త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Vijay Trisha Movies | విజ‌య్‌, త్రిష కాంబినేష‌న్‌లో వ‌చ్చిన సూప‌ర్‌హిట్ త‌మిళ సినిమాలు ఇవే – తెలుగు రీమేక్‌తో బ్లాక్‌బ‌స్ట‌ర్‌

గురువారం జ‌రిగిన ఓ తమిళ నిర్మాత కొడుకు రిసెప్ష‌న్ వేడుక‌లో విజ‌య్‌, త్రిష జంట‌గా క‌నిపించ‌డం కోలీవుడ్ నాట ఆస‌క్తిక‌రంగా మారింది. త్రిష‌తో బంధంపై ఈ రిసెప్ష‌న్‌తో విజ‌య్ ఇన్‌డైరెక్ట్‌గా క్లారిటీ ఇచ్చిన‌ట్లు చెబుతోన్నారు. అస‌లు విజ‌య్‌, త్రిష క‌లిసి త‌మిళంలో ఎన్ని సినిమాలు చేశారంటే?

N

Entertainment | Published On Mar 6, 2026, 3.28 pm IST

Vijay Trisha Movies | విజ‌య్‌, త్రిష కాంబినేష‌న్‌లో వ‌చ్చిన సూప‌ర్‌హిట్ త‌మిళ సినిమాలు ఇవే – తెలుగు రీమేక్‌తో బ్లాక్‌బ‌స్ట‌ర్‌
Advertisement

Vijay Trisha Movies | వ్య‌క్తిగ‌త జీవితం తాలూకు వివాదాల‌తో గ‌త కొద్ది రోజులుగా వార్త‌ల్లో నిలుస్తున్నారు ద‌ళ‌ప‌తి విజ‌య్‌. ఈ త‌మిళ అగ్ర హీరో నుండి విడాకులు కావాలంటూ అత‌డి భార్య సంగీత ఇటీవ‌ల‌ కోర్టును ఆశ్ర‌యించ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఓ హీరోయిన్‌తో వివాహేత‌ర సంబంధం పెట్టుకున్నాడంటూ విజ‌య్‌పై సంగీత ఆరోప‌ణ‌లు చేసింది. ఆ హీరోయిన్ త్రిష‌నే అంటూ గ‌త కొద్ది రోజులుగా కోలీవుడ్‌లో జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఒకే కారులో...

ఈ పుకార్ల‌కు బ‌లం చేకూరుస్తూ గురువారం ఓ నిర్మాత కొడుకు రిసెప్ష‌న్‌కు విజ‌య్‌, త్రిష ఒకే కారులో రావ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇన్‌డైరెక్ట్‌గా ఈ వెడ్డింగ్ రిసెప్ష‌న్‌తో త్రిష‌తో ప్రేమ‌లో ఉన్న‌ట్లుగా విజ‌య్ ప్ర‌క‌టించాడంటూ కోలీవుడ్ వ‌ర్గాలు చెబుతోన్నాయి. వీరిద్ద‌రి ఫొటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోన్నాయి. సంగీత‌కు విడాకులు ఇచ్చి త్రిష‌ను విజ‌య్ పెళ్లిచేసుకోబోతున్న‌ట్లు చెబుతున్నారు. విడాకుల కోసం భార్య సంగీత‌కు విజ‌య్ రెండు వంద‌ల కోట్ల‌కుపైనే భ‌రణంగా చెల్లించ‌డానికి అంగీక‌రించిన‌ట్లు కోలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. విజ‌య్, త్రిష జంట‌గా క‌నిపించ‌డంతో వీరి ల‌వ్‌స్టోరీ ఎలా మొద‌లైంద‌నే దాని గురించి నెటిజ‌న్లు తెగ వెతుకుతున్నారు . విజ‌య్‌, త్రిష  క‌లిసి చేసిన సినిమాలు పోస్ట‌ర్లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోన్నాయి.కోలీవుడ్‌లో మోస్ట్ స‌క్సెస్‌ఫుల్ కాంబినేష‌న్‌లో విజ‌య్‌, త్రిష జోడీ ఒక‌టి. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో ఇప్ప‌టివ‌ర‌కు ఐదు సినిమాలు వ‌చ్చాయి. అన్నీ బ్లాక్‌బ‌స్ట‌ర్స్‌గా నిల‌వ‌డం గ‌మ‌నార్హం.

మ‌హేష్ రీమేక్‌తో...

గిల్లీ మూవీతో 2004లో ఫ‌స్ట్ టైమ్ విజ‌య్, త్రిష జోడీ త‌మిళ ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించింది. మ‌హేష్‌బాబు ఒక్క‌డు రీమేక్‌గా తెర‌కెక్కిన గిల్లీ బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిచింది. ఈ సినిమాలో వేలు, ధ‌న‌ల‌క్ష్మి పాత్ర‌ల్లో విజ‌య్‌, త్రిష త‌మ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకున్నారు. అప్పాడి పోడు అనే పాట ట్రెండ్‌సెట్ట‌ర్‌గా మారింది.

నాలుగేళ్ల‌లో నాలుగు సినిమాలు...

గిల్లి రిలీజైన త‌ర్వాతి ఏడాదే త‌న నెక్స్ట్ మూవీని కూడా త్రిష‌తోనే చేశారు విజ‌య్‌. తిరుపాచిలో మూవీతో ఈ జోడీ మ‌రో పెద్ద హిట్‌ను త‌మ ఖాతాలో వేసుకున్నారు. ఆ త‌ర్వాత చేసిన ఆది, కురివి సినిమాల్లోనూ త్రిష‌నే హీరోయిన్‌గా విజ‌య్ కొన‌సాగించ‌డం అప్ప‌ట్లో కోలీవుడ్‌లో ఆస‌క్తిని రేకెత్తించింది. వీరిద్ద‌రి మ‌ధ్య ప్రేమాయ‌ణంపై అప్పుడే పుకార్లు మొద‌ల‌య్యాయి. ఈ పుకార్ల‌తో సంబంధం లేకుండా ఆది, కురివి సినిమాలు బాక్సాఫీస్ రికార్డుల‌ను తిర‌గ‌రాశాయి.

లియోతో ప‌దిహేనేళ్ల త‌ర్వాత‌...

2008లో రిలీజైన కురివి త‌ర్వాత విజ‌య్‌, త్రిష ప‌దిహేనేళ్ల పాటు క‌లిసి సినిమాలు చేయ‌లేదు. లాంగ్ గ్యాప్ త‌ర్వాత లోకేష్ క‌న‌గ‌రాజ్ లియోతో మ‌ళ్లీ వీరిద్ద‌రు స్క్రీన్ షేర్ చేసుకున్నారు. లియో షూటింగ్‌లోనే వీరిద్ద‌రి మ‌ధ్య ప్రేమ బ‌ల‌ప‌డిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ సినిమా రిలీజైన త‌ర్వాత కూడా విజ‌య్‌, త్రిష క‌లిసి నార్వేకు వెకేష‌న్ వెళ్లిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొట్టాయి.
లియో త‌ర్వాత విజ‌య్ హీరోగా న‌టించిన ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్‌లో విజ‌య్ ఓ సాంగ్‌లో స్పెష‌ల్ రోల్‌లో త‌ళుక్కున మెరిసింది. విజ‌య్ కోస‌మే ఈ సినిమాలో ఆమె న‌టించిన‌ట్లు రూమర్లు వినిపించాయి.

 

Advertisement
Advertisement