Vishnu Vinyasam Review | విష్ణు విన్యాసం రివ్యూ – కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ శ్రీవిష్ణు లేటెస్ట్ మూవీ ఎలా ఉందంటే?
శ్రీవిష్ణు, నయన్ సారిక జంటగా నటించిన విష్ణువిన్యాసం శుక్రవారం థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చింది. కొత్త దర్శకుడితో శ్రీవిష్ణు చేసిన ఈ సినిమా ఎలా ఉందంటే?
Entertainment | Published On Feb 27, 2026, 3.21 pm IST
Vishnu Vinyasam Review | గత కొన్నాళ్లుగా కామెడీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నాడు శ్రీవిష్ణు. వరుస విజయాలతో కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా మారారు. మరోసారి కామెడీ కథాంశంతో శ్రీవిష్ణు చేసిన మూవీ విష్ణువిన్యాసం. ఆయ్ ఫేమ్ నయన్ సారిక హీరోయిన్‌గా నటించిన ఈ మూవీకి యదునాథ్ మారుతీరావు దర్శకత్వం వహించాడు. శుక్రవారం రిలీజైన ఈ సినిమా ఎలా ఉంది? మరోసారి కామెడీ కథతో శ్రీవిష్ణు హిట్టు కొట్టాడా? లేదా? అంటే?
విష్ణు జాతకాల పిచ్చి...
విష్ణు (శ్రీవిష్ణు) ఓ జూనియర్ లెక్చరర్, జాతకాల పిచ్చి ఎక్కువ. తన కాలేజీలోనే పనిచేసే మనీషా (నయన్ సారిక) అలియాస్‌జున్నును ఇష్టపడతాడు. విష్ణుకు భిన్నమైన మనస్తత్వం మనీషాది. ఆధునిక భావాలతో పెరుగుతుంది. గొడవలతో మొదలైన విష్ణు, మనీషా పరిచయం ప్రేమగా మారుతుంది. ఇద్దరు పెళ్లిచేసుకోవాలని అనుకుంటారు. అదే టైమ్‌లో మనీషా జాతకం గురించి ఓ షాకింగ్ నిజం విష్ణుకు తెలుస్తుంది. మనీషా జాతకంలో రెండు పెళ్లిళ్ల యోగం ఉందని, మొదటి భర్త పెళ్లైన ఆరు నెల్లోనే యాక్సిడెంట్‌లో చనిపోతాడని బయటపడుతుంది. జాతకాలను నమ్మే విష్ణు మనీషాపై ప్రేమతో ఆమెను పెళ్లిచేసుకుంటాడు? ఆ తర్వాత ఏమైంది? ప్రేమించిన భార్యకు విష్ణు ఎలా దూరమయ్యాడు? ఆమె జాతకం నిజమైందా? విష్ణు చనిపోయాడా? కూతురినే మనీషా తల్లిదండ్రులు ఎందుకు మోసం చేశారు అన్నదే అన్నదే ఈ మూవీ కథ.
కింగ్ నవ్వించలేకపోయాడు...
కోహ్లి స్టార్ ప్లేయర్ అయినా ప్రతి మ్యాచ్‌లో సెంచరీలు కొట్టలేడు. అప్పుడప్పుడు డకౌట్ అవుతాడు. విష్ణువిన్యాసంతో శ్రీవిష్ణుకు అలాంటి పరిస్థితే ఎదురైంది. శ్రీవిష్ణు సినిమా అంటే ఆడియెన్స్ వన్ లైనర్స్ పంచ్‌లు, హై రేంజ్ కామెడీని ఎక్స్‌పెక్ట్ చేయడం కామన్. గత సక్సెస్‌లతో అంచనాలు కాస్తంత రెట్టింపు అయ్యాయి. ఏకంగా అతడికి ఫ్యాన్స్ కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ అనే బిరుదు ఇచ్చేశారు. ఆ కింగ్ ఈ సారి నవ్వించలేక చతికిలాపడ్డాడు. సింగిల్, సామజవరగమనా కథలు సింపులే. ఈ సినిమాల్లో ఫోర్స్‌డ్ కామెడీ ఎక్కడ కనిపించదు. వినోదంతో పాటు అంతర్లీనంగా ఎమోషన్స్ ఉండటంతోనే ఆడియెన్స్‌ను ఈ సినిమాలు మెప్పించాయి. కానీ విష్ణువిన్యాసంలో అవేవి కనిపించలేదు. పాత కథను తీసుకొని శ్రీవిష్ణు కామెడీతో దర్శకుడు గట్టెక్కాలని ప్రయత్నించారు. ఈ ప్రయోగం పూర్తిగా బెడిసికొట్టింది.
