OTT | ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు హీరోయిన్ తమిళ మూవీ – షూటింగ్ మొత్తం కొరియాలోనే!
ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా నటించిన తమిళ మూవీ మేడిన్ కొరియా ఓటీటీలోకి వచ్చింది. గురువారం నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. తమిళంతో పాటు తెలుగులోనూ రిలీజైంది.
Entertainment | Published On Mar 12, 2026, 3.45 pm IST
OTT | ఓజీ ఫేమ్ ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా నటించిన తమిళ మూవీ మేడిన్ కొరియా ఓటీటీలోకి వచ్చింది. గురువారం నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ మూవీ రిలీజైంది. గురువారం మధ్యాహ్నం 12.30 నిమిషాల నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి తీసుకొచ్చారు.
స్క్విడ్ గేమ్
మేడిన్ కొరియా మూవీకి రా కార్తీక్ దర్శకత్వం వహించాడు. స్క్విడ్ గేమ్ ఫేమ్ పార్క్ హై జిన్‌తో పాటు సీ హన్ బేక్, నో హో జిన్, జై హ్యూన్ జంగ్, తమిళ నటుడు రిషికాంత్ కీలక పాత్రల్లో నటించారు. పూర్తిస్థాయిలో కొరియాలో షూట్ చేసిన ఫస్ట్ ఇండియన్ మూవీగా మేడిన్ కొరియా నిలిచింది.
ఓటీటీలోకి ఎంట్రీ...
మేడిన్ కొరియా మూవీ థియేటర్లను స్కిప్ చేస్తూ నేరుగా ఓటీటీలో రిలీజైంది. ఓటీటీలో ప్రియాంక అరుళ్ మోహన్ చేసిన ఫస్ట్ మూవీ కూడా ఇదే కావడం గమనార్హం. ఈ సినిమాకు హేషమ్ అబ్దుల్ వహాబ్, ధరణ్ కుమార్ మ్యూజిక్ అందించారు.
కొరియా కల...
శెంబా తమిళనాడులోని ఓ పల్లెటూరుకు చెందిన యువతి. చిన్నప్పటి నుంచి కొరియా వెళ్లాలని కలలు కంటుంది. పెళ్లి విషయంలో తల్లిదండ్రులతో గొడవపడిన శెంబా ధైర్యంగా కొరియా ఫ్లైట్ ఎక్కుతుంది. సియోల్‌తో దిగిన ఆమెకు అక్కడ ఎలాంటి అనూహ్య పరిణామాలు ఎదురయ్యాయి? భాషతో పాటు పరిచయస్తులు ఎవరూ లేక ఎలాంటి ఇబ్బందులు పడింది అన్నదే ఈ మూవీ కథ.
రజనీకాంత్ సినిమాలో...
ప్రస్తుతం తమిళంలో కెవిన్‌తో ఓ సినిమా చేస్తోంది కన్నడంలో 666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ అనే సినిమా చేస్తోంది. రజనీకాంత్, సిబీ చక్రవర్తి కాంబినేషన్‌లో వస్తోన్న తలైవర్ 173లో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా ఎంపికైనట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం రా కార్తీక్ తెలుగులో అగ్ర హీరో నాగార్జునతో ఓ మూవీ చేస్తున్నాడు. నాగార్జున హీరోగా నటిస్తోన్న 100వ మూవీ ఇది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా సాగుతోంది.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






