త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Dhanush kara | రైతు…దొంగ‌గా మారితే – ధ‌నుష్ క‌ర తెలుగు టీజ‌ర్ రిలీజ్‌

ధ‌నుష్ హీరోగా న‌టించిన స‌ర్వైవ‌ల్ యాక్ష‌న్ మూవీ క‌ర ఏప్రిల్ 30న తెలుగు, త‌మిళ భాష‌ల్లో రిలీజ్ కాబోతుంది. మ‌మితా బైజు హీరోయిన్‌గా న‌టించిన ఈ మూవీకి విఘ్నేష్ రాజా ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సినిమా తెలుగు టీజ‌ర్‌ను శుక్ర‌వారం మేక‌ర్స్ రిలీజ్ చేశారు.

N

Entertainment | Published On Apr 24, 2026, 7.16 pm IST

Dhanush kara | రైతు…దొంగ‌గా మారితే – ధ‌నుష్ క‌ర తెలుగు టీజ‌ర్ రిలీజ్‌
Advertisement

Dhanush kara | ధ‌నుష్ హీరోగా న‌టిస్తోన్న క‌ర మూవీ ఏప్రిల్ 30న థియేట‌ర్ల‌లోకి రాబోతుంది. విఘ్నేష్ రాజా ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాలో మ‌మితా బైజు హీరోయిన్‌గా న‌టిస్తోంది. స‌ర్వైవ‌ల్ యాక్ష‌న్‌గా తెర‌కెక్కుతోన్న ఈ మూవీ తెలుగు టీజ‌ర్‌ను మేక‌ర్స్ శుక్ర‌వారం రిలీజ్ చేశారు. స‌స్పెన్స్‌, యాక్ష‌న్, ఫ్యామిలీ ఎమోష‌న్స్‌తో టీజ‌ర్ ఇంటెన్స్‌గా సాగింది. దొంగ‌గా, రైతుగా, బాధ్య‌త క‌లిగిన భ‌ర్త‌గా... డిఫ‌రెంట్ షేడ్స్‌తో కూడిన పాత్ర‌లో ధ‌నుష్ ఈ సినిమాలో క‌నిపించ‌బోతున్న‌ట్లు టీజ‌ర్‌లో చూపించారు.

విత్త‌నం కోత‌కొచ్చింది...

నేను నాటిన విత్త‌నం ఇప్పుడు కోత కొచ్చింది....అంత కంటే ముందు నామీద ప‌డ్డ మ‌చ్చ‌ని తుడిచేయాలి...న‌న్ను న‌మ్ముకున్న వారిని ముందుకు తీసుకెళ్లాలి...నా పేరు క‌ర‌సామి’’ అంటూ ధ‌నుష్ చెప్పిన డైలాగ్స్ ఆస‌క్తిని పంచుతున్నాయి. ఇంత‌కీ క‌ర‌సామి మీద ప‌డ్డ మ‌చ్చ ఏంటి? ఈ నింద నుంచి అత‌డు ఎలా బ‌య‌ట‌ప‌డ్డాడ‌నే అంశాల‌తో క‌ర సినిమాను రూపొందిస్తున్న‌ట్లు నిర్మాత‌లు ప్ర‌క‌టించారు.

జీవీ ప్ర‌కాష్ కుమార్‌...

క‌ర సినిమాకు జీవీ ప్ర‌కాష్ కుమార్ మ్యూజిక్, థేని ఈశ్వ‌ర్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. త్వ‌ర‌లోనే ట్రైల‌ర్‌ను విడుద‌ల చేయ‌టానికి మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తున్నారు. కె.ఎస్. రవికుమార్, కరుణాస్, జయరామ్, సూరజ్ వెంజరమూడు ఈ సినిమాలో కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నారు.

Advertisement
Advertisement