త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Thalapathy Vijay | పెళ్లి ఫొటో గిఫ్ట్‌గా ఇచ్చిన అభిమాని – ద‌ళ‌ప‌తి విజ‌య్ రియాక్ష‌న్ వైర‌ల్‌

ద‌ళ‌ప‌తి విజ‌య్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో మంగ‌ళ‌వారం ఆస‌క్తిక‌ర సంఘ‌ట‌న చోటుచేసుకుంది. ఎల‌క్ష‌న్స్ ర్యాలీలో విజ‌య్, సంగీత‌ల పెళ్లి ఫొటో ప‌ట్టుకొని ఓ అభిమాని క‌నిపించాడు.ఆ అభిమాని నుంచి త‌మ పెళ్లి ఫొటోను తీసుకున్నాడు విజ‌య్‌. సంగీత‌తో విడాకుల వార్త‌ల న‌డుమ పెళ్లి ఫొటోతో విజ‌య్ క‌నిపించిన ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

N

Entertainment | Published On Apr 14, 2026, 4.33 pm IST

Thalapathy Vijay | పెళ్లి ఫొటో గిఫ్ట్‌గా ఇచ్చిన అభిమాని – ద‌ళ‌ప‌తి విజ‌య్ రియాక్ష‌న్ వైర‌ల్‌
Advertisement

Thalapathy Vijay |  కోలీవుడ్ అగ్ర హీరో ద‌ళ‌ప‌తి విజ‌య్ త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఫుల్ బిజీగా ఉన్నారు. టీవీకే (త‌మిళ‌గ వెట్రి క‌జ‌గం )పార్టీని స్థాపించిన విజ‌య్ మొద‌టిసారి ఎన్నిక‌ల బ‌రిలో నిలిచాడు. త‌మిళ‌నాడులోని అన్ని అసెంబ్లీ స్థానంలో విజ‌య్ పార్టీ పోటీ చేయ‌బోతున్న‌ది. మ‌రోవైపు విజ‌య్ కూడా రెండు స్థానాల్లో నామినేష‌న్ వేశాడు.

పెళ్లి ఫొటో...

విజ‌య్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో మంగ‌ళ‌వారం ఆస‌క్తిక‌ర సంఘ‌ట‌న చోటుచేసుకుంది. ఓ అభిమాని విజ‌య్‌, సంగీతల పెళ్లి ఫొటోను ప‌ట్టుకొని క‌నిపించాడు. ఈ ఫొటోలో విజ‌య్, సంగీత‌ల‌తో పాటు కోలీవుడ్ సీనియ‌ర్ హీరో విజ‌య్ కాంత్ కూడా ఉన్నాడు. అభిమాని చేతిలో పెళ్లి ఫొటోను చూసిన విజ‌య్‌...దానిని త‌న‌కు ఇవ్వ‌మ‌ని అడిగాడు. సెక్యూరిటీ సిబ్బంది స‌హాయంతో ఆ ఫొటోను తీసుకున్నాడు విజ‌య్‌. ఓ చేతితో పెళ్లి ఫొటో...మ‌రో చేతితో థంబ్స‌ప్ సింబ‌ల్ చూపిస్తూ ఫ్యాన్స్‌కు అభివాదం చేశాడు విజ‌య్‌. ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

విడాకులు కోరుతూ...

ద‌ళ‌ప‌తి విజ‌య్ నుంచి విడాకులు కోరుతూ అత‌డి భార్య సంగీత ఇటీవ‌లే కోర్టును ఆశ్ర‌యించింది. విజ‌య్‌తో ఓ సినీ న‌టికి వివాహేత‌ర సంబంధం ఉంద‌ని ఆరోపించింది. త‌న‌తో పాటు పిల్ల‌ల‌ను ప‌ట్టించుకోకుండా మాన‌సికంగా విజ‌య్ వేధింపుల‌కు గురిచేస్తున్నాడంటూ ఈ కంప్లైంట్‌లో పేర్కొన్న‌ది.

నెటిజ‌న్ల ట్రోల్స్‌...

ఈ విడాకుల వార్త‌ల న‌డుమ పెళ్లి ఫొటోను అభిమాని నుంచి తీసుకోవ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. కొంద‌రు నెటిజ‌న్లు మాత్రం ఎన్నికల్లో సానుభూతి కోసం విజ‌య్ యాక్టింగ్ చేస్తున్నాడంటూ విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. విజ‌య్‌, సంగీత‌ల‌కు 1999లో పెళ్లి జ‌రిగింది. అభిమానిగా విజ‌య్‌కి ప‌రిచ‌య‌మైన సంగీత అత‌డిని ప్రేమించి పెళ్లిచేసుకున్న‌ది. వీరికి ఓ కుమారుడు జాస‌న్ సంజ‌య్‌తో పాటు కుమార్తె దివ్య సాషా ఉన్నారు. కాగా విజ‌య్‌, సంగీత విడాకుల కేసు విచార‌ణ ఏప్రిల్ 20న ఉంది. ఏప్రిల్ 23న త‌మిళ‌నాడు ఎన్నిక‌లు జ‌రుగ‌బోతున్నాయి. విజ‌య్‌, సంగీత విడాకుల‌కు హీరోయిన్ త్రిష‌నే కార‌ణ‌మంటూ వార్త‌లొస్తున్నాయి.
ఈ విడాకుల వ్య‌వ‌హారంతో పాటు విజ‌య్ హీరోగా న‌టించిన చివ‌రి మూవీ జ‌న‌నాయ‌గ‌న్ లీక్ కావ‌డం, క‌రూర్ తొక్కిస‌లాట కేసు.. గ‌త కొన్నాళ్లుగా విజ‌య్‌ని వ‌రుస‌గా వివాదాలు వెంటాడుతున్నాయి.

Advertisement
Advertisement