త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sara Arjun | సోష‌ల్ మీడియాలో దురంధ‌ర్ బ్యూటీపై ట్రోల్‌.. వివ‌ర‌ణ ఇచ్చిన సారా అర్జున్ తండ్రి..!

Sara Arjun | ప్రస్తుతం సోషల్ మీడియా యుగంలో ఏ చిన్న మాట అయినా నోరుజారితే, తీవ్ర ట్రోలింగ్‌ను ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇది ముఖ్యంగా సెలబ్రిటీలకు ఎక్కువగా వర్తిస్తుంది. తాజాగా దురంధ‌ర్ బ్యూటీ సారా అర్జున్ సైతం ట్రోలింగ్ బారిన‌ప‌డ్డారు. సోష‌ల్ మీడియా వేదిక‌గా ఆమె చేసిన పోస్టే ఇందుకు ప్ర‌ధాన కార‌ణం.

P

Entertainment | Published On Mar 9, 2026, 7.52 pm IST

Sara Arjun | సోష‌ల్ మీడియాలో దురంధ‌ర్ బ్యూటీపై ట్రోల్‌.. వివ‌ర‌ణ ఇచ్చిన సారా అర్జున్ తండ్రి..!
Advertisement

Sara Arjun | ప్రస్తుతం సోషల్ మీడియా యుగంలో ఏ చిన్న మాట అయినా నోరుజారితే, తీవ్ర ట్రోలింగ్‌ను ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇది ముఖ్యంగా సెలబ్రిటీలకు ఎక్కువగా వర్తిస్తుంది. తాజాగా దురంధ‌ర్ బ్యూటీ సారా అర్జున్ సైతం ట్రోలింగ్ బారిన‌ప‌డ్డారు. సోష‌ల్ మీడియా వేదిక‌గా ఆమె చేసిన పోస్టే ఇందుకు ప్ర‌ధాన కార‌ణం. ఇంత‌కీ అస‌లు ఏం జ‌రిగిందంటే.. ర‌ణ్‌వీర్ సింగ్ హీరోగా ఆదిత్య‌ధ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఇచ్చిన దురంధ‌ర్ మూవీలో సారా అర్జున్ ఆక‌ట్టుకున్న‌ది. ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది. ఈ క్ర‌మంలో దురంధ‌ర్‌-2 ఈ నెల 19న విడుద‌ల కానున్న‌ది. ఈ మూవీకి ట్రైల‌ర్ రిలీజ్ సంద‌ర్భంగా సారా ఎక్స్ వేదిక‌గా పోస్ట్ పెట్టింది. “నో టాక్సిటీ.. ఓన్లీ ధురంధర్” అని పోస్ట్ పెట్ట‌గా క్ష‌ణాల్లోనే వైర‌ల్‌గా మారింది.

దాంతో య‌ష్ అభిమానులు ఈ బ్యూటీపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. దీనిపై సారా తండ్రి అర్జున్ వివ‌ర‌ణ ఇచ్చారు. ఎవరో అభిమాని క్రియేట్ చేసిన అకౌంట్ ద్వారా ట్వీట్ చేస్తే.. త‌న కూతురిపై విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని ఆయ‌న ఆరోపించారు. తామంతా సినిమా కుటుంబానికి చెందిన వార‌మ‌ని, త‌మ కుటుంబంలోని ప్ర‌తి న‌టుడు, న‌టిపై గౌర‌వం ఉంటుంద‌న్నారు. సారా ఎవరినీ కించపరిచేలా మాట్లాడ‌ద‌ని, ఆమెకు ఉంటే కూడా సోషల్ మీడియా ఎక్స్ అకౌంట్ మాత్ర‌మే ఉంద‌ని.. మిగ‌తా సోష‌ల్ మీడియాల్లో ఉన్నవ‌న్నీ ఫేక్ అకౌంట్స్ అని స్ప‌ష్టం చేశారు. ఇలాంటి పోస్టులు పెట్టి త‌ప్పుడు ప్ర‌చారం చేయొద్ద‌ని రాజ్ అర్జున్ కోరారు. ఇదిలా ఉండ‌గా.. దురంధర్ 2లో రణ్‌వీర్ సింగ్, అర్జున్ రాంపాల్, ఆర్ మాధవన్, సంజయ్ దత్, సారా అర్జున్, రాకేశ్ బేడి కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

https://www.instagram.com/p/DVkccsuDbvF/

Advertisement
Advertisement