త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Thalapathy Vijay | తండ్రి దళపతి విజయ్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేసిన కొడుకు సంజయ్

ద‌ళ‌ప‌తి విజ‌య్ నుంచి విడాకులు కోరుతూ ఆయ‌న భార్య సంగీత కోర్టును ఆశ్ర‌యించింది. ఈ విడాకుల వార్త‌ల న‌డుమ ద‌ళ‌ప‌తి విజ‌య్ కొడుకు జాస‌న్ సంజ‌య్ తండ్రిని సోష‌ల్ మీడియాలో అన్‌ఫాలో చేశాడు.

N

Entertainment | Published On Mar 1, 2026, 11.41 am IST

Thalapathy Vijay | తండ్రి దళపతి విజయ్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేసిన కొడుకు సంజయ్
Advertisement

Thalapathy Vijay |  కోలీవుడ్ స్టార్ హీరో, టీవీకే అధినేత ద‌ళ‌ప‌తి విజ‌య్ గ‌త కొద్ది నెల‌లుగా వివాదాల‌తోనే ఎక్కువ‌గా వార్త‌ల్లో నిల‌స్తున్నాడు. పొలిటిక‌ల్ పార్టీ పెట్టిన‌ప్ప‌టి నుంచి ఆయ‌న్ని వ‌రుస‌గా వివాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. తాజాగా ద‌ళ‌ప‌తి విజ‌య్ విడాకుల వ్య‌వ‌హారం ద‌క్ష‌ణాది సినీ, రాజ‌కీయ వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌రంగా మారింది. ఈ అగ్ర హీరో నుంచి విడాకులు కోరుతూ అత‌డి భార్య సంగీత ఇటీవ‌లే కోర్టును ఆశ్ర‌యించింది. ఓ న‌టితో వివాహేతర సంబంధం కార‌ణంగానే విజ‌య్ నుంచి విడాకులు తీసుకోబోతున్న‌ట్లు త‌న పిటిష‌న్‌లో సంగీత పేర్కొన్న‌ది. మ‌న‌స్ప‌ర్థ‌ల కార‌ణంగా గ‌త రెండేళ్లుగా విజ‌య్‌, సంగీత విడివిడిగా ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. భార్య‌తో పాటు పిల్ల‌లు కూడా విజ‌య్‌కి దూరంగా ఉంటున్నార‌ట‌.

సోష‌ల్ మీడియాలో అన్‌ఫాలో...

ఈ విడాకుల వార్త‌ల వేళ ద‌ళ‌ప‌తి విజ‌య్ కొడుకు జాస‌న్ సంజ‌య్ తండ్రిని సోష‌ల్ మీడియాలో అన్‌ఫాలో చేశాడు. ఇన్నాళ్లుగా ఇన్‌స్టాగ్రామ్‌లో తండ్రిని ఫాలో అయ్యాడు జాస‌న్ సంజ‌య్‌. త‌ల్లి సంగీత విడాకుల కోసం పిటిష‌న్ దాఖ‌లు చేసిన రెండు రోజుల త‌ర్వాత స‌డెన్‌గా జాస‌న్ సంజ‌య్ తండ్రి విజ‌య్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. తండ్రిపై ద్వేషంతోనే అత‌డు ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు చెబుతోన్నారు.

డైరెక్ట‌ర్‌గా ఎంట్రీ...

ద‌ళ‌ప‌తి విజ‌య్ , సంగీత దంప‌తుల‌కు జాస‌న్ సంజ‌య్‌తో కూతురు దివ్య సాషా ఉన్నారు. తండ్రి బాట‌లోనే జాస‌న్ సంజ‌య్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే హీరోగా కాకుండా డైరెక్ట‌ర్‌గా సిగ్మా అనే మూవీతో త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు. సిగ్మా మూవీలో సందీప్ కిష‌న్ హీరోగా న‌టించాడు. ఫ‌రియా అబ్దుల్లా హీరోయిన్‌గా న‌టించిన ఈ యాక్ష‌న్ అడ్వెంచ‌ర్ మూవీలో కేథ‌రిన్ ఓ స్పెష‌ల్ సాంగ్ చేసింది. ఇందులో జాస‌న్ సంజ‌య్ కూడా గెస్ట్ రోల్‌లో క‌నిపించిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.
కాగా ద‌ళ‌ప‌తి విజ‌య్‌, సంగీత విడాకుల పిటిష‌న్‌కు సంబంధించిన విచార‌ణ ఏప్రిల్ 20న జ‌రుగ‌నుంది. విజ‌య్‌ని కూడా వ్య‌క్తిగ‌త విచార‌ణ‌కు హాజ‌రుకావాల్సిందిగా కోర్టు ఆదేశించిన‌ట్లు స‌మాచారం.

 

Advertisement
Advertisement