త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Peddi | రామ్ చ‌ర‌ణ్ ‘పెద్ది’ రిలీజ్ డేట్ మారింది..!

Peddi | గ్లోబ‌ల్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్, ఉప్పెన ఫేమ్ ద‌ర్శ‌కుడు బుచ్చిబాబు కాంబోలో వ‌స్తున్న మూవీ పెద్ది. ఈ మూవీ కోసం మెగా అభిమానులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీలో రామ్‌చ‌ర‌ణ్ మాస్ లుక్‌లో క‌నిపించ‌నున్నాడు.

P

Entertainment | Published On Feb 4, 2026, 8.10 pm IST

Peddi | రామ్ చ‌ర‌ణ్ ‘పెద్ది’ రిలీజ్ డేట్ మారింది..!
Advertisement

Peddi | గ్లోబ‌ల్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్, ఉప్పెన ఫేమ్ ద‌ర్శ‌కుడు బుచ్చిబాబు కాంబోలో వ‌స్తున్న మూవీ పెద్ది. ఈ మూవీ కోసం మెగా అభిమానులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీలో రామ్‌చ‌ర‌ణ్ మాస్ లుక్‌లో క‌నిపించ‌నున్నాడు. రూర‌ల్ స్ట్పోర్ట్స్ డ్రామాగా ఈ మూవీని తెర‌కెక్కిస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్‌, సాంగ్‌కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. దాంతో మూవీపై భారీ అంచ‌నాలున్నాయి. అయితే, ఈ మూవీ రిలీజ్ వాయిదా ప‌డింది. వాస్త‌వానికి మార్చి 27న సినిమాను రిలీజ్ చేయ‌నున్న‌ట్లు మేక‌ర్స్ గ‌తంలో ప్ర‌క‌టించారు. ప్ర‌స్తుతం షూటింగ్ ప‌నులు ఇంకా పెండింగ్‌లోనే ఉండ‌డంతో రిలీజ్‌ను వాయిదా వేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ మూవీని ఏప్రిల్ 30న రిలీజ్ చేస్తున్న‌ట్లు చిత్ర‌బృందం ప్ర‌క‌టించింది.

కొత్త రిలీజ్ డేట్ ‘పెద్ది’కి క‌లిసి వ‌స్తుంద‌ని భావిస్తున్నారు. వేస‌వి సెల‌వుల నేప‌థ్యంలో మూవీ రిలీజ్‌కు ఇదే మంచి స‌మ‌య‌మ‌ని మేక‌ర్స్ భావిస్తున్నారు. స‌మ్మ‌ర్‌లో బాక్సాఫీస్ షేక్ చేస్తుంద‌ని అభిమానులు అంచ‌నా వేస్తున్నారు. ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా న‌టిస్తున్న‌ది. క‌న్న‌డ న‌టుడు శివ రాజ్‌కుమార్ కీల‌క‌పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. ఆస్కార్ అవార్డ్ విన్న‌ర్ ఏఆర్ రెహ‌మాన్ సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, వృద్ధి సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

ఇదిలా ఉండ‌గా.. మార్చిలో భారీ సినిమాలు రిలీజ్ కానున్నాయి. ప‌వ‌న్ క‌ల్యాణ్ ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్‌ను మార్చి 26న రిలీజ్ చేయ‌నున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. అదే నెల‌లో బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్ నటించిన 'ధురంధర్ 2' (Dhurandhar 2), కన్నడ స్టార్ యష్ నటించిన 'టాక్సిక్స విడుద‌ల‌కు సిద్ధంగా ఉన్నాయి. ధురంధ‌ర్ తొలి పార్ట్ వెయ్యికోట్ల‌కుపైగా వ‌సూళ్లు రాబ‌ట్టింది. కేజీఎఫ్ త‌ర్వాత య‌ష్ పాన్ ఇండియా స్థాయిలో తెర‌కెక్కిస్తున్న టాక్సిక్స్ మూవీపై అంచ‌నాలున్నా ఈ క్ర‌మంలో పెద్ద టీమ్ ఏప్రిల్ అయితే బెట‌ర్‌గా ఉంటుంద‌ని భావిస్తున్నారు. ఇక అడ‌విశేష్ డెకాయిట్ సైతం ఏప్రిల్ 10వ తేదీకి వాయిదాప‌డింది.

Advertisement
Advertisement