Chaiwala Movie | సెన్సార్ రూల్స్ – చాయ్ వాలా మూవీ టైటిల్ ఛేంజ్ – నవాబ్ కేఫ్‌గా రిలీజ్
సెన్సార్ రూల్స్ కారణంగా మరో తెలుగు సినిమాకు ఇబ్బందులు ఎదురయ్యాయి. శివ కందుకూరి హీరోగా నటించిన చాయ్ వాలా మూవీ టైటిల్ ఛేంజ్ అయ్యింది. చాయ్ వాలా టైటిల్ వద్దని సెన్సార్ బోర్డు చెప్పడంతో నవాబ్ కేఫ్‌గా పేరు మార్చి ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ పేర్కొన్నారు.
Entertainment | Published On Feb 10, 2026, 7.31 pm IST
Chaiwala Movie | ఇటీవల కాలంలో సెన్సార్ రూల్స్ కారణంగా పలు సినిమాలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. జననాయగన్ వివాదం మరువక ముందే మరో తెలుగు సినిమాకు సెన్సార్ రూల్స్ అడ్డంకిగా మారాయి. రిలీజ్ ముంగిట సినిమా టైటిల్ ఛేంజ్ చేసిన మేకర్స్ కొత్త పేరుతో సినిమాను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. శివకందుకూరి హీరోగా ప్రమోద్ హర్ష దర్శకత్వంలో చాయ్‌వాలా పేరుతో ఓ మూవీ తెరకెక్కింది. ఫిబ్రవరి 20న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. తాజాగా సెన్సార్ రూల్స్, గైడ్‌లైన్స్ దృష్టిలో పెట్టుకొని తమ సినిమా టైటిల్‌ను మార్చినట్లు మేకర్స్ ప్రకటించారు. చాయ్ వాలా పేరుతో కాకుండా నవాబ్ కేఫ్ టైటిల్‌తో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు వెల్లడించారు.టైటిల్ గురించి సెన్సార్ బోర్డుతో మాట్లాడామని, ఈ టైటిల్ వద్దని వాళ్లు చెప్పడంతోనే నవాబ్ కేఫ్‌గా పేరు మార్చాల్సివచ్చిందని నిర్మాత తెలిపారు.
ముందుగా ఇదే టైటిల్ అనుకున్నాం....
‘చాయ్ వాలా’ టైటిల్‌తోనే మా జర్నీ మొదలైందని హీరో శివ కందుకూరి అన్నారు. "ఈ పేరును జనాల్లోకి తీసుకు వెళ్లేందుకు చాలా కష్టపడ్డాం. కానీ సెన్సార్ రూల్స్, గైడ్ లైన్స్‌ని గౌరవిస్తూ మా టైటిల్‌ను ‘నవాబ్ కేఫ్’గా మార్చాల్సివచ్చింది. టైటిల్ చేంజ్ అయినా, సెన్సార్ సమస్యలు వచ్చినా ఎక్కడా వెనక్కి తగ్గకుండా, కాంప్రమైజ్ కాకుండా నిర్మాత ధైర్యంగా నిలబడ్డారు" అని పేర్కొన్నారు.
ఎవరూ చెప్పలేదు...
అసలు మాకు టైటిల్ మార్చమని అధికారికంగా ఎక్కడా చెప్పలేదని ప్రొడ్యూసర్ పేర్కొన్నారు. "టైటిల్ గురించి ముంబైకి వెళ్లాను. సెన్సార్ టీంతో మాట్లాడాను. ‘చాయ్ వాలా’ అనే టైటిల్ వద్దు వాళ్లు చెప్పారు. వారి సూచన మేరకు టైటిల్ మార్చాం" అని నిర్మాత అన్నారు.
నవాబ్ కేఫ్ మూవీలో తేజు అశ్విని హీరోయిన్‌గా నటించింది. రాజీవ్ కనకాల కీలక పాత్ర పోషించాడు. ఈ సినిమాకు ప్రశాంత్ ఆర్ విహారి మ్యూజిక్ అందించాడు.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



