త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ntr | ఎన్టీఆర్ వాచ్ ధ‌ర రెండు కోట్లా? – చిన్న సినిమా బ‌డ్జెట్‌తో స‌మాన‌మంటూ నెటిజ‌న్ల కామెంట్లు

అగ్ర ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి త‌న‌యుడు కార్తికేయ నిర్మించిన డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ మూవీ అక్టోబ‌ర్ 2న థియేట‌ర్ల‌లోకి రాబోతుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవ‌ల హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ఈ వేడుక‌కు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్‌గా అటెండ్ అయ్యాడు. ఈ ఈవెంట్‌లో ఎన్టీఆర్ ధ‌రించిన ఓ ల‌గ్జ‌రీ వాచ్ ధ‌ర సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఆడెమ‌ర్స్ పిగ్యూట్ బ్రాండ్‌కు చెందిన ఈ వాచ్ ఖ‌రీదు రెండు కోట్ల వ‌ర‌కు ఉంటుంద‌ని స‌మాచారం.

N

Entertainment | Published On Oct 1, 2026, 3.56 pm IST

Ntr | ఎన్టీఆర్ వాచ్ ధ‌ర రెండు కోట్లా? – చిన్న సినిమా బ‌డ్జెట్‌తో స‌మాన‌మంటూ నెటిజ‌న్ల కామెంట్లు
Advertisement

Ntr |డ్రాగ‌న్ షూటింగ్‌లో గాయ‌ప‌డ్డ ఎన్టీఆర్ లాంగ్ గ్యాప్ త‌ర్వాత డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ద్వారా అభిమానుల ముందుకొచ్చారు. దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి త‌న‌యుడు కార్తికేయ ఈ సినిమాను నిర్మించాడు. ఫ‌హాద్ ఫాజిల్ హీరోగా న‌టించిన ఈ సినిమాకు శ‌శాంక్ యేలేటి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. అక్టోబ‌ర్ 2న డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది.

ఎన్టీఆర్  గెస్ట్‌

ఇటీవ‌ల ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వ‌హించారు. ఈ వేడుక‌కు ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్‌గా అటెండ్ అయ్యారు. ఈ ఈవెంట్‌కు హాజ‌రైన సెలిబ్రిటీలు అంద‌రిపైన సెటైర్లు, పంచ్‌లు వేస్తూ చాలా హుషారుగా క‌నిపించారు ఎన్టీఆర్‌. స్టేజ్‌పై మాట్లాడుతూ ఎమోష‌న‌ల్ అయ్యాడు. రాజ‌మౌళి ఫ్యామిలీతో త‌న‌కున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. చాలా రోజుల త‌ర్వాత ఎన్టీఆర్ ఓ సినిమా ప్ర‌మోష‌న్స్‌లో పాల్గొన‌డం చూసి అభిమానులు తెగ ఖుషి అవుతున్నారు. అత‌డి స్పీచ్ వైర‌ల్ అవుతోంది.

ల‌గ్జ‌రీ వాచ్‌...

కాగా డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఓ ల‌గ్జ‌రీ వాచ్ ధ‌రించి ఎన్టీఆర్ అటెండ్ అయ్యారు. ఈ వాచ్‌ ధ‌ర సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఆడెమ‌ర్స్ పిగ్యూట్ అనే అనే బ్రాండ్‌కు చెందిన ఈ వాచ్ ఖ‌రీదు కోటిన్న‌ర నుంచి రెండు కోట్ల వ‌ర‌కు ఉంటుంద‌ని స‌మాచారం. రాయ‌ల్ ఓక్ ఆఫ్‌షోర్ క్రోనోగ్రాఫ్ మోడ‌ల్‌కు చెందిన రేర్ వాచ్ ఇద‌ని నెటిజ‌న్లు చెబుతోన్నారు. ఈ ల‌గ్జ‌రీ వాచ్ కొనుగోలు చేసిన అతి త‌క్కువ మంది ఇండియ‌న్ సెలిబ్రిటీల‌లో ఎన్టీఆర్ ఒక‌ర‌ని అంటున్నారు. స్విట్ల‌ర్లాండ్ నుంచి ఈ ల‌గ్జ‌రీ వాచ్‌ను ఎన్టీఆర్ ప్ర‌త్యేకంగా తెప్పించుకున్న‌ట్లు స‌మాచారం.ఎన్టీఆర్ వాచ్ ధ‌ర‌తో ఓ చిన్న సినిమా తీయ‌చ్చ‌ని నెటిజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు.

ఎనిమిది కోట్లు...

ఆడెమ‌ర్స్ పిగ్యూట్ తో పాటు ఎన్టీఆర్ వ‌ద్ద ప‌లు ఇంట‌ర్నేష‌న‌ల్ బ్రాండ్స్‌కు చెందిన ల‌గ్జ‌రీ వాచ్ క‌లెక్ష‌న్స్‌ ఉన్నాయి. రిచ‌ర్డ్ మిల్నే (ఎనిమిది కోట్లు), ప‌టేక్ ఫిలిప్పే (2. 45 కోట్లు), రోలెక్స్ డైటోనా (రెండు కోట్ల ఇర‌వై ల‌క్ష‌లు) వంటి ల‌గ్జ‌రీ వాచ్‌ల‌ను ఎన్టీఆర్ కొనుగోలు చేశారు.

డ్రాగ‌న్‌...

కాగా ప్ర‌స్తుతం ఎన్టీఆర్ డ్రాగ‌న్ సినిమా చేస్తోన్నాడు. పీరియాడిక‌ల్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాకు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. 2027 జూన్ 11న ఈ మూవీ థియేట‌ర్ల‌లోకి రాబోతుంది. ఈ సినిమాలో రుక్మిణి వ‌సంత్ హీరోయిన్‌గా న‌టిస్తోంది.

 

Advertisement
Advertisement