Bandla Ganesh | బండ్ల గణేశ్ ఇంట పెళ్లి సందడి..!
Bandla Ganesh | టాలీవుడ్‌కు చెందిన నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ ఇంట్ల పెళ్లి సందడి మొదలైంది. ఎప్పుడూ సంచలన కామెంట్స్‌తో వార్తల్లో నిలిచే ఆయన.. తండ్రిగా కొత్త బాధ్యతలను ఆనందంగా స్వీకరిస్తున్నారు.
Entertainment | Published On Apr 3, 2026, 7.50 pm IST
Bandla Ganesh | టాలీవుడ్‌కు చెందిన నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ ఇంట్ల పెళ్లి సందడి మొదలైంది. ఎప్పుడూ సంచలన కామెంట్స్‌తో వార్తల్లో నిలిచే ఆయన.. తండ్రిగా కొత్త బాధ్యతలను ఆనందంగా స్వీకరిస్తున్నారు. ఆయన కుమార్తె జనని బండ్ల త్వరలో వివాహం జరుగనుండడంతో కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది. ఈ శుభవార్తను స్వయంగా బండ్ల గణేశ్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. “శ్రీరస్తు, శుభమస్తు, అవిఘ్నమస్తు... దేవుని కృప, పెద్దల ఆశీర్వాదాలతో మా ఇంట్లో పెళ్లి ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి” అంటూ శుభవార్తను అభిమానులతో పంచుకున్నారు.

పెళ్లికి ముందుగా జరిగే సంప్రదాయ ‘పసుపు-కుంకుమ’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో వరుడు సూర్యతేజ చిలుకూరి, ఇరువురు కుటుంబ సభ్యులతో కలిసి దిగిన ఫొటోలను షేర్ చేయగా.. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మహబూబ్‌నగర్ నుంచి సాధారణ నటుడిగా సినీ ప్రయాణం మొదలుపెట్టిన బండ్ల గణేశ్.. టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించారు.

సుస్వాగతం, మల్లీశ్వరి, ఆంధ్రావాలా తదితర చిత్రాల్లో నటించి కమెడియన్‌గా మంచి గుర్తింపు పొందారు. ఆ తర్వాత నిర్మాతగా మారారు. గబ్బర్ సింగ్ మూవీతో భారీ విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత ఎన్టీఆర్ తో బాద్‌షా, టెంపర్, అల్లు అర్జున్‌తో ఇద్దరమ్మాయిలతో, రామ్ చరణ్‌తో గోవిందుడు అందరివాడేలే తదితర చిత్రాలను నిర్మించారు. తాజాగా మళ్లీ బీజీ బ్లాక్‌బస్టర్స్ అనే బ్యానర్‌తో మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నారు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఓ మూవీలో కీలకపాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది.
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