గత సినిమాల ఛాయలు...
జాతకాలు, మూఢనమ్మకాల కాన్సెప్ట్‌తో గతంలో వెంకీ, అప్పుల అప్పారావు, ఆ ఒక్కటి అడక్కుతో పాటు చాలా సినిమాలే వచ్చాయి. ఆ సినిమాల ఛాయలు విష్ణువిన్యాసంలో కనిపిస్తాయి. అయితే ఆ సినిమాల్లో జాతకల వల్ల సమస్య హీరోలకు ఉంటే.....ఇందులో హీరోయిన్ గండం ఉన్నట్లుగా చూపించాడు. అదేమిటన్నది రివీల్ చేయకుండా సస్పెన్స్ మెయింటేన్ చేశాడు. ఇంటర్వెల్‌లో ఆ ట్విస్ట్‌ను రివీల్ చేయడం వరకు ఓకే అనిపిస్తుంది. కీలకమైన సెకండాఫ్‌లో దర్శకుడు పూర్తిగా తడబడ్డాడు. సినిమా ప్రెడిక్టబుల్‌గా సాగుతుంది. క్లైమాక్స్ ట్విస్ట్ కూడా వావ్ అనే ఫీల్‌ను కలిగిస్తుందా అంటే అదీ లేదు. ఇదివరకే ఎన్నో సినిమాల్లో ఈ పాయింట్‌ను వాడేశారు. కేవలం జాతకాల చుట్టూ కథ సాగడంతో ఓ స్టేజ్ దాటిన తర్వాత బోర్ ఫీలింగ్ కలుగుతుంది.
సోషల్ మీడియా మీమ్స్...
ఫస్ట్ హాఫ్‌లో శ్రీవిష్ణు కామెడీ కొంత వరకు ఈ సినిమాకు రిలీఫ్‌గా నిలిచింది. జాతకాల పిచ్చితో శ్రీవిష్ణు చేసే పనులు నవ్విస్తాయి. సోషల్ మీడియాలోని మీమ్స్‌ను బాగానే వాడుకున్నాడు. సినిమా ఇండస్ట్రీపై వేసిన కొన్ని పంచులు పేలాయి. వెరైటీ స్లాంగ్‌తో శ్రీవిష్ణు చేసే హడావిడి కొన్ని చోట్ల నవ్విస్తే మరికొన్ని చోట్ల అతిగా అనిపిస్తుంది.
కష్టం వృథా...
విష్ణు పాత్రలో శ్రీవిష్ణు ఎనర్జిటిక్ యాక్టింగ్‌తో ఆకట్టుకున్నాడు. సినిమా కోసం ఎంత చేయాలో అంత చేశాడు. కానీ దర్శకుడి ఔట్‌డేటెడ్ టేకింగ్, మేకింగ్ వల్ల శ్రీవిష్ణు శ్రమ వృథాగానే మారింది. నయన్ సారిక గత సినిమాలకు భిన్నంగా ఇందులో కనిపించింది. శ్రీవిష్ణుతో ఆమె పెయిర్ బాగానే కుదిరింది. సత్యను డైరెక్టర్ సరిగ్గా వాడుకోలేదు. సత్యంరాజేష్, బ్రహ్మజీ , శ్రీకాంత్ అయ్యంగార్‌తో పాటు చాలా మందే ఉన్నా ఎవరి పాత్ర పెద్దగా ఇంపాక్ట్ చూపించదు. రధన్ మ్యూజిక్, బీజీఎమ్‌లో యావరేజ్‌గానే ఉన్నాయి.
టైమ్‌పాస్...
విష్ణువిన్యాసం పేరులో ఉన్న వినోదం సినిమాలో లేదు. శ్రీవిష్ణు కామెడీనే నమ్ముకొని తీసిన ఈ మూవీ అంచనాలకు తగ్గట్లుగా లేదు. పెద్దగా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకుండా చూస్తే టైమ్‌పాస్ చేస్తుంది.
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



