Tejeswini | తేజస్విని సినీ ఎంట్రీకి రంగం సిద్ధం..! కథను సిద్ధం చేస్తున్న లేడి డైరెక్టర్..!
Tejeswini | నందమూరి కుటుంబం నుంచి మరో వారసురాలు వెండితెరపై మెరవనున్నారా..? ప్రస్తుతం సినీ వర్గాల్లో ఇదే చర్చ సాగుతోంది. నటసింహం నందమూరి బాలకృష్ణ కుమార్తె తేజస్విని నందమూరి హీరోయిన్‌గా టాలీవుడ్‌కు ఎంట్రీ ఇవ్వనుందని గత కొంతకాలంగా వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
Entertainment | Published On Aug 5, 2026, 6.08 pm IST
Tejeswini | నందమూరి కుటుంబం నుంచి మరో వారసురాలు వెండితెరపై మెరవనున్నారా..? ప్రస్తుతం సినీ వర్గాల్లో ఇదే చర్చ సాగుతోంది. నటసింహం నందమూరి బాలకృష్ణ కుమార్తె తేజస్విని నందమూరి హీరోయిన్‌గా టాలీవుడ్‌కు ఎంట్రీ ఇవ్వనుందని గత కొంతకాలంగా వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ విషయంపై ఇప్పటివరకు తేజస్విని స్పందించలేదు. ఈ వార్తలను ఖండించకపోవడంపై సినిమాల్లోకి రావడమే చర్చ మరింత జోరుగా సాగుతున్నది. బాలకృష్ణ నట వారసత్వాన్ని ఆయన తనయుడు మోక్షజ్ఞ ముందుకు తీసుకెళ్తారని అభిమానులు చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు. మోక్షజ్ఞ సినీ ప్రవేశంపై ఇప్పటికే పలుమార్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే కుటుంబం నుంచి తేజస్విని కూడా సినీరంగం వైపు అడుగులు వేయనున్నారనే ప్రచారం ఆసక్తిని పెంచుతోంది.
తండ్రి బాలకృష్ణ సినీ ప్రయాణంలో తేజస్విని కీలక భాగస్వామిగా వ్యవహరిస్తోంది. ఆయనకు సంబంధించిన వృత్తిపరమైన వ్యవహారాలు, నిర్మాణ సంస్థలతో సమన్వయం, సినిమా పనుల పర్యవేక్షణ వంటి అంశాల్లో ఆమె చురుకైన పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. సోషల్ మీడియాలోనూ అప్పుడప్పుడు తన అభిరుచులకు సంబంధించిన వీడియోలను పంచుకుంటూ అభిమానులతో అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు. వ్యాపారవేత్త, ఎంపీ శ్రీభరత్ మతుకుమిల్లిని వివాహం చేసుకున్న తేజస్వినికి ఓ కుమారుడు ఉన్నారు. కుటుంబ బాధ్యతలను నిర్వహిస్తూనే తండ్రి సినీ వ్యవహారాల్లో తన వంతు పాత్ర పోషిస్తున్నది. ఇప్పుడు నటిగా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించనున్నారనే వార్తలు టాలీవుడ్‌లో చర్చకు దారితీశాయి.
మహిళా ప్రాధాన్యం ఉన్న కథతో తేజస్వినిని పరిచయం చేయాలనే ఆలోచనలో చిత్రబృందం ఉందనే ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో దర్శకురాలు లక్ష్మీ సౌజన్య ఆమె కోసం ఓ కథను సిద్ధం చేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారిక సమాచారం వెలువడలేదు. నందమూరి కుటుంబం నుంచి ఇప్పటికే పలువురు కథానాయకులు ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇప్పుడు అదే కుటుంబం నుంచి ఓ కథానాయికగా తేజస్విని తెరపైకి వస్తారా? అన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. అధికారిక ప్రకటన వచ్చే వరకు ఈ తెరంగేట్రంపై సాగుతున్న చర్చకు మాత్రం కొనసాగనున్నాయి.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Hospital Room Cost | ప్రైవేట్ ఆసుపత్రి గది అద్దె త్రీస్టార్ హోటల్ రేటుకు మించకూడదు.. పార్లమెంటరీ కమిటీ కీలక సిఫార్సు
- ●Khushi Kapoor | బాలీవుడ్ హీరోయిన్ ఆ వీడియోలపై ఢిల్లీ హైకోర్టు సీరియస్.. వెంటనే తొలగించాలంటూ ఆదేశాలు
- ●Telangana | బీసీ మహిళలకు ఆటోమేటిక్ కుట్టు మిషన్లు.. రేపే పథకం ప్రారంభం
- ●Amit Shah | నీట్ అంశంపై చర్చ.. స్పీకర్ ఓం బిర్లాకు అమిత్ షా లేఖ
- ●Jr NTR | ఎన్టీఆర్‌కు సర్జరీ.. కోలుకునేందుకు 3 నెలలు..!
- ●Delhi | షాకింగ్ అధ్యయనం.. ఢిల్లీలో ప్రతి 20 మందిలో ఒకరికి షుగర్, బీపీ..

Hospital Room Cost | ప్రైవేట్ ఆసుపత్రి గది అద్దె త్రీస్టార్ హోటల్ రేటుకు మించకూడదు.. పార్లమెంటరీ కమిటీ కీలక సిఫార్సు

Khushi Kapoor | బాలీవుడ్ హీరోయిన్ ఆ వీడియోలపై ఢిల్లీ హైకోర్టు సీరియస్.. వెంటనే తొలగించాలంటూ ఆదేశాలు

Telangana | బీసీ మహిళలకు ఆటోమేటిక్ కుట్టు మిషన్లు.. రేపే పథకం ప్రారంభం

Amit Shah | నీట్ అంశంపై చర్చ.. స్పీకర్ ఓం బిర్లాకు అమిత్ షా లేఖ






