త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Varalaxmi Sarathkumar | డైరెక్ట‌ర్‌గా మారిన లేడీ విల‌న్ – ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేసిన స‌మంత

విల‌న్ పాత్ర‌ల‌తో తెలుగు ఆడియెన్స్‌ను మెప్పించిన వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ డైరెక్ట‌ర్‌గా మారింది. ఫ‌స్ట్ టైమ్ మెగాఫోన్ ప‌ట్టి స‌ర‌స్వ‌తి పేరుతో ఓ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ మూవీని తెర‌కెక్కించింది. ఈ మూవీ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ శ‌నివారం రిలీజైంది.

N

Entertainment | Published On Feb 14, 2026, 5.25 pm IST

Varalaxmi Sarathkumar | డైరెక్ట‌ర్‌గా మారిన లేడీ విల‌న్ – ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేసిన స‌మంత
Advertisement

Varalaxmi Sarathkumar |  తెలుగు, త‌మిళ భాష‌ల్లో హీరోయిన్‌గా కంటే విల‌న్ పాత్ర‌ల‌తోనే ఎక్కువ‌గా ఫేమ‌స్ అయ్యింది వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్‌. తెలుగులో య‌శోద‌, క్రాక్‌, తెనాలి రామ‌కృష్ణ‌తో పాటు ప‌లు సినిమాల్లో నెగెటివ్ షేడ్స్‌తో కూడిన క్యారెక్ట‌ర్‌లో అద‌ర‌గొట్టింది. విల‌న్‌గానే కాకుండా క్యారెక్ట‌ర్ యాక్ట‌ర్‌గా ప‌లు సూప‌ర్ హిట్ సినిమాల్లో క‌నిపించింది. ఇన్నాళ్లు కెమెరా ముందు యాక్టింగ్‌తో అద‌ర‌గొట్టిన వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ తాజాగా మెగాఫోన్ ప‌ట్టింది. డైరెక్ట‌ర్‌గా మారి స‌ర‌స్వ‌తి పేరుతో ఓ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ మూవీని తెర‌కెక్కించింది. ఇందులో వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ లీడ్ రోల్‌లో న‌టిస్తోంది. డైరెక్ట‌ర్‌గానే కాకుండా ఈ సినిమాను త‌న సోద‌రి పూజాతో క‌లిసి వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ స్వ‌యంగా నిర్మించింది. ఈ సినిమాలో ప్ర‌కాష్ రాజ్‌, న‌వీన్ చంద్ర‌, రాధిక‌, ప్రియ‌మ‌ణి కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నారు.

ఇంటెన్స్ లుక్‌లో....

స‌ర‌స్వ‌తి మూవీ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను శ‌నివారం హీరోయిన్ స‌మంత రిలీజ్ చేసింది. వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ సినిమాకు స‌మంత స‌పోర్ట్‌గా నిల‌వ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. స‌మంత హీరోయిన్‌గా న‌టించిన య‌శోద మూవీలో వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ విల‌న్‌గా క‌నిపించింది. కాగా స‌ర‌స్వ‌తి ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌లో ఎరుపు రంగు చీర‌లో వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ క‌నిపిస్తోంది. బ్యాక్‌డ్రాప్‌లో ప్ర‌కాష్ రాజ్ ఇంటెన్స్ లుక్‌లో ఉండ‌టం ఆస‌క్తిని పంచుతోంది. ఈ సినిమాకు త‌మ‌న్‌ మ్యూజిక్ అందిస్తుండ‌టం గ‌మ‌నార్హం. తెలుగుతో పాటు త‌మిళంలో ఒకే సారి ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. స‌మ్మ‌ర్‌లో స‌ర‌స్వ‌తిని ప్రేక్ష‌కుల ముందుకు రానున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

హాలీవుడ్‌లో...

ప్ర‌స్తుతం మ‌ల‌యాళంలో ధీర‌న్‌తో పాటు హాలీవుడ్‌లో రిజానా పేరుతో ఓ సినిమా చేస్తోంది వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్‌. సినిమాలే కాకుండా తెలుగులో అద్ధం, మాన్ష‌న్ 24 సినిమాలు కూడా చేసింది వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్‌.

 

Advertisement

తాజావార్తలు

Advertisement