త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Shruti Haasan | ఆ హీరో నాకు బాల్య స్నేహితుడే : శృతి హాసన్‌

Shruti Haasan | పాన్ ఇండియా స్థాయిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కథానాయికల్లో శృతి హాసన్ ఒకరు. ప్రముఖ నటుడు కమల్ హాసన్ వారసురాలిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన శృతి.. కేవలం వారసత్వానికే పరిమితం కాకుండా తన ప్రతిభతో ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది.

P

Entertainment | Published On Mar 25, 2026, 3.17 pm IST

Shruti Haasan | ఆ హీరో నాకు బాల్య స్నేహితుడే : శృతి హాసన్‌
Advertisement

Shruti Haasan | పాన్ ఇండియా స్థాయిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కథానాయికల్లో శృతి హాసన్ ఒకరు. ప్రముఖ నటుడు కమల్ హాసన్ వారసురాలిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన శృతి.. కేవలం వారసత్వానికే పరిమితం కాకుండా తన ప్రతిభతో ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది. నటిగా మాత్రమే కాకుండా గాయని తన సత్తా చాటుతోంది. సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత, ప్రొఫెషనల్ విషయాలను అభిమానులతో పంచుకుంటుంది. ఆమె లవ్ లైఫ్ కూడా తరచూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. అందుకే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ హీరోయిన్ల జాబితాలో శృతి పేరు ఎప్పుడూ ముందే వినిపిస్తుంది.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శృతి హాసన్, తన స్కూల్ రోజులను గురచేసుకుంది. ఆ సందర్భంగా మలయాళ స్టార్ నటుడు దుల్కర్ సల్మాన్‌తో తనకు ఉన్న అనుబంధాన్ని ఆసక్తికరంగా బయటపెట్టింది. చెన్నైలో ఒకే పాఠశాలలో చదువుకున్న రోజుల్లో ఇద్దరూ తరచూ కలుసుకునేవారని ఆమె వెల్లడించింది. చిన్నప్పటి ఆ రోజులు ఎంతో సరదాగా గడిచాయని, అప్పట్లో క్లాస్‌మేట్స్‌గా ఉన్న అనుబంధం ఇప్పటికీ మధుర జ్ఞాపకంగా మిగిలిపోయిందని తెలిపింది. దుల్కర్ సల్మాన్ తనను ప్రేమగా ‘సోంబి‘ అని పిలిచేవాడని శృతి చెప్పడం ఆసక్తిని పెంచింది. ఆ రోజుల్లో కొందరు సహ విద్యార్థులతో కలిసి ‘సోంబి’ పాటను పాడిన సందర్భాన్ని కూడా ఆమె గుర్తు చేసుకుంది. ఆ సమయంలో తనను ఎక్కువగా ‘కమల్ హాసన్ కూతురు’గానే సహ విద్యార్థులు గుర్తించేవారని, తన వ్యక్తిగత గుర్తింపు అంతగా తెలియదని కూడా శృతి వెల్లడించింది.

ఇప్పుడు ఈ ఇద్దరి మధ్య ఉన్న పాత స్నేహబంధం మరింత ప్రత్యేకంగా మారింది. ఎందుకంటే శృతి హాసన్, దుల్కర్ సల్మాన్ కలిసి నటించిన సినిమా ‘ఆకాశంలో ఒక తార’ ప్రస్తుతం ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేపుతోంది. తెలుగులో తెరకెక్కుతున్న ఈ మూవీ.. తమిళం, కన్నడం, మలయాళంతో పాటు హిందీలోనే విడుదల కానుంది. బాల్య స్నేహితులుగా ఉన్న ఇద్దరు, ఇప్పుడు తెరపై జంటగా కనిపించబోతుండటం సినిమాపై హైప్‌ను పెంచుతోంది. ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ ఎలా ఉంటుందో చూడాలనే ఆసక్తి ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. శృతి ఆకాశంలో ఒక తార మూవీతో పాటు తమిళంలోనే ట్రైన్‌ అనే మరో మూవీలో నటిస్తోంది. ఈ మూవీలో విజయ్‌ సేతుపతి సరసన నటిస్తోంది.

Advertisement

తాజావార్తలు

Advertisement