త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sobhita Dhulipala | నాగ‌చైత‌న్య సినిమాలో శోభిత – భ‌ర్త‌తో క‌లిసి తొలిసారి…

భ‌ర్త నాగ‌చైత‌న్య‌తో క‌లిసి ఫ‌స్ట్ టైమ్ శోభిత ధూళిపాళ సినిమా చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. వృష‌క‌ర్మ త‌ర్వాత బెదురులంక డైరెక్ట‌ర్ క్లాక్స్‌తో నాగ‌చైత‌న్య ఓ ల‌వ్‌స్టోరీ చేయ‌బోతున్నారు. ఈ సినిమాలో శోభిత హీరోయిన్‌గా న‌టించ‌నున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

N

Entertainment | Published On Feb 8, 2026, 3.56 pm IST

Sobhita Dhulipala | నాగ‌చైత‌న్య సినిమాలో శోభిత – భ‌ర్త‌తో క‌లిసి తొలిసారి…
Advertisement

Sobhita Dhulipala |  నాగ‌చైత‌న్య‌తో పెళ్లి త‌ర్వాత సినిమాల ఎంపిక‌లో సెలెక్టివ్‌గా అడుగులు వేస్తోంది శోభిత ధూళిపాళ‌. ఇది వ‌ర‌కు ఎక్కువ‌గా గ్లామ‌ర్ పాత్ర‌ల్లో క‌నిపించిన ఈ అక్కినేని కోడ‌లు ప్ర‌స్తుతం న‌ట‌న‌కు ప్రాముఖ్య‌మున్న‌ పాత్ర‌ల‌వైపు మొగ్గు చూపుతోంది. ఇట‌వ‌లే చీక‌టిలో పేరుతో ఓ క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీ చేసింది. డైరెక్ట్‌గా అమెజాన్ ప్రైమ్‌లో రిలీజైన ఈ సినిమా ప్ర‌స్తుతం ట్రెండింగ్‌లో ఉంది. ఇందులో సంధ్య అనే ధైర్య‌వంతురాలైన జ‌ర్న‌లిస్ట్ పాత్ర‌లో నాచుర‌ల్ యాక్టింగ్‌తో శోభిత ఆక‌ట్టుకుంది.

నాగ‌చైత‌న్య‌తో ఫ‌స్ట్ టైమ్‌...

కాగా శోభిత తాజాగా తెలుగులో మ‌రో మూవీకి గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు స‌మాచారం. భ‌ర్త నాగ‌చైత‌న్య‌తో క‌లిసి ఫ‌స్ట్ టైమ్ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ప్ర‌స్తుతం వృష‌క‌ర్మ షూటింగ్‌తో నాగ‌చైత‌న్య ఫుల్ బిజీగా ఉన్నారు. మిస్టిక్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ మూవీ వేస‌విలో రిలీజ్ కాబోతుంది.

బెదురులంక డైరెక్ట‌ర్‌...

వృష‌క‌ర్మ త‌ర్వాత నాగ‌చైత‌న్య ఓ ల‌వ్‌స్టోరీకి గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు స‌మాచారం. ఈ సినిమాకు బెదురులంక ఫేమ్ క్లాక్స్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నాడ‌ట‌. ఇన్నోవేటివ్ పాయింట్‌తో ఫీల్‌గుడ్ ల‌వ్‌స్టోరీగా డైరెక్ట‌ర్ క్లాక్స్ సిద్ధం చేసిన క‌థ‌కు నాగ‌చైత‌న్య ఇంప్రెస్ అయ్యార‌ట‌. సింగిల్ సిట్టింగ్‌లోనే ఈ సినిమాకు ఓకే చెప్పిన‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.
ఈ ల‌వ్‌స్టోరీలో నాగ‌చైత‌న్య‌కు జోడీగా ఇద్ద‌రు హీరోయిన్లు క‌నిపించ‌నున్నార‌ట‌. ఓ హీరోయిన్‌గా శోభిత ధూళిపాళ‌ పేరు వినిపిస్తోంది. రియ‌ల్ లైఫ్ క‌పుల్ అయిన నాగ‌చైత‌న్య‌, శోభిత ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ ఈ సినిమాకు బిగ్గెస్ట్ ప్ల‌స్‌పాయింట్‌గా నిలిచే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. నాగ‌చైత‌న్య‌, శోభిత క‌లిసి ఇప్ప‌టివ‌ర‌కు సినిమా చేయ‌లేదు. క్లాక్స్ డైరెక్ష‌న్‌లో రూపొందుతోన్న మూవీతోనే తొలిసారి ఈ భార్యాభ‌ర్త‌లు అభిమానుల ముందుకు రానున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. నాగ‌చైత‌న్య‌, శోభిత క‌లిసి సినిమా చేయాల‌ని చాలా రోజులుగా అనుకుంటున్నార‌ట‌. స‌రైన స్క్రిప్ట్ కోసం ఎదురుచూస్తున్న వీరికి క్లాక్స్ చెప్పిన క‌థ చాలా న‌చ్చిన‌ట్లు స‌మాచారం.
నాగ‌చైత‌న్య‌, శోభిత ల‌వ్‌స్టోరీపై త్వ‌ర‌లోనే అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ రానున్న‌ట్లు స‌మాచారం. ఈ సినిమాను బ‌న్నీవాస్‌తో క‌లిసి అన్న‌పూర్ణ స్టూడియోస్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. నాగ‌చైత‌న్య‌, శోభిత పెళ్లి 2024 డిసెంబ‌ర్‌లో జ‌రిగింది. పెళ్లికి ముందు ఈ జంట రెండేళ్ల పాటు ప్రేమ‌లో ఉన్నారు.

Advertisement
Advertisement