త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telugu OTT | ఒకే రోజు ఓటీటీలోకి వ‌చ్చిన రెండు తెలుగు సినిమాలు – ఒక్కోటి ఒక్కో జాన‌ర్‌…

తెలుగు సినిమాలు జ‌గ‌న్నాథ్‌... మ‌త్తురా ఒకే రోజు ఒకే ఓటీటీలోకి వ‌చ్చాయి. జ‌గ‌న్నాథ్ సినిమా రొమాంటిక్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్క‌గా... మ‌త్తురా యాక్ష‌న్ జాన‌ర్‌లో రూపొందింది. ఈ రెండు సినిమాలు అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

N

Entertainment | Published On Apr 21, 2026, 3.10 pm IST

Telugu OTT |  ఒకే రోజు ఓటీటీలోకి వ‌చ్చిన రెండు తెలుగు సినిమాలు – ఒక్కోటి ఒక్కో జాన‌ర్‌…
Advertisement

Telugu OTT |  రెండు తెలుగు సినిమాలు ఒకే రోజు ఒకే ఓటీటీలో రిలీజ‌య్యాయి. ఓ సినిమా యాక్ష‌న్‌థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్క‌గా...మ‌రో సినిమా రొమాంటిక్‌ జాన‌ర్‌లో రూపొందింది. రెండు సినిమాలు అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ‌య్యాయి. ఫ్రీగా కాకుండా రెంట‌ల్ విధానంలో స్ట్రీమింగ్ అవుతోన్నాయి.

జ‌గ‌న్నాథ్‌....

రాయ‌ల‌సీమ భ‌ర‌త్ హీరోగా న‌టించిన రొమాంటిక్‌ మూవీ జ‌గ‌న్నాథ్ మంగ‌ళ‌వారం అమెజాన్ ప్రైమ్‌లో రిలీజైంది. ఈ సినిమాలో నిత్య‌శ్రీ సారా, ప్రీతీ హీరోయిన్లుగా న‌టించారు. అజ‌య్‌, బాహుబ‌లి ప్ర‌భాక‌ర్‌, స‌త్య ప్ర‌కాష్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. గ‌త ఏడాది డిసెంబ‌ర్‌లో రిలీజైన ఈ సినిమా దాదాపు నాలుగు నెల‌ల త‌ర్వాత ఓటీటీలోకి వ‌చ్చింది. ఈ సినిమాకు భ‌ర‌త్ - సంతోష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. అజ‌య్ భూప‌తి మంగ‌ళ‌వారం సినిమాతో జ‌గ‌న్నాథ్‌కు పోలిక‌లు వ‌చ్చాయి. కానీ క‌మ‌ర్షియ‌ల్‌గా మాత్రం  సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది.  జగన్నాథ్ ఎవరు...తాను ప్రేమించిన పూరి, జాస్మిన్ అనే అమ్మాయిల కోసం  అతడు   ఓ పెద్ద రౌడీలను ఎందుకు ఎదురించాల్సివచ్చింది అనే అంశాలతో ఈ సినిమా రూపొందింది.

మ‌త్తురా....

యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా రూపొందిన మ‌త్తురా స‌డెన్‌గా స‌డెన్‌గా ఓటీటీలోకి వ‌చ్చింది. ఈ సినిమాలో అనుదీప్‌, అజ‌య్ కుమార్‌, విన‌య్ శంక‌ర్ హీరోలుగా న‌టించారు. పువ్వ‌ల చ‌ల‌ప‌తి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ చిన్న సినిమా కూడా గ‌త ఏడాది సెప్టెంబ‌ర్‌లో థియేట‌ర్ల‌లో రిలీజైంది. క‌మ‌ర్షియ‌ల్‌గా ఆశించిన విజ‌యాన్ని సాధించ‌లేదు. డ్ర‌గ్ మాఫియాను ఎదురించి ఓ న‌లుగురు యువ‌కులు ఎలాంటి పోరాటం సాగించారు అన్న‌దే ఈ మూవీ క‌థ‌.

 

Advertisement
Advertisement