Mrunal Thakur | ధనుష్ డైరెక్షన్‌లో హీరోయిన్‌గా మృణాల్ ఠాకూర్.. కోలీవుడ్‌లో ఈ ప్రాజెక్ట్‌పైనే చర్చ..!
Mrunal Thakur | ధనుష్, మృణాల్ ఠాకూర్ మధ్య రిలేషన్‌షిప్ రూమర్స్ కొన్ని రోజులుగా సోషల్ మీడియా, సినిమా వర్గాల్లో విస్తృతంగా చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వార్తలను ఖండించినప్పటికీ వార్తలు మాత్రం ఆగడం లేదు.
Entertainment | Published On Apr 21, 2026, 10.56 am IST
Mrunal Thakur | ధనుష్, మృణాల్ ఠాకూర్ మధ్య రిలేషన్‌షిప్ రూమర్స్ కొన్ని రోజులుగా సోషల్ మీడియా, సినిమా వర్గాల్లో విస్తృతంగా చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వార్తలను ఖండించినప్పటికీ వార్తలు మాత్రం ఆగడం లేదు. ఈ క్రమంలోనే ప్రస్తుత తమిళ సినీ వర్గాల్లో మరో కొత్త అప్‌డేట్ చర్చనీయాంశంగా మారింది. ధనుష్ దర్శకత్వంలో త్వరలో తెరకెక్కబోయే ఓ కొత్త సినిమా కోసం మృణాల్ ఠాకూర్‌ను హీరోయిన్‌గా ఎంపిక చేసినట్లు సమాచారం. ఇది ఉమెన్ సెంట్రిక్ కాన్సెప్ట్‌తో రూపొందుతున్న పీరియాడిక్ డ్రామా అని తెలుస్తోంది. సినిమా కథ 1970ల కాలం నేపథ్యంతో సాగుతుందని టాక్ వినిపిస్తోంది.
ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ ఓ ప్రత్యేకమైన దేవత పాత్రలో కనిపించనున్నారని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ పాత్ర కోసం ఇటీవలే ఆమెకు సంబంధించిన లుక్ టెస్ట్ కూడా నిర్వహించినట్లు సమాచారం. ఆ టెస్ట్‌లో వచ్చిన అవుట్‌పుట్‌పై టీమ్ సంతృప్తిగా ఉన్నట్లు ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. అన్ని అనుకున్నట్లుగా కుదిరితే, త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయని సమాచారం. ఈ సినిమాకు ప్రముఖ సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించనుండగా.. వండర్‌బార్ ఫిల్మ్స్ నిర్మించనుంది. భారీ స్థాయి నిర్మాణ విలువలతో తెరకెక్కనున్న ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే అంచనాలు పెరుగుతున్నాయి. ధనుష్ దర్శకత్వంలో వస్తున్న ఈ విభిన్న కథా చిత్రంపై అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి.
ఇదిలా ఉండగా.. మృణాల్ ఠాకూర్ పేరు ప్రస్తుతం దక్షిణాది సినిమా పరిశ్రమలో వరుస అవకాశాలతో వినిపిస్తోంది. బాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న ఆమె, ‘సీతా రామం’ వంటి చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఆ తర్వాత ఆమె నటించిన పాత్రలకు మంచి స్పందన రావడంతో, టాలీవుడ్‌లోనూ ఆమెకు క్రేజ్ పెరిగింది. తాజాగా డెకాయిట్ మూవీతో అభిమానుల ముందుకు వచ్చింది. ఈ మూవీ మిక్స్‌డ్ టాక్ వచ్చింది. ప్రస్తుతం మృణాల్ ఫుల్ బిజీగా ఉంది. తెలుగుతో పాటు బాలీవుడ్ ప్రాజెక్టులో ఈ బ్యూటీ చేతిలో ఉన్నాయి. హిందీలో హై జవానీ ఇష్క్ హోనా హై, పూజా మేరి జాన్ మూవీల్లో నటిస్తుంది. అలాగే, అల్లు అర్జున్-అట్లీ కాంబోలో వస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘రాకా’ మూవీలో కీలకపాత్ర పోషిస్తోంది. ఈ మూవీలో దీపికా పదుకొనే, జాన్వీ కపూర్, రష్మిక మందానాతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోనుంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Pooja Hegde | చిక్కుల్లో పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ మూవీ – లీగల్ సమస్యలతో ట్రైలర్ రిలీజ్ క్యాన్సిల్
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



