Priyanka Arul Mohan | కొరియన్ యాక్టర్‌తో ఓజీ హీరోయిన్ మూవీ – డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్
ఓజీ ఫేమ్ ప్రియాంక అరుళ్ మోహన్ కొత్త మూవీ మేడిన్ కొరియా థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలో రిలీజ్ కాబోతుంది. రొమాంటిక్ కామెడీగా రూపొందిన ఈ సినిమా మార్చి 12 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ సినిమాకు రా కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నారు.
Entertainment | Published On Feb 24, 2026, 3.48 pm IST
Priyanka Arul Mohan | ఓజీ ఫేమ్ ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా నటించిన తమిళ మూవీ మేడిన్ కొరియా (Made in Korea) థియేటర్లను స్కిప్ చేస్తూ నేరుగా ఓటీటీలోకి (Ott) రాబోతుంది. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్ డేట్‌తో పాటు ప్లాట్‌ఫామ్ కన్ఫామ్ అయ్యాయి. మార్చి 12 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కాబోతుంది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో ఈ సినిమా విడుదల కానున్నట్లు నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది.
కొరియన్ యాక్టర్లు...
రొమాంటిక్ కామెడీగా తెరకెక్కిన ఈ సినిమాకు రా కార్తీక్ దర్శకత్వం వహించాడు. ఇందులో ప్రియాంక అరుళ్ మోహన్‌తో పాటు స్క్విడ్ గేమ్ ఫేమ్ పార్క్ హై జిన్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. కిమ్‌సోరీ, జైహున్ జాంగ్‌తో పాటు పలువురు కొరియన్ యాక్టర్లు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. కన్యాకుమారికి చెందిన ఓ యువతి చిన్నతనం నుంచి కొరియాకు వెళ్లాలని కలలు కంటుంది. తల్లిదండ్రులతో పాటు ప్రేమించిన అబ్బాయి వారించిన వినకుండా కొరియా వెళ్లిన ఆమెకు అక్కడ అలాంటి పరిణామాలు ఎదురయ్యాయి? కొరియాపై ఆమెకు ఇష్టం పెరగడానికి కారణమేమిటి? అనే అంశాలతో ఈ మూవీ రూపొందింది. మేడిన్ కొరియా సినిమాకు హేషమ్ అబ్దుల్ వహాబ్ మ్యూజిక్ అందించాడు. శ్రీనిధి సాగర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
నాగార్జున వందో సినిమా...
ఓజీ తర్వాత ప్రియాంక అరుళ్ మోహన్ నటిస్తోన్న సినిమా ఇది. థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలో రిలీజ్ కాబోతుండటం ఆసక్తికరంగా మారింది. మరోవైపు ప్రస్తుతం నాగార్జున వందో సినిమాకు రా కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నాడు. దాంతో తెలుగు ఆడియెన్స్ సైతం ఈ సినిమా కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తోన్నారు.
నాని గ్యాంగ్‌లీడర్‌తో...
నాని గ్యాంగ్ లీడర్‌తో మూవీతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది ప్రియాంక అరుళ్ మోహన్. సరిపోదా శనివారం, పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాలతో పెద్ద విజయాలను అందుకుంది. ప్రస్తుతం తమిళంలో హీరో కెవిన్‌తో ఓ మూవీ చేస్తోంది. కన్నడంలో 666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ అనే మూవీలో ప్రియాంక హీరోయిన్‌గా నటిస్తోంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Tripti Dimri | మాధురీ దీక్షిత్ కూతురిగా త్రిప్తి డిమ్రి – బాలీవుడ్ మూవీలో మెగాస్టార్ చిరంజీవి సాంగ్
మే 15, 2026

Dhurandhar 2 | మరింత ఆలస్యంగా ఓటీటీలోకి ధురంధర్ 2 – రామ్‌చరణ్ సినిమాకు పోటీగా రిలీజ్
మే 15, 2026

Keerthy Suresh | లేడీ డాన్‌గా కీర్తి సురేష్ – ఫుల్ యాక్షన్ మోడ్‌లో మహానటి…
మే 8, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



