Teja Sajja | ఇంటివాడు కాబోతున్న హనుమాన్ హీరో – కాబోయే భార్య ఎవరంటే?
టాలీవుడ్ యంగ్ హీరో తేజా సజ్జా త్వరలోనే వైవాహిక బంధంలోకి అడుగుపెట్టబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. నవంబర్‌లో ఈ టాలీవుడ్ హీరో ఎంగేజ్‌మెంట్ జరుగనున్నట్లు సమాచారం. డిసెంబర్‌లో రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో గ్రాండ్‌గా పెళ్లి జరుగనుందని అంటున్నారు. తేజా సజ్జాకు కాబోయే భార్య ఎవరంటే?
Entertainment | Published On Oct 20, 2026, 9.16 pm IST
Teja Sajja | టాలీవుడ్ యంగ్ హీరో తేజా సజ్జా పెళ్లిపీటలు ఎక్కబోతున్నట్లు సమాచారం. . ఈ ఏడాది ఓ ఇంటివాడుకానున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. హనుమాన్, మిరాయ్ సినిమాలతో హీరోగా బ్యాక్ టూ బ్యాక్ బ్లాక్‌బస్టర్స్ అందుకున్నాడు. ఈ సక్సెస్‌లతో టాలీవుడ్‌లో మంచి క్రేజ్‌ను సొంతం చేసుకున్నాడు.
నవంబర్‌లో ఎంగేజ్‌మెంట్...
తాజాగా తేజా సజ్జా ఈ ఏడాది పెళ్లిపీటలు ఎక్కబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నవంబర్ ఫస్ట్ వీక్‌లో హైదరాబాద్‌లో తేజా సజ్జా ఎంగేజ్‌మెంట్ జరుగనున్నట్లు సమాచారం. డిసెంబర్‌లో రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ వేదికగా గ్రాండ్‌గా పెళ్లి జరుగనుందని అంటున్నారు.
కాబోయే భార్య....
తేజా సజ్జాది అరెంజ్‌డే మ్యారేజ్ టాక్. టాలీవుడ్ హీరోకు కాబోయే భార్య సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నట్లు సమాచారం. పెళ్లికి సంబంధించిన వివరాలను త్వరలోనే తేజా సజ్జా అఫీషియల్‌గా వెల్లడించనున్నాడని అంటున్నారు.
జాంబీరెడ్డి....
ప్రస్తుతం హీరోగా జాంబీరెడ్డి 2 షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు తేజా సజ్జా. ఓ వైపు హీరోగాసినిమాలు చేస్తూనే ది ట్రైటర్స్ షోకు హోస్ట్‌గా కూడా వ్యవహరిస్తున్నాడు. ఇటీవలే అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఈ షో ప్రారంభమైంది. ది ట్రైటర్స్ కోసం తేజా సజ్జా భారీగానే రెమ్యూనరేషన్ అందుకున్నట్లు వార్తలొస్తున్నాయి. రిషబ్‌శెట్టి, ప్రశాంత్ వర్మ కాంబినేషన్‌లో వస్తోన్న హనుమాన్ 2లో తేజా సజ్జా గెస్ట్ రోల్‌లో కనిపించబోతున్నట్లు చెబుతోన్నారు. చైల్డ్ యాక్టర్‌గా తేజా సజ్జా కెరీర్ మొదలైంది. ఇంద్ర, యువరాజుతో పాటు టాలీవుడ్ స్టార్స్‌తో కలిసి బాలనటుడిగా చాలానే సినిమాలు చేశాడు తేజా సజ్జా.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబం రిలీజ్ డేట్ ఫిక్స్ – దసరా రోజు చిన్న సినిమాలకు షాకిచ్చిన వెంకటేష్
అక్టోబర్ 20, 2026

Rukmini Vasanth | వెండితెరపైకి దిగ్గజ తెలుగు సింగర్ బయోపిక్ – హీరోయిన్గా కన్నడ బ్యూటీ
అక్టోబర్ 19, 2026

Rashmika Mandanna | తెలంగాణ కోడలిగా ఇది నా తొలి బతుకమ్మ – రష్మిక కామెంట్స్ – నెటిజన్ల ప్రశంసలు
అక్టోబర్ 19, 2026
తాజావార్తలు
- ●Vijayasai Reddy New Party | ఏపీ రాజకీయాల్లో సంచలనం.. 11-11-11:11 ముహూర్తాన విజయసాయిరెడ్డి కొత్త పార్టీ!
- ●Yellamma Movie | ప్రభాస్ 'స్పిరిట్' ప్లేస్‌లో దేవిశ్రీ ప్రసాద్ ‘ఎల్లమ్మ’
- ●Nalamasa Srikanth Goud | దసరా వేళ కవిత కీలక ప్రకటన.. టీఆర్ఎస్ తొలి ఎమ్మెల్సీ అభ్యర్థిగా నలమాస శ్రీకాంత్ గౌడ్
- ●Abhijit Dipke | దీపావళి వరకూ ఎలాంటి నిరసనలు లేవు.. ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేయండి.. మద్దతుదారులకు దిప్కే పిలుపు
- ●Malayalam OTT | ఓటీటీలోకి మలయాళం టైమ్ ట్రావెల్ థ్రిల్లర్ మూవీ - ఫస్ట్ నైట్ రోజే భార్య కిడ్నాప్ అయితే!
- ●Gold Mine Collapse | కూలిన బంగారు గని.. 14 మంది మృతి

Vijayasai Reddy New Party | ఏపీ రాజకీయాల్లో సంచలనం.. 11-11-11:11 ముహూర్తాన విజయసాయిరెడ్డి కొత్త పార్టీ!

Yellamma Movie | ప్రభాస్ 'స్పిరిట్' ప్లేస్‌లో దేవిశ్రీ ప్రసాద్ ‘ఎల్లమ్మ’

Nalamasa Srikanth Goud | దసరా వేళ కవిత కీలక ప్రకటన.. టీఆర్ఎస్ తొలి ఎమ్మెల్సీ అభ్యర్థిగా నలమాస శ్రీకాంత్ గౌడ్

Abhijit Dipke | దీపావళి వరకూ ఎలాంటి నిరసనలు లేవు.. ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేయండి.. మద్దతుదారులకు దిప్కే పిలుపు



