త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Samantha | రాజ్ వ‌చ్చాకే జీవితం మారింది – భ‌ర్త‌పై స‌మంత ప్ర‌శంస‌లు

నాగ‌చైత‌న్య‌తో విడాకుల త‌ర్వాత త‌న జీవితంలో వ‌చ్చిన మార్పుల‌పై ఓ మ్యాగ‌జైన్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో స‌మంత ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేసింది. మ‌రోక‌రి ప్రేమ‌ను, స్నేహాన్ని స్వీక‌రించ‌లేని ప‌రిస్థితికి వెళ్లిపోయిన‌ట్లు చెప్పింది.

N

Entertainment | Published On Feb 23, 2026, 7.26 pm IST

Samantha | రాజ్ వ‌చ్చాకే జీవితం మారింది – భ‌ర్త‌పై స‌మంత ప్ర‌శంస‌లు
Advertisement

Samantha | మా ఇంటి బంగారం మూవీతో టాలీవుడ్‌లోకి క‌మ్‌బ్యాక్ ఇవ్వ‌బోతుంది స‌మంత‌. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉంది. మా 15న మా ఇంటి బంగారం థియేట‌ర్ల‌లో రిలీజ్ కానున్న‌ట్లు ఆదివారం ప్ర‌క‌టించింది. నాగ‌చైత‌న్య‌తో విడాకులు, మ‌యోసైటిస్ కార‌ణంగా స‌మంత‌ రెండేళ్ల పాటు సినిమాల‌కు బ్రేక్ ఇచ్చింది. మ‌ళ్లీ సామ్‌ సినిమాలు చేయ‌డం అనుమాన‌మేన‌ని అంతా అనుకున్నారు. కానీ ఈ రూమ‌ర్ల‌కు పుల్‌స్టాప్ పెడుతూ మా ఇంటి బంగారం మూవీతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. గ‌త ఏడాది రిలీజైన హార‌ర్ కామెడీ మూవీ శుభంలో గెస్ట్ రోల్‌లో న‌టించింది.

కొత్త ఛాప్ట‌ర్‌....

మ‌రోవైపు గ‌త ఏడాది డిసెంబ‌ర్‌లో ఫ్యామిలీ మ్యాన్ డైరెక్ట‌ర్ రాజ్ నిడిమోరును పెళ్లిచేసుకొని వ్య‌క్తిగ‌త జీవితంలో కొత్త ఛాప్ట‌ర్‌ను మొద‌లుపెట్టింది. కోయంబ‌త్తూర్‌లోని ఈషా యోగా సెంట‌ర్‌లో నిరాడంబ‌రంగా రాజ్‌, స‌మంత వివాహం జ‌రిగింది. పెళ్లి కంటే ముందు రాజ్‌తో స‌మంత ప్రేమ‌లో ఉన్న‌ట్లుగా ప్ర‌చారం జ‌రిగింది. ప‌లు మార్లు వీరిద్ద‌రు జంట‌గా క‌నిపించిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి.

మ‌రొక‌రిని న‌మ్మ‌డం...

కాగా విడాకుల త‌ర్వాత త‌న జీవితంలోని ఒడిదుడుకుల‌పై ఓ మ్యాగ‌జైన్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో స‌మంత ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేసింది. విడాకుల త‌ర్వాత మ‌రొక‌రిని న‌మ్మ‌డం, వారిపై ఆధార‌ప‌డ‌టం మ‌ళ్లీ త‌న‌ జీవితంలో ఉండ‌వేమోన‌ని అనుకున్నాన‌ని స‌మంత చెప్పింది.

స్వీక‌రించ‌లేని ప‌రిస్థితికి...

"విడాకుల త‌ర్వాత మాన‌సికంగా చాలా కృంగిపోయా. మ‌రొక‌రి ప్రేమ‌, స్నేహాన్ని స్వీక‌రించ‌లేని ప‌రిస్థితికి వెళ్లిపోయా. ఆ క్లిష్ట ప‌రిస్థితుల్లో నాకు నేను మ‌రింత ద‌గ్గ‌ర‌య్యా. ధ్యానం చేయ‌డం, నాతో నేను గ‌డుపుకోవ‌డం త‌ప్ప చాలా రోజుల పాటు ఏం చేయ‌లేక‌పోయా. అలాంటి టైమ్‌లోనే రాజ్ నా జీవితంలోకి వ‌చ్చాడు. అత‌డి ప‌రిచ‌యం వ్య‌క్తిగ‌తంతోనే కాకుండా న‌ట‌న ప‌రంగా నాలో మార్పును తీసుకొచ్చింది. ఇప్ప‌టికీ ఏ ప‌నైనా క‌లిసే చేస్తుంటాం. రాజ్ నా ప‌క్క‌న ఉంటే సినిమాల ప‌రంగా ఎంతో సాధించ‌గ‌ల‌న‌నే న‌మ్మ‌కం క‌లిగింది" అని స‌మంత చెప్పింది. ఆమె కామెంట్స్ వైర‌ల్ అవుతోన్నాయి. మా ఇంటి బంగారం సినిమాకు స‌మంత‌తో పాటు రాజ్ నిడిమోరు ఓ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తోన్నాడు.

Advertisement
Advertisement