త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sonal Chauhan | దుబాయ్‌లో చిక్కుకున్న బాల‌కృష్ణ హీరోయిన్ – సాయం చేయాలంటూ ట్వీట్‌

ఇరాన్‌, ఇజ్రాయెల్ యుద్ధం కార‌ణంగా హీరోయిన్ సోనాల్ చౌహాన్ దుబాయ్‌లోనే చిక్కుకుంది. సుర‌క్షితంగా ఇండియాకు తిరిగి వ‌చ్చేందుకు సాయం చేయ‌మంటూ ప్ర‌ధాని మోదీని కోరుతూ సోష‌ల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.

N

Entertainment | Published On Mar 1, 2026, 4.12 pm IST

Sonal Chauhan | దుబాయ్‌లో చిక్కుకున్న బాల‌కృష్ణ హీరోయిన్ – సాయం చేయాలంటూ ట్వీట్‌
Advertisement

Sonal Chauhan |  ఇరాన్‌, ఇజ్రాయెల్ యుద్ధం వ‌ల్ల దుబాయ్‌తో పాటు ప‌లు మిడిల్ ఈస్ట్ దేశాల‌కు విమాన స‌ర్వీసులు ర‌ద్ధ‌య్యాయి. ఈ యుద్ధం వ‌ల్ల టాలీవుడ్ హీరోయిన్ సోనాల్ చౌహ‌న్ దుబాయ్‌లో చిక్కుకుంది. భార‌త్‌కు తిరిగి వ‌చ్చేందుకు సాయం చేయాలంటూ ప్ర‌ధాన మంత్రి మోదీని కోరింది. "ఇరాన్‌, ఇజ్రాయెల్ మ‌ధ్య సంక్షోభం వ‌ల్ల నేను దుబాయ్‌లోనే చిక్కుకున్నా. విమాన స‌ర్వీసులు ర‌ద్ద‌య్యాయి. ఇండియాకు ఎలా రావాలో తెలియ‌డం లేదు. దారుల‌న్నీ మూసుకుపోయాయి. సుర‌క్షితంగా ఇంటికి తిరిగి వచ్చేందుకు సాయం చేయండి
అంటూ మోదీని ఉద్దేశిస్తూ సోష‌ల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. వెకేష‌న్ కోసం ఇటీవ‌లే సోనాల్ చౌహాన్ దుబాయ్ వెళ్లిన‌ట్లు ఆమె స‌న్నిహితులు చెబుతున్నారు. సోనాల్ చౌహాన్ ట్వీట్ వైర‌ల్ అవుతోంది.

బాల‌కృష్ణ‌కు జోడీగా...

సోనాల్ చౌహాన్ తెలుగులో బాల‌కృష్ణ‌తోనే ఎక్కువ‌గా సినిమాలు చేసింది. లెజెండ్‌, రూల‌ర్‌, డిక్టేట‌ర్ సినిమాల్లో బాల‌కృష్ణ‌కు జోడీగా క‌నిపించింది. రామ్ పండ‌గ‌చేస్కోతో పాటు క‌ళ్యాణ్ రామ్ షేర్ సినిమాల్లో క‌థానాయిక‌గా న‌టించింది. తెలుగులో అవ‌కాశాలు చాలానే వ‌చ్చినా ప‌రాజ‌యాల కార‌ణంగా అనుకున్న స్థాయిలో పేరు రాలేదు. ప్ర‌భాస్ ఆదిపురుష్ మూవీలో మండోద‌రి పాత్ర‌లో క‌నిపించింది. రెండేళ్ల క్రితం రిలీజైన ద‌ర్ద్ త‌ర్వాత సినిమాల‌కు గ్యాప్ ఇచ్చింది సోనాల్ చౌహాన్‌.

ఈషా గుప్తా కూడా...

సోనాల్ చౌహాన్‌తో పాటు మ‌రో బాలీవుడ్ బ్యూటీ ఈషా గుప్తా కూడా అబుదాబిలో చిక్కుకుపోయింది. తాను సేఫ్‌గా ఉన్న‌ట్లు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టింది. "నేను క్షేమంగా ఉన్నానో లేదో తెలుసుకోవ‌డానికి చాలా మంది మెసేజ్‌లు, ఫోన్ కాల్స్ చేస్తున్నారు. రిప్లై ఇవ్వలేని ప‌రిస్థితుల్లో ఉన్నా. ప్ర‌స్తుతానికైతే నేను క్షేమంగానే ఉన్నా.ఇక్క‌డి పరిస్థితులు చాలా భయానకంగా ఉన్నాయి " అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఈషా గుప్తా ఓ పోస్ట్ పెట్టింది. ఆమె క్షేమంగా ఇండియాకు తిరిగి రావాలంటూ నెటిజ‌న్లు ఆమె పోస్ట్ ను ఉద్దేశించి కామెంట్లు పెడుతున్నారు. ఈషా గుప్తా తెలుగులో రామ్‌చ‌ర‌ణ్ విన‌య విధేయ రామ సినిమాలో స్పెష‌ల్ సాంగ్ చేసింది.

Advertisement
Advertisement