Trisha | సినిమాలకు త్రిష గుడ్‌బై – కోలీవుడ్ నిర్మాత కామెంట్స్ వైరల్
చెన్నై క్వీన్ త్రిష సినిమాలకు గుడ్‌బై చెప్పబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇకపై సినిమాలు చేయాలనుకోవడం లేదని తనను అప్రోచ్ అయిన దర్శకనిర్మాతలకు త్రిష బదులిస్తున్నట్లు సమాచారం. త్రిష సినిమాల నుంచి వైదొలుగుతున్న మాట నిజమేనని కోలీవుడ్ దర్శకనిర్మాత చిత్రా లక్ష్మణన్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతోన్నాయి.
Entertainment | Published On Apr 6, 2026, 7.33 pm IST
Trisha | సినిమాలతో కాకుండా దళపతి విజయ్‌తో రిలేషన్ కారణంగా గత కొన్నాళ్లుగా ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది చెన్నై క్వీన్ త్రిష. భార్య సంగీతకు విడాకులు ఇచ్చి త్రిషను విజయ్ పెళ్లిచేసుకోబోతున్నట్లు రూమర్లు వినిపిస్తున్నాయి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల తర్వాత విజయ్, త్రిష వివాహంపై అఫీషియల్‌గా క్లారిటీ రాబోతున్నట్లు సమాచారం.
విజయ్‌తో రిలేషన్, పెళ్లి రూమర్ల నడుమ త్రిష ఓ షాకింగ్ డెసిషన్ తీసుకున్నట్లు సమాచారం. సినిమాలకు గుడ్‌బై చెప్పాలని నిర్ణయించుకుందట.
నో అపాయింట్‌మెంట్...
గత కొద్ది రోజులుగా త్రిషను కలిసి కథ చెప్పాలని దర్శకులు, ఆమెను తమ సినిమాలో హీరోయిన్‌గా తీసుకోవాలని నిర్మాతలు చెన్నై క్వీన్‌ను అప్రోచ్ అయ్యే ప్రయత్నాలు చేస్తున్నారట. కానీ త్రిష మాత్రం ఎవరికి అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదని కోలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇకపై సినిమాలు చేయనని సదరు దర్శకనిర్మాతలకు త్రిష అన్సర్ ఇస్తున్నట్లు చెబుతున్నారు.
దర్శకుడి కామెంట్స్...
త్రిష సినిమాల నుంచి వైదొలుగుతున్నది నిజమేనని కోలీవుడ్ దర్శకనిర్మాత చిత్రాలక్ష్మణన్ అన్నారు. తనకు పరిచయమున్న కొందరు దర్శకనిర్మాతలు కూడా ఈ మాట చెప్పారని చిత్రా లక్ష్మణన్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతోన్నాయి.
రెండు సినిమాలు...
సినిమాలకు గుడ్‌బై చెప్పడంపై త్రిష కూడా అఫీషియల్‌గా అనౌన్స్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. ప్రస్తుతం కరుప్పుతో పాటు చిరంజీవి విశ్వంభర సినిమాలు చేస్తోంది త్రిష. ఈ రెండు సినిమాలు వేసవిలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ సినిమాల రిలీజ్ తర్వాత త్రిష నుంచి ప్రకటన రావచ్చునని టాక్ వినిపిస్తోంది.
కరుప్పు మూవీలో సూర్య హీరోగా నటిస్తోన్నాడు. ఆర్‌జే బాలాజీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా వీరభద్రుడు పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరోవైపు విశ్వంభర మూవీకి వశిష్ట మల్లిడి దర్శకత్వం వహించాడు. గత ఏడాది రిలీజ్ కావాల్సిన ఈ సినిమా వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ పనులు డిలే వల్ల వాయిదాపడింది.
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



