Sai Pallavi | ఇద్దరు హీరోయిన్లతో ధనుష్ రొమాన్స్ – రౌడీ బేబీ కాంబో రిపీట్
మారి 2 తర్వాత ధనుష్, సాయిపల్లవి కాంబినేషన్‌లో మరో మూవీ రాబోతుంది. ధనుష్ హీరోగా రాజ్‌కుమార్ పెరియాసామి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న స్పై యాక్షన్ మూవీలో సాయిపల్లవి హీరోయిన్‌గా నటించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇందులో శ్రీలీల మరో నాయికగా కనిపించబోతుంది.
Entertainment | Published On Feb 2, 2026, 6.24 pm IST
Sai Pallavi | ధనుష్ హీరోగా అమరన్ ఫేమ్ రాజ్‌కుమార్ పెరియాసామి దర్శకత్వంలో తమిళంలో ఓ స్పై యాక్షన్ మూవీ రాబోతుంది. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా నటించనున్నట్లు ఇటీవల మేకర్స్ ప్రకటించారు. ఇందులో శ్రీలీలతో పాటు మరో హీరోయిన్ కూడా నటించనుంది. ఆ కథానాయిక ఎవరన్నది సోమవారం మేకర్స్ రివీల్ చేశారు. సాయిపల్లవి కూడా ఈ సినిమాలో నటిస్తున్నట్లు అఫీషియల్‌గా ప్రకటించారు. ధనుష్‌తో సాయిపల్లవి దిగిన ఓ ఫొటోను అభిమానులతో పంచుకున్నారు.
అమరన్ కాంబో...
రాజ్‌కుమార్ పెరియాసామి దర్శకత్వం వహించిన అమరన్‌లో సాయిపల్లవి హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాలో ఇందు రెబెకా వర్గీస్ క్యారెక్టర్‌లో అద్భుత నటనతో ఆడియెన్స్ చేత కన్నీళ్లు పెట్టించింది. 2024లో రిలీజైన అమరన్ తర్వాత కోలీవుడ్‌కు రెండేళ్లు గ్యాప్ ఇచ్చింది సాయిపల్లవి. మళ్లీ రాజ్‌కుమార్ పెరియాసామి మూవీతోనే తమిళంలోకి రీఎంట్రీ ఇవ్వబోతుంది.
ధనుష్‌తో సెకండ్ టైమ్...
ధనుష్‌తో సాయిపల్లవి జోడీకట్టడం ఇదే మొదటిసారి కాదు. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో మారి 2 సినిమా వచ్చింది. మారికి సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ మూవీ డిజాస్టర్‌గా నిలిచినా ఇందులోని రౌడీ బేబీ పాట మాత్రం పెద్ద హిట్టయ్యింది. రెండోసారి కలిసి వీరిద్దరు సినిమా చేయబోతుండటం కోలీవుడ్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
స్పై యాక్షన్ మూవీ....
అమరన్ తరహాలోనే దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఓ గూఢచారి కథతో స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా రాజ్‌కుమార్ పెరియాసామి ఈ మూవీని తెరకెక్కించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ధనుష్ హీరోగా నటిస్తున్న 55వ మూవీ ఇది. హీరోగా నటిస్తూనే ఈ సినిమాకు ప్రొడ్యూసర్‌గా కూడా ధనుష్ వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకు సాయి అభ్యంకర్ మ్యూజిక్ అందిస్తున్నారు. డీ55 షూటింగ్ త్వరలో ప్రారంభం కాబోతుంది.
బాలీవుడ్‌లో...
ప్రస్తుతం సాయిపల్లవి బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. సాయిపల్లవి హిందీ డెబ్యూ మూవీ ఏక్‌దిన్ మే 1న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాలో ఆమిర్‌ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ హీరోగా నటిస్తున్నాడు. ఇండియాలోనే మోస్ట్ అవైటింగ్ మూవీగా తెరకెక్కుతోన్న రామాయణలో సాయిపల్లవి హీరోయిన్‌గా కనిపించబోతుంది. ఇందులో రణబీర్‌కపూర్ రాముడిగా నటిస్తుండగా...సాయిపల్లవి సీత పాత్రను పోషిస్తుంది. రెండు పార్ట్‌లుగా రామాయణ మూవీ తెరకెక్కుతోంది. ఫస్ట్ పార్ట్ ఈ ఏడాది నవంబర్‌లో ప్రేక్షకలు ముందుకు రానుంది.
సంబంధిత వార్తలు

Sai Pallavi | పాపం సాయిపల్లవి… రామాయణ డైరెక్టర్ అంత మాట అనేశాడేంటి?
మే 21, 2026

Kaviya Maran | కోలీవుడ్ రాక్‌స్టార్‌తో ఏడడుగులు వేయబోతున్న కావ్య పాప – పెళ్లి ఎప్పుడు..ఎక్కడంటే?
మే 21, 2026

Meenakshi Chaudhary | సంక్రాంతి హీరోయిన్‌గా మీనాక్షి చౌదరి..! కార్తితో మ్యాజిక్ రిపీట్ చేసేనా..?
మే 20, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



