త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

OTT | ప‌ద‌కొండేళ్ల త‌ర్వాత ఓటీటీలోకి వ‌చ్చిన హీరో నాని త‌మిళ మూవీ

నాని హీరోగా న‌టించిన త‌మిళ మూవీ ఆహా క‌ళ్యాణం థియేట‌ర్ల‌లో రిలీజైన ప‌ద‌కొండేళ్ల త‌ర్వాత ఓటీటీలోకి వ‌చ్చింది. మంగ‌ళ‌వారం నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీ రిలీజైంది.

N

Entertainment | Published On Dec 23, 2025, 8.22 pm IST

OTT | ప‌ద‌కొండేళ్ల త‌ర్వాత ఓటీటీలోకి వ‌చ్చిన హీరో నాని త‌మిళ మూవీ

ఆహా కళ్యాణం

Advertisement

OTT |  కెరీర్ ఆరంభంలో త‌మిళంలో కొన్ని సినిమాల్లో హీరోగా న‌టించాడు నాచుర‌ల్ స్టార్ నాని (Hero Nani). వాటిలో ఆహా క‌ళ్యాణం ఒక‌టి. బాలీవుడ్ (Bollywood) అగ్ర నిర్మాణ సంస్థ య‌శ్ రాజ్ ఫిల్మ్స్ ఈ సినిమాను నిర్మించింది. హిందీలో విజ‌య‌వంత‌మైన బ్యాండ్ బాజా బారాత్ ఆధారంగా రూపొందిన ఈ త‌మిళ మూవీలో నానికి జోడీగా వాణిక‌పూర్ హీరోయిన్ న‌టించింది. సిమ్రాన్ కీల‌క పాత్ర పోషించింది. ఆహా క‌ళ్యాణం సినిమాను అదే పేరుతో తెలుగులో రిలీజ్ చేశారు. రెండు భాష‌ల్లో ఈ మూవీ డిజాస్ట‌ర్‌గా నిలిచింది.
థియేట‌ర్ల‌లో రిలీజైన ప‌ద‌కొండేళ్ల త‌ర్వాత ఆహా క‌ళ్యాణం ఓటీటీలోకి వ‌చ్చింది. మంగ‌ళ‌వారం నెట్‌ఫ్లిక్స్‌లో ఈ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ మూవీ రిలీజైంది. ఆహా క‌ళ్యాణం సినిమాకు గోకుల్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఈ మూవీతోనే వాణి క‌పూర్ కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆహా క‌ళ్యాణం డిజాస్ట‌ర్ కావ‌డంతో మ‌ళ్లీ ద‌క్షిణాదిలో సినిమా చేయ‌లేదు.

ఆహా క‌ళ్యాణం క‌థ ఇదే...

వెడ్డింగ్ ప్లాన‌ర్‌గా ఫేమ‌స్ అవ్వాల‌న్న‌ది శృతి (వాణిక‌పూర్‌) క‌ల‌. ఆమె లైఫ్‌లోకి అనుకోకుండా శ‌క్తి (నాని) వ‌స్తాడు. ఎలాంటి బ‌రువు బాధ్య‌త‌లు లేకుండా జులాయిగా తిరుగుతుంటాడు శ‌క్తి. ఇద్ద‌రు క‌లిసి గ‌ట్టిమేళం పేరుతో ఓ వెడ్డింగ్ ప్లానింగ్ సంస్థ‌ను ప్రారంభిస్తారు. కొద్ది రోజుల్లోనే గ‌ట్టిమేళం ఫేమ‌స్ అవుతుంది. మ‌న‌స్ప‌ర్థ‌ల కార‌ణంగా శృతి, శ‌క్తి విడిపోతారు. హ్యాపీ వెడ్డింగ్ పేరుతో సొంతంగా మ‌రో సంస్థ‌ను ప్రారంభిస్తాడు శ‌క్తి. ఆ త‌ర్వాత ఏమైంది. శ‌క్తి హ్యాపీ వెడ్డింగ్ స‌క్సెస్ అయ్యిందా? శృతి, శ‌క్తిల పెళ్లి జ‌రిగిందా? అన్న‌దే ఈ మూవీ క‌థ‌.
త‌మిళంలో నాని చేసిన చివ‌రి మూవీ ఇదే. ఆహా క‌ళ్యాణం త‌ర్వాత కోలీవుడ్‌లో అవ‌కాశాలు వ‌చ్చినా అంగీక‌రించ‌లేదు. ప్ర‌స్తుతం ది ప్యార‌డైజ్ మూవీతో బిజీగా ఉన్నారు నాని. శ్రీకాంత్ ఓదెల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ మూవీ 2026 మార్చి 26న రిలీజ్ కాబోతుంది. ది ప్యార‌డైజ్ త‌ర్వాత ఓజీ ఫేమ్ సుజీత్‌లో ఓ స్టైలిష్ యాక్ష‌న్ సినిమా చేయ‌నున్నాడు నాని.

Advertisement

తాజావార్తలు

Advertisement