త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Nidhhi Agerwal | మెగా హీరో మూవీలో రాజాసాబ్ హీరోయిన్‌….మృణాల్ ఛాన్స్ కొట్టేసిన నిధి!

హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లుతో పాటు రాజాసాబ్ డిజాస్ట‌ర్స్‌తో నిధి అగ‌ర్వాల్ కెరీర్ డైల‌మాలో ప‌డింది. ఆమె నెక్స్ట్ తెలుగు మూవీ ఏద‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. తాజాగా రామ్‌చ‌ర‌ణ్ పెద్ది మూవీలో నిధి అగ‌ర్వాల్ ఛాన్స్ ద‌క్కించుకున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

N

Entertainment | Published On Apr 7, 2026, 5.31 pm IST

Nidhhi Agerwal | మెగా హీరో మూవీలో రాజాసాబ్ హీరోయిన్‌….మృణాల్ ఛాన్స్ కొట్టేసిన నిధి!
Advertisement

Nidhhi Agerwal | టాలీవుడ్‌లో మోస్ట్ అన్‌ల‌క్కీ హీరోయిన్ ఎవ‌రంటే నిధి అగ‌ర్వాల్ పేరు మొద‌ట వినిపిస్తుంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్, ప్ర‌భాస్ వంటి స్టార్ హీరోల‌తో సినిమాలు చేసిన అదృష్టం మాత్రం క‌లిసిరాలేదు. గ‌త ఏడాది రిలీజైన‌ హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లుతో పాటుఈ సంక్రాంతికి ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన‌ రాజాసాబ్ డిజాస్ట‌ర్లుగా నిలిచి ఈ అమ్మ‌డికి నిరాశ‌ను మిగిల్చాయి. ఈ రెండు సినిమాల రిజ‌ల్ట్‌ల‌తో నిధి టాలీవుడ్ కెరీర్ డైల‌మాలో ప‌డింది. ఈ ప‌రాజ‌యాల‌తో సంబంధం లేకుండా నిధి అగ‌ర్వాల్ టాలీవుడ్‌లో మ‌రో బంప‌రాఫ‌ర్ అందుకున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

రామ్‌చ‌ర‌ణ్ పెద్దిలో...

రామ్‌చ‌ర‌ణ్ పెద్దిలో న‌టించే ఛాన్స్ నిధి అగ‌ర్వాల్ సొంతం చేసుకున్న‌ట్లు స‌మాచారం. ఈ సినిమాలో స్పెష‌ల్ సాంగ్ లో న‌టించే బ్యూటీ కోసం మేక‌ర్స్ చాలా కాలంగా అన్వేష‌ణ సాగిస్తున్నారు. ఈ ఐటెంసాంగ్‌లో న‌టించ‌నున్న‌ట్లు మృణాల్ ఠాకూర్‌ పేరు ఎక్కువ‌గా వినిపించింది. హీరోయిన్‌గా బిజీగా ఉన్న మృణాల్ ఈ ఐటెంసాంగ్ ఆఫ‌ర్‌ను రిజెక్ట్ చేసింద‌ట‌. ఆమెకంటే ముందు ధురంధ‌ర్ బ్యూటీ ఆయేషాఖాన్‌తో పాటు త‌మ‌న్నా వంటి అందాల ముద్దుగుమ్మ‌ల‌ పేర్లు తెర‌పైకి వ‌చ్చాయి. చివ‌ర‌కు అవి రూమ‌ర్లుగానే మిగిలాయి.

నిధి...ఫైన‌ల్‌...

మృణాల్ నో చెప్ప‌డంతో ఆమె స్థానంలో నిధి అగ‌ర్వాల్‌ను మేక‌ర్స్ ఫైన‌ల్ చేశార‌ట‌. పాటలోనే కాకుండా కొన్ని సీన్స్‌లో కూడా  ఈ రాజాసాబ్ బ్యూటీ కనిపించేలా క‌థ‌లో మార్పులు చేసిన‌ట్లు స‌మాచారం. ఈ వీక్‌లోనే రామ్‌చ‌ర‌ణ్‌, నిధి అగ‌ర్వాల్‌పై ఈ స్పెష‌ల్ సాంగ్‌ను షూట్ చేయ‌బోతున్న‌ట్లు స‌మాచారం.

నిధి మాత్రం వ‌ద్దు...

నిధి అగ‌ర్వాల్‌ను ఐటెంసాంగ్ కోసం తీసుకోవ‌డంపై మెగా ఫ్యాన్స్ నుంచి వ్య‌తిరేక‌త వ‌స్తోంది. స్పెష‌ల్ సాంగ్ సినిమాలో లేక‌పోయినా ప‌ర్లేదు కానీ నిధి అగ‌ర్వాల్ మాత్రం వ‌ద్దంటూ సోష‌ల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.
కాగా రామ్‌చ‌ర‌ణ్ పెద్ది మూవీ ఏప్రిల్ 30న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. మార్చి 27న రిలీజ్ కావాల్సిన ఈ సినిమాను షూటింగ్ డిలే వ‌ల్ల ఈ నెలాఖ‌రుకు వాయిదావేశారు. అయితే ఏప్రిల్ 30న కూడా ఈ సినిమా థియేట‌ర్ల‌లోకి రావ‌డం అనుమాన‌మేన‌ని వార్త‌లొస్తున్నాయి. పెద్ది మూవీలో జాన్వీక‌పూర్ హీరోయిన్‌గా న‌టిస్తోంది.

Advertisement
Advertisement