త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sreeleela | శ్రీ‌వారి సేవ‌లో టాలీవుడ్ ప్ర‌ముఖులు.. శ్రీ‌లీల‌తో సెల్ఫీలు తీసుకునేందుకు పోటీప‌డ్డ అభిమానులు

P

Entertainment | Published On Feb 9, 2026, 8.22 pm IST

Sreeleela | శ్రీ‌వారి సేవ‌లో టాలీవుడ్ ప్ర‌ముఖులు.. శ్రీ‌లీల‌తో సెల్ఫీలు తీసుకునేందుకు పోటీప‌డ్డ అభిమానులు
Advertisement

Sreeleela | టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీలీల తిరుమల వేంకటేశ్వరస్వామిని సోమ‌వారం ద‌ర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అంత‌కు ముందు ఆమెకు టీటీడీ అధికారులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. ద‌ర్శ‌నాల అనంత‌రం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేసి, తీర్థ ప్ర‌సాదాల‌ను అంద‌జేశారు.

శ్రీలీల ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శ్రీ‌లీల‌ను చూసిన అభిమానులు ఆమెతో ఫొటోలు దిగేందుకు ఆస‌క్తి చూపించారు. ఇదిలా ఉండ‌గా.. శ్రీ‌లీల ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో ఫుల్ బిజీగా ఉన్న‌ది. తెలుగు, తమిళ, హిందీ సినిమాల్లో మంచి క్రేజ్ సంపాదించింది.

ప్రస్తుతం శ్రీలీల ధనుష్, రాజ్‌కుమార్ కాంబోలో వ‌స్తున్న ‘డీ55’ చిత్రంలో నటిస్తున్నారు. మూవీ షూటింగ్ మొద‌లైంది. ఇదిలా ఉండ‌గా.. టాలీవుడ్ యంగ్ హీరో తేజా స‌జ్జా, మ్యూజిక్ డైరెక్ట‌ర్ థ‌మ‌న్‌తో పాటు సింగ‌ర్స్ ద‌ర్శించుకున్నారు.

Advertisement
Advertisement