త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kiran Abbavaram | నాకు ఒక్క‌ రూపాయి అప్పు లేదు – కిర‌ణ్ అబ్బ‌వ‌రం “రియాలిటీ” గ్లింప్స్ రిలీజ్‌

టాలీవుడ్ యంగ్ హీరో కిర‌ణ్ అబ్బ‌వ‌రం డైరెక్ట‌ర్‌గా మారాడు. తానే హీరోగా న‌టిస్తూ స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తోన్నాడు. ఈ సినిమాకు రియాలిటీ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ సినిమాను డిసెంబ‌ర్ 25న రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

N

Entertainment | Published On Oct 5, 2026, 12.58 pm IST

Kiran Abbavaram | నాకు ఒక్క‌ రూపాయి అప్పు లేదు – కిర‌ణ్ అబ్బ‌వ‌రం “రియాలిటీ” గ్లింప్స్ రిలీజ్‌
Advertisement

Kiran Abbavaram | టాలీవుడ్ యంగ్ హీరోలు డైరెక్ట‌ర్లుగా మారుతున్నారు. త‌మ మ‌న‌సుకు న‌చ్చిన క‌థ‌ల‌తో సినిమాల‌ను తెర‌కెక్కిస్తున్నారు. క‌, కే ర్యాంప్ సినిమాల‌తో హీరోగా పెద్ద విజ‌యాల‌ను అందుకున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం ఫ‌స్ట్ టైమ్ మెగా ఫోన్ ప‌ట్టాడు. మిడిల్ క్లాస్ అనుబంధాలు, ఆప్యాయ‌త‌ల‌తో ఓ సినిమాను రూపొందించారు. ఈ మూవీ టైటిల్ గ్లింప్స్‌ను సోమ‌వారం రిలీజ్ చేశారు. కిర‌ణ్ అబ్బ‌వ‌రం హీరోగా న‌టిస్తూ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాకు రియాలిటీ అనే టైటిల్‌ను క‌న్ఫామ్ చేశారు.

మెలోడీ సాంగ్‌తో...

భ‌జ‌గోవిందం...బ‌తికే కోలాహలం అనే మెలోడీ సాంగ్‌తో ఈ గ్లింప్స్ సాగింది. ఇందులో ఓ హోట‌ల్ న‌డుపుకునే ఆనందం అనే యువ‌కుడిగా కిర‌ణ్ అబ్బ‌వ‌రం క‌నిపించారు. పుట్టిన‌ప్ప‌టి నుంచి చ‌నిపోయే లోపు ప్ర‌తోడి లైఫ్‌లో ఓ హై మూమెంట్ ఉంటుంది. రా లైఫ్‌లో ఈ రోజు హై మూమెంట్‌. నాకు కానీ, నా కుటుంబానికి కానీ ఒక్క రూపాయి కూడా అప్పు లేదు...అంటూ ఈ గ్లింప్స్‌లో కిర‌ణ్ అబ్బ‌వ‌రం చెప్పిన డైలాగ్ ఆక‌ట్టుకుంటోంది.

దేవికా భ‌ట్ హీరోయిన్‌...

రియాలిటీ సినిమాలో దేవికా భ‌ట్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. శ‌ర‌త్‌కుమార్‌, సాయికుమార్‌, రోహిణి కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.
రియాలిటీ గ్లింప్ల్‌తో పాటు రిలీజ్ డేట్ కూడా చెప్పేశారు. డిసెంబ‌ర్ 25న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానున్న‌ట్లు ప్ర‌క‌టించారు. డిసెంబ‌ర్ 24న బాల‌కృష్ణ దాదాతో పాటు నాగార్జున వందో సినిమా రిలీజ్ కాబోతున్నాయి. వాటికి పోటీగా కిర‌ణ్ అబ్బ‌వ‌రం రియాలిటీ విడుద‌ల కానుండ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది.

 

Advertisement
Advertisement