త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Thalapathy Vijay Wife Sangeetha | ద‌ళ‌ప‌తి విజ‌య్‌తో స‌మానంగా సంగీత ఆస్తులు – అభిమానిగా ప‌రిచ‌య‌మై భార్య‌గా మారి…

ద‌ళ‌ప‌తి విజ‌య్ విడాకుల వార్త‌లు ద‌క్షిణాది సినీ, రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. విజ‌య్ నుంచి విడాకులు కోరుతూ ఆయ‌న భార్య సంగీత కోర్టు మెట్లు ఎక్కింది. సంగీత బ్యాక్‌గ్రౌండ్ ఏమిటి? విజ‌య్‌తో ఆమె పెళ్లి ఎలా...ఎప్పుడు జ‌రిగిందంటే?

N

Entertainment | Published On Feb 28, 2026, 6.52 pm IST

Thalapathy Vijay Wife Sangeetha | ద‌ళ‌ప‌తి విజ‌య్‌తో స‌మానంగా సంగీత ఆస్తులు – అభిమానిగా ప‌రిచ‌య‌మై భార్య‌గా మారి…
Advertisement

Thalapathy Vijay Wife Sangeetha |  ద‌ళ‌ప‌తి విజ‌య్, సంగీత విడాకుల వ్య‌వ‌హారం ద‌క్షిణాది సినీ ప‌రిశ్ర‌మ‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఫ్యామిలీ మ్యాన్‌గా పేరు తెచ్చుకున్న విజ‌య్‌కి సంగీత విడాకులు ఇవ్వాల‌ని ఎందుకు నిర్ణ‌యించుకుంది అన్న‌ది రాజ‌కీయ‌, సినీ వ‌ర్గాల్లో ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. 26 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు ప‌ల‌కాల‌ని నిర్ణ‌యించుకున్న సంగీత విడాకుల కోసం అప్లై చేసింది. చెన్నైలోని చెంగ‌ల్ప‌ట్టు కోర్టులో విడాకుల పిటిష‌న్ దాఖ‌లు చేసింది.

న‌టితో రిలేష‌న్‌...

మరో నటితో విజయ్ వివాహేతర సంబంధం పెట్టుకొని తనను మానసికంగా వేదనకు గురిచేశాడని సంగీత ఆరోపించింది. ఆమెతో బంధాన్ని తెచ్చుకుంటాన‌ని మాచ్చిన విజ‌య్‌...దానిని నిల‌బెట్టుకోక‌పోవ‌డ‌మే కాకుండా...ఆ హీరోయిన్‌తో క‌లిసి విదేశాల‌కు విహార‌యాత్ర‌కు వెళ్లాడ‌ని సంగీత త‌న పిటిష‌న్‌లో పేర్కొన్న‌ది. ఈ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించ‌డానికి ఏడాది కాలంగా చాలానే ప్ర‌య‌త్నాలు చేశాన‌ని, అవేవీ ఫ‌లించ‌లేద‌ని సంగీత అన్న‌ది. మ‌రో మార్గం లేకే విడాకుల తీసుకోవాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు చెప్ప‌డం కోలీవుడ్‌లో చ‌ర్చ‌నీయాంశం అయ్యింది.సంగీత పిటిష‌న్‌ను స్వీక‌రించిన కోర్టు ఏప్రిల్ 20న విజ‌య్ విచార‌ణ‌కు హాజ‌రుకావాల‌ని ఆదేశించిన‌ట్లు స‌మాచారం.

మొత్తం ఆస్తులు ఎంతంటే?

కాగా విడాకుల వార్త‌ల‌తో సంగీత గురించి నెటిజ‌న్లు తెగ వెతుకుతున్నారు. విజ‌య, సంగీత పెళ్లి ఎలా జ‌రిగింది? ఆమె బ్యాక్‌గ్రౌండ్ గురించి పోస్ట్‌లు పెడుతున్నారు. సంగీత ఆస్తులు కూడా విజ‌య్‌తో స‌మానంగా భారీగానే ఉన్నాయ‌ట‌. ఆమె మొత్త‌ ఆస్తుల విలువ నాలుగు వంద‌ల కోట్ల‌కుపైనే ఉంటుంద‌ని టాక్‌. లండ‌న్‌తో పాటు త‌మిళ‌నాడులో కోట్ల రూపాయ‌ల విలువైన విల్లాలు , భ‌వ‌నాలు సంగీత పేరిట ఉన్న‌ట్లు స‌మాచారం. సంగీత తండ్రి సొర్న‌లింగం లండ‌న్‌లో బిజినెన్‌మెన్‌గా కొన‌సాగుతోన్నారు. తండ్రి వ్యాపారాల్లో సంగీత‌కు వాటా ఉంద‌ట‌. విజ‌య్ మొత్తం ఆస్తుల విలువ ఆరు వందల‌ కోట్లుపైనే ఉన్న‌ట్లు కోలీవుడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడు విడాకులు తీసుకుంటే భ‌ర‌ణంగా సంగీత‌కు భారీగానే విజ‌య్ ఇవ్వాల్సి ఉంటుంది. అదే జ‌రిగితే ఆస్తుల విష‌యంలో విజ‌య్‌ని సంగీత దాటేయ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు.

అభిమానిగా ప‌రిచ‌య‌మై...

సంగీత...శ్రీలంక త‌మిళియ‌న్‌. వ్యాపారం నిమిత్తం ఆమె తండ్రి సొర్న‌లింగం లండ‌న్‌లో సెటిల‌య్యారు. సంగీత అక్క‌డే పుట్టింద‌ట‌. ఆమెకు లండ‌న్ పౌర‌స‌త్వం ఉంది. విజ‌య్ సినిమాలు చూసి అత‌డి అభిమానిగా మారింద‌ట సంగీత‌. పూవే ఉనక్కాగా రిలీజ్ త‌ర్వాత విజ‌య్‌ని క‌ల‌వ‌డానికి లండ‌న్ నుంచి ఇండియా వ‌చ్చింద‌ట‌. ఆ విష‌యం తెలిసి విజ‌య్ స‌ర్‌ప్రైజ్ అయిన‌ట్లు గ‌తంలో ఓ ఇంట‌ర్వ్యూలో సంగీత స్వ‌యంగా తెలిపింది. అలా వారి మ‌ధ్య మొద‌లైన ప‌రిచ‌యం ప్రేమ‌కు దారితీసింది. పెద్ద‌ల అంగీక‌రారంతో 1999లో విజ‌య్‌, సంగీత పెళ్లిచేసుకున్నారు. విజ‌య్‌, సంగీత పెళ్లి రెండు సార్లు జ‌రిగింది. 1998లో లండ‌న్‌లో రిజిస్ట‌ర్ మ్యారేజీ చేసుకున్న వీరు...1999లో చెన్నైలో హిందూ సంప్ర‌దాయం ప్ర‌కారం ఒక్క‌ట‌య్యారు. వీరికి కుమారుడు జాస‌న్ సంజ‌య్‌, కూతురు దివ్య సాషా ఉన్నారు.

 

Advertisement
Advertisement