త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mahesh Babu | శ్రీరాముడి గెట‌ప్‌లో మ‌హేష్‌బాబు …. వార‌ణాసి పోస్ట‌ర్ వైర‌ల్ – గూస్‌బంప్స్ అంటున్న ఫ్యాన్స్‌

శ్రీరాముడి లుక్‌లో మ‌హేష్‌బాబు క‌నిపిస్తోన్న వార‌ణాసి మూవీ డిజిట‌ల్ డిస్‌ప్లే పోస్ట‌ర్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. గుంటూరులోని మైత్రీ మూవీ థియేట‌ర్‌లో క‌నిపించిన ఈ పోస్ట‌ర్‌లో రాముడిగా మ‌హేష్ లుక్‌, గెట‌ప్ అదిరిపోయాయ‌ని ఫ్యాన్స్ చెబుతోన్నారు.

N

Entertainment | Published On Feb 20, 2026, 7.10 pm IST

Mahesh Babu | శ్రీరాముడి గెట‌ప్‌లో మ‌హేష్‌బాబు …. వార‌ణాసి పోస్ట‌ర్ వైర‌ల్ – గూస్‌బంప్స్ అంటున్న ఫ్యాన్స్‌
Advertisement

Mahesh Babu  టాలీవుడ్‌, హాలీవుడ్ అనే భేదాలు లేకుండా అన్ని ఇండ‌స్ట్రీల‌లో మ‌హేష్‌బాబు, రాజ‌మౌళి (Rajamouli) కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న వార‌ణాసి (Varanasi Movie )గురించే డిస్క‌ష‌న్ న‌డుస్తోంది. ఈ సినిమా గురించి రోజుకో ఇంట్రెస్టింగ్ న్యూస్ సోష‌ల్ మీడియాలో వినిపిస్తోంది. భార‌తీయ పురాణాల నేప‌థ్యంలో టైమ్ ట్రావెల్ యాక్ష‌న్ అడ్వెంచ‌ర్ థ్రిల్ల‌ర్‌గా వార‌ణాసి మూవీని రూపొందిస్తున్నారు డైరెక్ట‌ర్‌ రాజ‌మౌళి.

30 నిమిషాల‌కుపైనే...

వార‌ణాసిలో మ‌హేష్‌బాబు శ్రీరాముడిగా క‌నిపించ‌బోతున్నారు. ఈ విష‌యాన్ని రాజ‌మౌళి అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించారు. రామాయ‌ణం తాలూకు ఎపిసోడ్స్ సినిమాలో 30 నిమిషాల‌పైనే ఉంటాయ‌ట‌. శ్రీరాముడి పాత్ర కోసం మ‌హేష్‌బాబు చాలానే రిహార్స‌ల్స్ చేశార‌ట‌. స్పెష‌ల్‌గా క‌ళ‌రి, విలువిద్య లాంటివాటిలో ట్రైనింగ్ కూడా తీసుకున్నార‌ట‌. రామాయ‌ణం పోర్ష‌న్‌ను అర‌వై రోజుల పాటు షూట్ చేసిన‌ట్లు రాజ‌మౌళి పేర్కొన్నారు. శ్రీరాముడిగా మ‌హేష్‌బాబు లుక్‌, ఆయ‌న క్యారెక్ట‌రైజేష‌న్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటాయ‌ని అన్నారు. రామాయ‌ణం ఎపిసోడ్ వార‌ణాసికి హైలైట్‌గా నిల‌వ‌బోతున్న‌ట్లు చెప్పారు. రాజ‌మౌళి కామెంట్ల‌తో ఈ ఎపిసోడ్‌పై అభిమానుల్లో అంచ‌నాలు పెరిగాయి.

మైత్రీ  థియేట‌ర్‌లో...

అఫీషియ‌ల్‌గా రిలీజ్ చేయ‌డానికి ముందే మ‌హేష్‌బాబు శ్రీరాముడి లుక్ లీక‌య్యింది. రాముడి గెట‌ప్‌లో మ‌హేష్‌బాబు క‌నిపిస్తున్న డిజ‌ట‌ల్ పోస్ట‌ర్‌ ఒక‌టి సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. గుంటూరులోని మైత్రీ థియేట‌ర్స్ ఈ డిజిట‌ల్ హోర్డింగ్ పోస్ట‌ర్‌ను డిస్‌ప్లే చేసింది. ఇందులో రాముడి గెట‌ప్‌లో ఓ చేతిలో బాణం...మ‌రో చేతిలో రుద్రాక్ష మాల‌ ప‌ట్టుకొని మ‌హేష్‌బాబు క‌నిపిస్తున్నారు. స‌ముద్రం ఒడ్డున ఓ రాయిపై ఠీవీగా నిల్చొని ఉన్న‌ట్లుగా ఈ పోస్ట‌ర్‌ను డిజైన్ చేశారు. పొడ‌వాటి హెయిర్‌స్టైల్‌, కండ‌లు తిరిగిన దేహంతో ఇందులో మ‌హేష్ క‌నిపిస్తున్నారు.
ఈ డిజిట‌ల్ పోస్ట‌ర్‌ను మ‌హేష్‌బాబు అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు. శ్రీరాముడిగా మ‌హేష్ లుక్ గూస్‌బంప్స్‌ను క‌లిగిస్తోంద‌ని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సినిమాలోనూ ఇదే లుక్‌లో క‌నిపించ‌నున్నాడ‌ని అంటున్నారు.ఈ పోస్ట‌ర్‌ను మ‌హేష్ అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు.

ప్రియాంక చోప్రా హీరోయిన్‌...

వార‌ణాసి మూవీ 2027 ఏప్రిల్ 7న థియేట‌ర్ల‌లోకి రాబోతుంది. గ్లోబ‌ల్ స్టార్ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ మూవీలో మ‌ల‌యాళ న‌టుడు పృథ్వీరాజ్ సుకుమార‌న్ విల‌న్‌గా క‌నిపించ‌బోతున్నాడు. దాదాపు 1500 కోట్ల బ‌డ్జెట్‌తో సీనియ‌ర్ ప్రొడ్యూస‌ర్ కేఎల్ నారాయ‌ణ‌తో క‌లిసి రాజ‌మౌళి త‌న‌యుడు ఎస్ ఎస్ కార్తికేయ ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఆస్కార్ విన్న‌ర్ కీర‌వాణి మ్యూజిక్ అందిస్తున్నారు.

Advertisement
Advertisement