Thiruveer | నాయనొచ్చిండు…తెలంగాణ హీరో తిరువీర్ భావోద్వేగం
Thiruveer | టాలీవుడ్ యంగ్ హీరో తిరువీర్ తండ్రిగా ప్రమోషన్ పొందాడు. తిరువీర్ భార్య కల్పరావు శుక్రవారం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. నాయినొచ్చిండు అంటూ తాను తండ్రయిన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తీరువీర్ అభిమానులతో పంచుకున్నాడు.
Entertainment | Published On Dec 12, 2025, 1.11 pm IST
తిరువీర్
Thiruveer | కాన్సెప్ట్ ఓరియెంటెడ్ కథాంశాలతో వరుస విజయాలతో అందుకుంటున్నాడు టాలీవుడ్ యంగ్ హీరో తిరువీర్(Thiruveer). అతడు హీరోగా నటించిన ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఉత్తరాంధ్ర బ్యాక్‌డ్రాప్‌లో ఫన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ మూవీ డీసెంట్ హిట్‌గా నిలిచింది.
ఈ సక్సెస్‌తో ఫుల్ హ్యాపీలో ఉన్న తిరువీర్ మరో గుడ్‌న్యూస్ వినిపించాడు. తండ్రిగా ప్రమోషన్ పొందాడు.
తాను తండ్రయిన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. నాయినొచ్చిండు అంటూ చిన్నారి చేయిని పట్టుకున్న ఓ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. తిరువీర్ భార్య కల్పనరావు శుక్రవారం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. తండ్రయిన తిరువీర్‌కు అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు.
గత ఏడాది కల్పనరావుతో తిరువీర్ పెళ్లి జరిగింది. చాలా కాలం పాటు ప్రేమలో ఉన్న ఈ జంట 2024 ఏప్రిల్‌లో పెద్దల అంగీకారంతో పెళ్లిపీటలు ఎక్కారు. కుటుంబసభ్యులు, కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో ఈ జంట వివాహం జరిగింది.
థియేటర్ ఆర్టిస్ట్‌గా కెరీర్ మొదలుపెట్టిన తిరువీర్ బొమ్మల రామారం సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఘాజీ, జార్జిరెడ్డి, పలాస 1978తో పాటు మరికొన్ని సినిమాల్లో డిఫరెంట్ రోల్స్ చేశాడు. నాని టక్ జగదీష్ మూవీలో విలన్‌గా నటించాడు.
2022లో వచ్చిన హారర్ మూవీ మసూదతో హీరోగా ఫస్ట్ బ్లాక్‌బస్టర్‌ను అందుకున్నారు. ఆ తర్వాత పరేషాన్ పేరుతో ఓ కామెడీ మూవీ కూడా చేశాడు. ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో హిట్‌తో తిరువీర్‌కు ఆఫర్లు పెరిగాయి. ప్రస్తుతం ఓ సుకుమారితో పాటు మరో మూడు సినిమాలు చేస్తున్నాడు.
టాలీవుడ్ యంగ్ హీరో తిరువీర్ తండ్రిగా ప్రమోషన్ పొందాడు. తిరువీర్ భార్య కల్పరావు శుక్రవారం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. నాయినొచ్చిండు అంటూ తాను తండ్రయిన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తీరువీర్ అభిమానులతో పంచుకున్నాడు.
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



