Chiranjeevi | షూటింగ్ పూర్తయిన రెండేళ్ల తర్వాత థియేటర్లలోకి చిరంజీవి విశ్వంభర – త్రిష సీన్లు కట్?
చిరంజీవి విశ్వంభర రిలీజ్ కోసం ఫ్యాన్స్ గత రెండేళ్లుగా ఎదురుచూస్తున్నారు. వారి ఎదురుచూపులకు ఆగస్ట్ 22న సమాధానం రానున్నట్లు సమాచారం. ఈ సోషియా ఫాంటసీ మూవీ రిలీజ్ డేట్‌ను చిరంజీవి బర్త్‌డే రోజు రివీల్ చేయబోతున్నారు. అక్టోబర్ 15న విశ్వంభర రిలీజ్ కానున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Entertainment | Published On Jul 30, 2026, 4.41 pm IST
Chiranjeevi | మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర షూటింగ్ పూర్తయి రెండేళ్లు దాటిపోయింది. 2025 సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ కావాల్సింది. గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్ సీన్లపై విమర్శలు రావడంతో మేకర్స్ రిలీజ్‌ను వాయిదావేశారు. అప్పటి నుంచి రీ షూట్స్, రీ ఎడిట్స్ జరుగుతూనే ఉన్నాయి. విశ్వంభర తర్వాత షూటింగ్ మొదలైన చిరంజీవి మన శంకర వరప్రసాద్‌గారు రిలీజై హిట్టు కూడా అయ్యింది. అయినా విశ్వంభర విడుదలపై ఎలాంటి అప్‌డేట్ రాలేదు. ఈ సోషియా ఫాంటసీ యాక్షన్ మూవీ థియేటర్లలోకి వచ్చేది ఎప్పుడా అని ఎదురుచూస్తున్న అభిమానుల నిరీక్షకు చిరంజీవి బర్త్‌డే రోజు సమాధానం రానున్నట్లు సమాచారం.
వీడియో గ్లింప్స్...
ఆగస్ట్ 22న విశ్వంభర రిలీజ్ డేట్‌ను రివీల్ చేయబోతున్నట్లు తెలిసింది. అంతే కాకుండా ఈ సినిమాకు సంబంధించిన ఓ స్పెషల్ వీడియో గ్లింప్స్‌తో ఫ్యాన్స్‌కు ఓ సర్‌ప్రైజ్ కూడా ఇవ్వబోతున్నారు మేకర్స్. ఈ వీడియో గ్లింప్స్‌కు సంబంధించిన వర్క్ మొదలుపెట్టినట్లు సమాచారం. దసరా కానుకగా అక్టోబర్ 15న విశ్వంభర థియేటర్లలోకి రానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తొలుత అక్టోబర్ 14న విశ్వంభరను విడుదల చేయాలని అనుకున్నారు మేకర్స్. కానీ అదే రోజు రజనీకాంత్ జైలర్ 2 థియేటర్లలోకి వస్తోండటంతో ఒక రోజు ఆలస్యంగా అక్టోబర్ 15న చిరంజీవి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు టాక్.
త్రిష హీరోయిన్...
విశ్వంభర మూవీలో త్రిష హీరోయిన్‌గా నటిస్తోంది. ఆషికా రంగనాథ్ ఓ కీలక పాత్రలో కనిపించబోతుంది. బాలీవుడ్ బ్యూటీ మౌనీరాయ్ స్పెషల్ సాంగ్ చేసింది. ఈ సోషియా ఫాంటసీ థ్రిల్లర్ మూవీని మూడు గంటల రన్‌టైమ్‌తో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేసినట్లు సమాచారం. రీ ఎడిట్స్‌తో పాటు ఇటీవల కాలంలో గ్రాఫిక్స్ సినిమాలపై వచ్చిన విమర్శలను దృష్టిలో పెట్టుకొని రన్‌టైమ్‌ను అరగంటకుపైనే తగ్గించబోతున్నారని అంటున్నారు. త్రిష నటించిన చాలా సీన్లను రీ ఎడిట్‌లో లేపేసినట్లు తెలిసింది. ఆమె స్క్రీన్ టైమ్‌ను చాలా తగ్గించారని టాక్ నడుస్తోంది. త్రిష నటించిన ఇరవై నిమిషాలకు పైగా ఫుటేజీని ఫైనల్ కాపీ నుంచి కట్ చేయబోతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. విశ్వంభర సినిమాకు బింబిసార ఫేమ్ వశిష్ట మల్లిడి దర్శకత్వం వహిస్తున్నారు.
ఇరవై ఏళ్ల తర్వాత...
స్టాలిన్ తర్వాత దాదాపు ఇరవై ఏ ళ్ల గ్యాప్ అనంతరం చిరంజీవి, త్రిష కాంబినేషన్‌లో వస్తోన్న సెకండ్ మూవీ ఇది. ఈ సినిమాకు ఎం.ఎం కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నాడు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Ramayana | రామాయణలో హీరోయిన్‌గా ఫస్ట్ ఛాయిస్ సాయిపల్లవి కాదు – సీత పాత్రను మిస్ చేసుకున్న కేజీఎఫ్ బ్యూటీ
జులై 30, 2026

Tollywood | మణిరత్నం, రామ్‌గోపాల్ వర్మ కలిసి కథను అందించిన ఒకే ఒక తెలుగు మూవీ ఏదో తెలుసా?
జులై 30, 2026

Bhagyashri Borse | నేను హీరోయిన్ కావడం మా అమ్మకు ఇష్టం లేదు – భాగ్యశ్రీ బోర్సే కామెంట్స్
జులై 30, 2026
తాజావార్తలు
- ●Ramayana | రామాయణలో హీరోయిన్‌గా ఫస్ట్ ఛాయిస్ సాయిపల్లవి కాదు - సీత పాత్రను మిస్ చేసుకున్న కేజీఎఫ్ బ్యూటీ
- ●criminal waste| ఇంజనీరింగ్ విద్యార్థులను 'క్రిమినల్ వేస్ట్' అంటావా
- ●Sanjay Jaju | పేరు సంజయ్ జాజు.. రాష్ట్రానికే సీఎస్.. అయినా అధికారిక నివాసం ఇస్తలేరట
- ●Tollywood | మణిరత్నం, రామ్‌గోపాల్ వర్మ కలిసి కథను అందించిన ఒకే ఒక తెలుగు మూవీ ఏదో తెలుసా?
- ●Vaddiraju Ravichandra | పరీక్ష అంటే ఏండ్ల కష్టం.. అందుకే ప్రజా పరీక్షల సవరణ బిల్లుకు మద్దతిస్తున్నం
- ●KTR | యువ ఇంజినీర్ల ప్రతిభను క్రిమినల్ వేస్ట్ అని అవమానిస్తారా..? : రేవంత్‌పై కేటీఆర్ ఫైర్

Ramayana | రామాయణలో హీరోయిన్‌గా ఫస్ట్ ఛాయిస్ సాయిపల్లవి కాదు - సీత పాత్రను మిస్ చేసుకున్న కేజీఎఫ్ బ్యూటీ

criminal waste| ఇంజనీరింగ్ విద్యార్థులను 'క్రిమినల్ వేస్ట్' అంటావా

Sanjay Jaju | పేరు సంజయ్ జాజు.. రాష్ట్రానికే సీఎస్.. అయినా అధికారిక నివాసం ఇస్తలేరట

Tollywood | మణిరత్నం, రామ్‌గోపాల్ వర్మ కలిసి కథను అందించిన ఒకే ఒక తెలుగు మూవీ ఏదో తెలుసా?



