త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KJQ Movie Review | K J Q ప్రేక్షకులను మెప్పించిందా..? అసలు కథేంటో తెలుసా..?

KJQ Movie Review | గెలిచినోడిది ఏముంది.. ఓడినోడి కథ చదువు.. జీవితంలో కొన్ని సత్యాలు అందరికీ సూట్ కావు.. అలాంటి వేడి నుంచి పుట్టిందే ఈ కథ.. దీక్షిత్ శెట్టి, శశి ఓదెల, యుక్తి తరేజా నటించిన KJQ శుక్రవారం విడుదలైంది. దర్శకుడు కిరణ్ ఆకస్మిక మరణంతో కొంత ఆలస్యమైనా చిత్ర యూనిట్ పట్టుదలతో సినిమాను పూర్తి చేసి తెరమీదకు తెచ్చారు.

S

Entertainment | Published On Aug 7, 2026, 4.07 pm IST

KJQ Movie Review | K J Q ప్రేక్షకులను మెప్పించిందా..? అసలు కథేంటో తెలుసా..?
Advertisement

KJQ Movie Review | దీక్షిత్ శెట్టి, శశి ఓదెల, యుక్తి తరేజా, తదితరులు నటించిన KJQ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఆసక్తికర కథాంశంతో చిత్రీకరించిన ఈ సినిమా దర్శకుడు కిరణ్ ఆకస్మిక మరణంతో కొంత ఆలస్యమైనా చిత్ర యూనిట్ పట్టుదలతో పూర్తి చేసి తెరమీదకు తెచ్చింది. కొన్ని రోజులుగా వివిధ నగరాల్లో ప్రమోషన్స్ నిర్వహించారు. ఎస్ఎల్వీ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత సుధాకర్ చెరుకూరి అత్యద్భుతంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రముఖ దర్శకులు సందీప్ వంగా, సంపత్ నంది, శ్రీకాంత్ ఓదెల కూడా ఈ చిత్రం ప్రమోషన్స్ లో పాల్గొనడంతో మరింత ఆసక్తి పెంచింది. శుక్రవారం దేశ, విదేశాల్లో విడుదలై మంచి టాక్ ను సంపాదించింది. పలువురు సినీ ప్రముఖులు ఈ చిత్రంపై పాజిటివ్ స్పందించడంతో హీట్ పెంచింది. ఇంతకీ ఈ యాక్షన్ మూవీ ఎలా ఉంది.. ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా.. చూద్దాం..

కథేంటంటే..

నేర చరిత్ర కలిగిన దావుద్ ఇబ్రహీం, బిన్ లాడెన్ లాంటి వారి పాత్రలు మారితే ఎలా ఉంటారు. వాళ్ల భావోద్వేగాలు ఎలా ఉంటాయి. వాళ్లు ఇంట్లో ఎలా ఉంటారు.. వాళ్లకు మంచి జీవితం ఉంటే ఎలా గడుపుతారు.. అనే మాటలతో కథ మొదలవుతుంది. అనాథలా తిరిగే పార్థా(దీక్షిత్ శెట్టి)ను రాజు(మురళీధర్ గౌడ్) చెరదీస్తాడు. తన వద్ద ఆటో నడిపే పనిలో పెట్టుకుంటాడు. కానీ పార్థాకు ఎదురయ్యే అనేక అవమానాల నేపథ్యంలో అందరినీ ఎదిరిస్తే కింగ్ లా బతుకొచ్చని అనుకుంటాడు. ఇక అక్కడి నుంచి కథ మొదలవుతుంది. ఈ క్రమంలోనే పార్థాకు మరో అనాథ జాక్ ఎదురవుతాడు.. ఇద్దరూ స్నేహితులవుతారు.. ఆ తర్వాత పెండ్లి, ప్రేమల చుట్టూ కథ నడుస్తుంది. మనిషిలో అహం పెరిగితే ఏం జరుగుతుందనేది ఈ చిత్రంలో పార్థా పాత్ర ద్వారా చూపించారు. ప్రేమను పోగొట్టుకొని మనిషిలా బతకాలని డిసైడ్ అయిన జాక్ జీవితం ఎక్కడికి చేరుతుంది.. కింగ్, జాక్ జీవితాలు ఎలాంటి మలుపులు తిరుగుతాయనేది సినిమా చూస్తే తెలుస్తుంది.

ఎవరెలా నటించారంటే..

ఇక మొదటి సినిమాతోనే శశి ఓదెల ఆకట్టుకున్నాడు. సహజంగా నటించి మెప్పించాడు. అటు అమ్మను.. ఇటు ప్రేయసిని పోగొట్టుకునే పాత్రలో జీవించాడు. ఇక దీక్షిత్ శెట్టి సినిమాలో కీలక పాత్ర కు తగ్గట్టుగా తనలోని నటుడిని తెరపై దించాడు. అహం నిండిన మనిషి ఎలా ప్రవర్తిస్తాడు అనే పాత్రకు పూర్తిగా న్యాయం చేశాడు దీక్షిత్ శెట్టి. హీరోయిన్ గా నటించిన క్వీన్ (యుక్తి తరేజా) ఆకట్టుకున్నది. పాత్రలో పూర్తిగా ఒదిగిపోయింది. 1గంట 50 నిమిషాల నిడివితో సాగే కథ సీరియస్ గా మనల్ని సినిమాలోకి తీసుకెళ్తుంది. మొత్తంగా యువ తారాగణం దీక్షిత్, శశి, యుక్తి ఆకట్టుకున్నారని చెప్పవచ్చు.. ఇక మురళీధర్ గౌడ్ మరోసారి చిచ్చాగా తన పాత్రకు జీవం పోశాడు. దర్శకుడు కిరణ్ రెండో సినిమాగా KJQ ను రూపొందించాడు. సినిమా పూర్తయ్యే సమయంలో ఆయన అనారోగ్యంతో మృతిచెందాడు.. ఈ క్రమంలో పలువురు డైరెక్టర్లు ఈ సినిమా ప్రమోషన్లలో పాల్గొన్నారు.

బలాలు

హీరోలు, హీరోయిన్
సాగతీత లేకపోవడం

బలహీనత

అతిగా గన్ వాడకం
కొత్తదనం లేని సన్నివేశాలు
చివరగా సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

-కార్తీక్ (ఎస్పీ)

Advertisement
Advertisement