివ్ షేడ్స్‌తో సాగుతాయ‌ట‌. హీరోయిన్ క్యారెక్ట‌ర్ల‌ను రొటీన్ ఫార్మాట్‌లో కాకుండా డిఫ‌రెంట్‌గా డైరెక్ట‌ర్ గీతూ మోహ‌న్ దాస్ స్క్రీన్‌పై ప్ర‌జెంట్ చేశారు. న‌య‌న‌తార‌, కియారా అద్వానీ పాత్ర‌లు విల‌నిజం ఛాయ‌ల‌తో చాలా ప‌వ‌ర్‌ఫుల్‌గా ఉంటాయి. గ‌త సినిమాల‌కు భిన్నంగా చాలా ఇంటెన్స్ ప‌ర్ఫార్మెన్స్‌తో బ్యాడాస్ ఉమెన్స్‌గా వీరిద్ద‌రు ఆక‌ట్టుకుంటారు. హీరోయిన్ల‌ను ఇప్ప‌టివ‌ర‌కు ఎవ‌రూ ఈ స్థాయి గ్రే షేడ్స్‌లో చూపించ‌లేద‌ని ఆడియెన్స్ ఫీల‌య్యేలా న‌య‌న్‌, కియారా క్యారెక్ట‌ర్లు సాగుతాయి అని య‌శ్ అన్నారు. అత‌డి కామెంట్స్ వైర‌ల్ అవుతోన్నాయి.

కేజీఎఫ్‌, కేజీఎఫ్ 2 త‌ర్వాత య‌శ్ హీరోగా న‌టిస్తోన్న ఈ మూవీపై పాన్ ఇండియ‌న్ లెవెల్‌లో భారీగా అంచ‌నాలు నెల‌కొన్నాయి. మార్చి 27న రిలీజ్ కావాల్సిన ఈ సినిమాను జూన్ 4కు వాయిదావేశారు. కానీ పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు డిలే కావ‌డంతో జూన్ 4న కూడా ఈ మూవీ విడుద‌ల కావ‌డం లేద‌ని ఇటీవ‌లే ప్ర‌క‌టించారు మేక‌ర్స్‌. కొత్త రిలీజ్ డేట్‌ను త్వ‌ర‌లో వెల్ల‌డిస్తామ‌ని అన్నారు.

 

Advertisement
Advertisement