Mamitha Baiju | వంద కోట్ల బడ్జెట్ – 40 కోట్ల కలెక్షన్స్ – ఓటీటీలోకి మమితా బైజు కోలీవుడ్ డిజాస్టర్ మూవీ – తెలుగులో రిలీజ్
ధనుష్, మమితా బైజు జంటగా నటించిన లేటెస్ట్ కోలీవుడ్ యాక్షన్ మూవీ కర నెక్స్ట్ వీక్‌లో ఓటీటీలో సందడి చేయబోతుంది. మే 28 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. తమిళంతో పాటు తెలుగులో రిలీజ్ అవుతోంది.
Entertainment | Published On May 23, 2026, 4.22 pm IST
Mamitha Baiju | ధనుష్, మమితా బైజు హీరోహీరోయిన్లుగా నటించిన తమిళ మూవీ కర భారీ అంచనాల నడుమ రిలీజై బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. వంద కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ కేవలం నలభై కోట్ల కలెక్షన్స్‌తో దారుణంగా నిరాశపరిచింది. కర మూవీకి విఘ్నేష్ రాజా దర్శకత్వం వహించాడు. జయరామ్, కేఎస్ రవికుమార్, సూరజ్ వెంజరమూడు ప్రధాన పాత్రల్లో నటించారు.
నెట్‌ఫ్లిక్స్‌లో...
ఈ డిజాస్టర్ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. మే 28 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కాబోతుంది. తమిళంతో పాటు తెలుగులో కూడా రిలీజ్ అవుతోంది. కర మూవీ ఏప్రిల్ నెలాఖరున థియేటర్లలో విడుదలైంది. డిజాస్టర్ టాక్ కారణంగా మూడు వారాల్లోనే మేకర్స్ ఓటీటీలోకి తీసుకొస్తున్నారు.
డీ గ్లామర్ పాత్రలో...
బ్యాంకు మోసాలకు తండ్రీకొడుకుల అనుబంధం, యాక్షన్ అంశాలతో జోడించి దర్శకుడు విఘ్నేష్ రాజా కర సినిమాను తెరకెక్కించారు. పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ మూవీలో డీ గ్లామర్ పాత్రలో మమితా బైజు కనిపించింది. ధనుష్ యాక్టింగ్ బాగుందనే టాక్ వచ్చినా... కాన్సెప్ట్ ఔట్‌డేటెడ్ కావడం, ఆశించిన స్థాయిలో థ్రిల్ ఎలిమెంట్స్ లేకపోవడంతో కర ఫెయిల్యూర్‌గా నిలిచింది.
మల్లితో ప్రేమలో పడితే...
కర (ధనుష్) ఓ దొంగ. మల్లితో (మమితా బైజు) ప్రేమలో పడతాడు. మల్లిని పెళ్లి చేసుకొని దొంగతనాలకు గుడ్‌బై చెప్పాలని అనుకుంటాడు. తండ్రి పొలాన్ని బ్యాంకులో తాకట్టు పెట్టి లోన్ తీసుకొని ఓ హోటల్ పెట్టుకొనేందుకు ప్రయత్నాలు చేస్తాడు కర. కానీ కర తండ్రిని కోదండాన్ని మోసం చేసిన బ్యాక్ మేనేజర్ ముత్తు సెల్వన్ (జయరామ్అ) అతడి పొలాన్ని లాక్కుంటాడు. ఆ బాధతోనే కోదండం చనిపోతాడు. తండ్రి మరణంపై కర ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు? డీఎస్‌పీ భరతన్‌తో అతడికి ఉన్న గొడవలకు కారణమేమిటి అన్నదే కర మూవీ కథ.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Netflix | నెట్‌ఫ్లిక్స్‌లో కొత్తగా ఏఐ వాయిస్ సెర్చ్.. ఇక కావల్సిన విధంగా సినిమాలు, సిరీస్ లను సెర్చ్ చేయవచ్చు..
జూన్ 9, 2026

OTT | ఓటీటీలోకి అక్షయ్‌కుమార్ లేటెస్ట్ హారర్ కామెడీ మూవీ – పెళ్లి కూతుళ్లను ఎత్తుకుపోయే దయ్యం కథ
జూన్ 9, 2026

Sai Pallavi | ధనుష్ సినిమాలో సాయి పల్లవి షాకింగ్ రోల్ – లేడీ సింగంగా నాచురల్ బ్యూటీ
జూన్ 5, 2026
తాజావార్తలు
- ●Nithya Menen | మెగా ఫోన్ పట్టనున్న నిత్యా మీనన్ - థ్రిల్లర్ కథతో డెబ్యూ మూవీ
- ●Toll Tax | టోల్ ఫ్రీకి బ్రేక్.. ఇక ప్రభుత్వ అధికారులు కూడా టోల్ చెల్లించాల్సిందే..?
- ●Hyderabad Rains | హైదరాబాద్‌ను కమ్మేసిన కారుమేఘాలు.. దంచికొడుతున్న భారీ వర్షం..
- ●Tenant Farmers Report | యూరియా రాదు.. పంట కొనరు
- ●Mamata Banerjee | సంతకాల ఫోర్జరీ.. మమతా బెనర్జీ ఇంట్లో సీఐడీ సోదాలు
- ●ITR | ఐటీఆర్ ఫైల్ చేస్తే సరిపోదు.. ఈ కారణాలుంటే తప్పనిసరిగా ఆదాయపు పన్ను శాఖ పరిశీలిస్తుంది..

Nithya Menen | మెగా ఫోన్ పట్టనున్న నిత్యా మీనన్ - థ్రిల్లర్ కథతో డెబ్యూ మూవీ

Toll Tax | టోల్ ఫ్రీకి బ్రేక్.. ఇక ప్రభుత్వ అధికారులు కూడా టోల్ చెల్లించాల్సిందే..?

Hyderabad Rains | హైదరాబాద్‌ను కమ్మేసిన కారుమేఘాలు.. దంచికొడుతున్న భారీ వర్షం..

Tenant Farmers Report | యూరియా రాదు.. పంట కొనరు



