Vishnu Vinyasam | రిలీజ్‌కు ముందే విష్ణువిన్యాసం లీకయ్యింది – శ్రీవిష్ణు కామెంట్స్
రిలీజ్‌కు ముందే విష్ణువిన్యాసం మూవీ లీకయ్యిందట. లీకయిన వీడియోలను నిర్మాతకు పంపిస్లూ హ్యాకర్లు ఆయన్ని బ్లాక్‌మెయిల్ చేశారట. ఈ లీక్‌పై శనివారం జరిగిన విష్ణువిన్యాసం మూవీ థాంక్స్ మీట్‌లో శ్రీవిష్ణు చేసిన కామెంట్లు వైరల్ అవుతోన్నాయి.
Entertainment | Published On Feb 28, 2026, 3.03 pm IST
Vishnu Vinyasam | శ్రీవిష్ణు హీరోగా నటించిన విష్ణు విన్యాసం మూవీ రిలీజ్‌కు ముందే లీకయ్యిందట. డబ్బుల కోసం హ్యాకర్లు నిర్మాతను బ్లాక్‌మెయిల్ చేశారట. ఈ విషయాన్ని హీరో శ్రీవిష్ణు స్వయంగా వెల్లడించాడు. విష్ణువిన్యాసం మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. శనివారం మేకర్స్ థాంక్స్ మీట్‌ను నిర్వహించారు. ఈ వేడుకలో లీక్ గురించి శ్రీవిష్ణు రివీల్ చేశారు. ఫాస్ట్‌గా షూటింగ్ కంప్లీట్ చేయడంతో పాటు మృత్యుంజయ్‌తో పాటు ఒకే రోజున రిలీజ్ చేయాలనుకోవడం వెనుక ఓ బలమైన కారణం ఉందని శ్రీవిష్ణు చెప్పాడు.
డిసెంబర్‌లో లీక్...
"విష్ణువిన్యాసం షూటింగ్ జరుగుతోండగా.. అప్పటివరకు షూట్ చేసిన ఫుటేజ్ మొత్తం డిసెంబర్‌లో లీకయ్యింది. ఎలా జరిగిందో అర్థం కాలేదు. సినిమా అప్పటికి పూర్తిగా కంప్లీట్ కాలేదు. బయటకు చెబితే వేరే విధంగా వెళ్లిపోతుందని భయపడ్డాం. చెన్నై నుంచే ఈ సినిమాను హ్యాకర్లు లీక్ చేశారు. డబ్బుల కోసం మా నిర్మాతను బ్లాక్‌మెయిల్ చేశారు. ఈ లీక్‌పై పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాం. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. డబ్బుల కోసం బెదిరిస్తూ ప్రతి రీల్ రీల్‌కు నిర్మాతను బెదిరించారు. రిలీజ్ ముందు రోజు వరకు ఇదంతా జరిగింది" అని శ్రీవిష్ణు అన్నారు. గత ఏడాది రిలీజైన ఓ పెద్ద సినిమాకు కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైందని శ్రీవిష్ణు పేర్కొన్నారు.
మా యూనిట్ నుండే...
నిర్మాత సుమంత్ నాయుడు కూడా ఈ లీక్‌పై రియాక్ట్ అయ్యారు. "మా యూనిట్ నుంచే తెలియకుండా సినిమా ఫుటేజ్ హ్యాకర్ల చేతికి వెళ్లిపోయింది. ప్రతి రోజు వీడియో క్లిప్‌లను నాకు పంపిస్తూ బెదిరించేవారు. ఆ నెంబర్‌ను ట్రేస్ చేసి ఛాంబర్‌లో ఫిర్యాదు చేశాం. ఈ లీక్ వల్ల గత కొద్ది రోజులుగా ఎంతో మానసిక క్షోభను అనుభవించా. అందుకే వేగంగా షూటింగ్ కంప్లీట్ చేసి సినిమాను రిలీజ్ చేయాల్సివచ్చింది" అని చెప్పారు.
విష్ణువిన్యాసం మూవీకి యదునాథ్ మారుతీరావు దర్శకత్వం వహించారు. ఫన్ లవ్‌స్టోరీగా రూపొందిన ఈ సినిమాలో నయన్ సారిక హీరోయిన్‌గా నటించింది. జాతకాలు, మూఢనమ్మకాల కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ మూవీ మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది.
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



