OTT | అనసూయకు విడాకులు ఇస్తానన్న భర్త – నేరుగా ఓటీటీలోకి బాలీవుడ్ మూవీ
బాలీవుడ్ మూవీ జబ్ ఖులి కితాబ్ నేరుగా ఓటీటీలోకి రాబోతుంది. మార్చి 6 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ హిందీ మూవీలో పంకజ్‌కుమార్, డింపుల్ కపాడియా కీలక పాత్రల్లో నటించారు.
Entertainment | Published On Mar 2, 2026, 8.47 pm IST
OTT | బాలీవుడ్ మూవీ జబ్ ఖులి కితాబ్ థియేటర్లను స్కిప్ చేస్తూ నేరుగా ఓటీటీలోకి రాబోతుంది. పంకజ్ కపూర్, డింపుల్ కపాడియా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీ మార్చి 6 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుంది. సౌరభ్ శుక్లా దర్శకత్వం వహించాడు. ఈ సినిమా ట్రైలర్‌ను సోమవారం రిలీజ్ చేశారు. పెళ్లైన యాభై ఏళ్ల తర్వాత వృద్ధాప్యంలో ఓ జంట విడాకులు తీసుకోవాలని ఎందుకు అనుకున్నారు? కోర్టులో వారికి ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయనే అంశాలతో ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ రూపొందుతోంది.
అనసూయ...గోపాల్...
గోపాల్ (పంకజ్ కపూర్), అనసూయ (డింపుల్ కపాడియా) పెళ్లైన యాభై ఏళ్ల తర్వాత తమ వివాహా బంధానికి పుల్ స్టాప్ పెట్టాలని, విడాకులు తీసుకోవాలని అనుకుంటారు. గోపాల్ విడాకులు కావాలని కోరితే.. అనసూయ మాత్రం విడాకులకు అంగీకరించదు. ఇక వారి పిల్లలు, మనవళ్లు, మనవరాళ్లతో కుటుంబం ఎంతో నిండుగా ఉంటుంది. భార్యను ఎంతగానో ప్రేమించే గోపాల్ ఆమెకు విడాకులు ఇవ్వాలని ఎందుకు అనుకున్నాడు? అతడి నిర్ణయం వెనకున్న కథేమిటనే ట్రైలర్ ఎంటర్‌టైనింగ్‌గా ఉంది. ప్రేమకు అసలైన నిర్వచనం ఇచ్చే సినిమా ఇదని మేకర్స్ పేర్కొన్నారు. అపరశక్తి ఖురానా, మానసి ఫరేఖ్, సమీర్ సోనీ కీలక పాత్రల్లో నటించారు. తన డ్రీమ్ ప్రాజెక్ట్‌లలో ఒకటని డింపుల్ కపాడియా అన్నది.
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Pooja Hegde | చిక్కుల్లో పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ మూవీ – లీగల్ సమస్యలతో ట్రైలర్ రిలీజ్ క్యాన్సిల్
మే 21, 2026

Sai Pallavi | పాపం సాయిపల్లవి… రామాయణ డైరెక్టర్ అంత మాట అనేశాడేంటి?
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



