Haniska | రెండేళ్లు నరకం అనుభవించా – విడాకులపై హన్సిక కామెంట్స్ వైరల్
ఇటీవలే విడాకులతో నాలుగేళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలికింది హన్సిక. సోహైల్ కుతరియా, హన్సికలకు మార్చిలో కోర్టు విడాకులు ఇచ్చింది. ఈ విడాకులపై ఇన్నాళ్లు సైలెంట్‌గా ఉన్న హన్సిక ఫస్ట్ టైమ్ రియాక్ట్ అయ్యింది. విడాకుల విషయంలో ఎలాంటి బాధ, పశ్చాత్తాపం లేవని అన్నది.
Entertainment | Published On Apr 17, 2026, 3.52 pm IST
Haniska | ఇటీవలే భర్త సొహైల్ కతురియా నుంచి విడాకులు తీసుకుంది హన్సిక. నాలుగేళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలికింది. భర్తతో విభేదాలతో పాటు విడాకులపై ఇన్నాళ్లు సెలైంట్‌గా ఉన్న హన్సిక ఎట్టకేలకు మౌనం వీడింది. విడాకుల విషయంలో ఎలాంటి బాధ, పశ్చాత్తాపం లేవని అన్నది. తాను తీసుకున్న నిర్ణయం సరైందనేనని ఓ ఇంటర్వ్యూలో కామెంట్స్ చేసింది.
మూడో వ్యక్తి....
"మా మధ్య ఏం జరిగింది? విభేదాలకు కారణమేమిటన్నది మా ఇద్దరికే తెలుసు. ఇందులో మూడో వ్యక్తి జోక్యం అనవసరం అనిపించింది. నీ బాధ ఇతరులకు వినోదంగా మారకూడదని మా అమ్మ నాకు సలహా ఇచ్చింది.ఎన్ని కష్టాలు ఎదురైనా ఎవరితో వాటిని పంచుకోలేదు. వాటిని నాలో నేనే దిగమింగుకుంటూ ముందుకు సాగుతున్నా . విడాకుల విషయంలో ఎలాంటి బాధ లేదు. పశ్చాత్తాప పడటం లేదు. నేను తీసుకున్న నిర్ణయం సరైందేనని అనుకుంటున్నా"అని చెప్పింది.
నా జీవితంలో అదే జరిగింది...
"ఒక్కోసారి మన ప్రయాణించాల్సిన రైలు మారిపోతుంది. ఎంతో ఆనందంగా సాగాల్సిన ప్రయాణాన్ని అనిశ్చితి, ఆందోళనతో చేయాల్సివస్తుంది. చివరి గమ్యం వరకు కష్టాలు పడుతూ జర్నీ కొనసాగించడం కంటే ఆ రైలు నుంచి దిగిపోవడమే మంచిదని నాకు అనిపించింది. నా వైవాహిక జీవితంలో అదే జరిగింది. కొన్ని బంధాలు తెంచుకోవడం ఎంతో బాధాకరమే. కానీ అదే మన వ్యక్తిత్వాన్ని హరించేదో, ఎదుగుదలు అడ్డుకునేదో అయితే ఎప్పుడో ఒకప్పుడు ముగించక తప్పదు. అసౌకర్యంగా లేనప్పుడు ఏ బంధమైనా కొనసాగించడంలో అర్థం ఉండదు" అని హన్సిక చెప్పింది.
నరకం అనుభవించా...
"గత రెండేళ్లు చాలా నరకం అనుభవించా. ఇప్పటికీ ఆ రోజులను తల్చుకుంటే భయమేస్తుంది. తీవ్రమైన ఒత్తిడి కారణంగా డిప్రెషన్‌లోకి వెళ్లిపోయా. నా జీవితం ముగిసిందని భయపడ్డా. కుటుంబసభ్యుల సహకారంతో ఆ కష్టాల నుంచి మెళ్లమెళ్లగా బయటపడ్డా. మళ్లీ నా లైఫ్‌లో కొత్త ఛాప్టర్ మొదలుపెట్టా" అని హన్సిక చెప్పింది.
2002లో పెళ్లి...
బిజినెస్‌మెన్ సొహైల్ కతురియాను ప్రేమించిన హన్సిక 2022లో అతడితో ఏడడుగుల వేసింది. రాజస్థాన్ జైపూర్‌లోని ముందోటా ప్యాలెస్‌లో గ్రాండ్‌గా ఈ జంట పెళ్లి జరిగింది. వివాహం జరిగిన ఏడాదిలోపే హన్సిక, సొహైల్ కతురియా మధ్య మనస్పర్థలు మొదలయ్యాయట . భర్త నుంచి దూరమైన హన్సిక గత కొన్నేళ్లుగా తల్లితో కలిసి ఉంటోంది. ఇటీవలే మార్చిలో హన్సిక, సోహైల్ కతురియాకు కోర్టు విడాకులు మంజూరు చేసింది.
ప్రస్తుతం హన్సిక తెలుగులో గల్లీ పేరుతో ఓ వెబ్‌సిరీస్ చేస్తోంది. సుధీర్ బాబు లీడ్ రోల్‌లో నటిస్తోన్న ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ కాబోతుంది.
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



