Mamitha Baiju | డీ గ్లామర్ లుక్‌లో మమితా బైజు – ఈ యాంగిల్‌ను ఎక్స్‌పెక్ట్ చేయలేదంటున్న నెటిజన్లు
ధనుష్ హీరోగా నటిస్తోన్న కరా మూవీ ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా నుంచి హీరోయిన్ మమితా బైజు ఫస్ట్ లుక్‌ను మంగళవారం మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో డీ గ్లామర్ లుక్‌లో మమితా బైజు కనిపిస్తోంది.
Entertainment | Published On Mar 24, 2026, 3.39 pm IST
Mamitha Baiju | ప్రేమలు మూవీతో ఓవర్‌నైట్‌లోనే స్టార్‌గా మారిపోయింది మమితా బైజు. ఈ సినిమాలో అల్లరి అమ్మాయిగా బబ్లీ రోల్‌లో నాచురల్ యాక్టింగ్, క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో అభిమానులను ఆకట్టుకుంది. ప్రేమలు బ్లాక్‌బస్టర్‌తో దక్షిణాదిలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయింది మమితా బైజు. తమిళంతో పాటు మలయాళ భాషలో ఆమెకు ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో ఐదు సినిమాలు ఉన్నాయి. అన్నీ భారీ బడ్జెట్ సినిమాలే కావడం గమనార్హం.
డీ గ్లామర్ రోల్...
ఇప్పటివరకు ఎక్కువగా మోడ్రన్ అమ్మాయి పాత్రలు చేసిన మమితా బైజు ధనుష్ మూవీలో డిఫరెంట్ లుక్‌లో కనిపించబోతున్నది. డీ గ్లామర్ రోల్ చేస్తోంది.
ధనుష్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ కరా ఏప్రిల్ 30న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాకు విఘ్నేష్ రాజా దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో మమితా బైజు హీరోయిన్‌గా నటిస్తోంది. ఆమె ఫస్ట్ లుక్‌ను మంగళవారం మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో పల్లెటూరి యువతిగా మమితా బైజు కనిపిస్తోంది. చీరకట్టులో చాలా తక్కువ మేకప్‌తో మమితా బైజు లుక్ డిఫరెంట్‌గా ఉంది. గుర్తుపట్టలేని విధంగా మమితా మారిపోయిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మమితాలోని ఈ యాంగిల్‌ను ఎక్స్‌పెక్ట్ చేయలేదని అంటున్నారు.
ఇంటిమేట్ సీన్స్...
లిప్‌లాక్‌లు, ఇంటిమేట్ సీన్స్, గ్లామరస్ హంగులను కరా సినిమా నుంచి ఎక్స్‌పెక్ట్ చేయద్దని మేకర్స్ పేర్కొన్నారు. నాయకానాయికల లవ్‌స్టోరీని విభిన్నంగా ఈ సినిమాలో చూపించామని తెలిపారు. సస్పెన్స్ థ్రిల్లర్‌గా కరా మూవీని దర్శకుడు విఘ్నేష్ రాజా తెరకెక్కించారు. తనకు జరిగిన అన్యాయంపై ఓ రైతు సాగించిన పోరాటం నేపథ్యంలో ఈ మూవీ రూపొందుతోంది. ఇందులో మలయాళ నటుడు జయరామ్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.
జననాయగన్‌లో...
కరాతో పాటు దళపతి విజయ్ జననాయగన్‌లో మమితా బైజు ఓ కీలక పాత్రలో నటించింది. సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన ఈ మూవీ సెన్సార్ సమస్యల వల్ల వాయిదాపడింది. సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఇవే కాకుండా మరో రెండు తమిళ, మలయాళ సినిమాలతో బిజీగా ఉంది.
సంబంధిత వార్తలు

Kaviya Maran | కోలీవుడ్ రాక్‌స్టార్‌తో ఏడడుగులు వేయబోతున్న కావ్య పాప – పెళ్లి ఎప్పుడు..ఎక్కడంటే?
మే 21, 2026

Meenakshi Chaudhary | సంక్రాంతి హీరోయిన్‌గా మీనాక్షి చౌదరి..! కార్తితో మ్యాజిక్ రిపీట్ చేసేనా..?
మే 20, 2026

Jayam Ravi | నెలకు నలభై లక్షలు ఇవ్వాల్సిందే – జయం రవి నుంచి భరణం కోరిన భార్య – తెరపైకి అగ్ర హీరో పేరు…
మే 19, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



