త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bandla ganesh | ఆరిపోయే దీపం ఎక్కువ‌గా వెలుగుతుంది – బండ్ల గ‌ణేష్ ట్వీట్ వైర‌ల్‌

Bandla ganesh | టాలీవుడ్ కాంట్ర‌వ‌ర్సీయ‌ల్ ప్రొడ్యూస‌ర్ బండ్ల గ‌ణేష్ మ‌రోసారి వార్త‌ల్లో నిలిచాడు. ఆరిపోయే దీపం ఎక్కువ‌గా వెలుగుతుంది అంటూ శుక్ర‌వారం బండ్ల గ‌ణేష్ చేసిన ఓ ట్వీట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను ఉద్దేశించే బండ్ల గ‌ణేష్ ఈ ట్వీట్ చేశాడ‌ని నెటిజ‌న్లు కామెంట్స్ పెడుతున్నారు.

N

Entertainment | Published On Dec 19, 2025, 6.02 pm IST

Bandla ganesh | ఆరిపోయే దీపం ఎక్కువ‌గా వెలుగుతుంది – బండ్ల గ‌ణేష్ ట్వీట్  వైర‌ల్‌

Bandla Ganesh

Advertisement

Bandla ganesh | బండ్ల గ‌ణేష్ సినిమాల‌కు దూర‌మై చాలా కాల‌మే అవుతోంది. యాక్ట‌ర్‌గానే కాకుండా ప్రొడ్యూస‌ర్‌గా కూడా యాక్టివ్‌గా లేవు. అయినా బండ్ల గ‌ణేష్ (Bandla Ganesh)పేరు మాత్రం త‌ర‌చుగా వినిపిస్తూనే ఉంది. వివాదాల‌తో కొన్నాళ్లుగా ఎక్కువ‌గా వార్త‌ల్లో నిలుస్తున్నాడు. బండ్ల గ‌ణేష్ స్పీచ్‌లు, ట్వీట్ల‌కు స‌ఫ‌రేట్ ఫ్యాన్ బేస్ ఉంది. సినిమాల ప్ర‌మోష‌న‌ల్ ఈవెంట్స్‌లో బండ్ల గ‌ణేష్ ఇచ్చిన స్పీచ్‌లు చాలా సార్లు వైర‌ల్ అయ్యాయి. సెటైరిక‌ల్‌గా బండ్ల గ‌ణేష్ వేసిన ట్వీట్స్ ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.
ఇటీవ‌లే లిటిల్ హార్ట్స్ స‌క్సెస్ మీట్‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను (Vijay Deverakonda) ఉద్దేశించి బండ్ల గ‌ణేష్ చేసిన కామెంట్స్ పెద్ద దుమార‌మే రేపాయి. విజ‌య్ ఫ్యాన్స్ నుంచి వ్య‌తిరేక‌త రావ‌డంతో బండ్ల గ‌ణేష్ దిగొచ్చారు. నేను ఎవ‌రిని ఉద్దేశించి మాట్లాడ‌లేదు. అంద‌రూ బాగుండాలి అంటూ ట్వీట్ చేశాడు. ఈ వివాదానికి పుల్‌స్టాప్ పెట్టాడు.
తాజాగా శుక్ర‌వారం బండ్ల గ‌ణేష్ చేసిన మ‌రో ట్వీట్ హాట్ టాపిక్‌గా మారింది. ఆరిపోయే దీపం ఎక్కువగా వెలుగుతుంది,మునిగే పడవ ఎక్కువగా ఊగుతుంది. చివరి దశలో ఉన్నవాళ్లకే హడావుడి ఎక్కువ ఉంటుంది అంటూ బండ్ల గ‌ణేష్ ట్వీట్ చేశాడు. ఈ పోస్ట్‌లో ఎవ‌రి పేరును బండ్ల గ‌ణేష్ ప్ర‌స్తావించ‌లేదు.

విజ‌య్‌ని ఉద్దేశించేనా...

ఈ ట్వీట్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను ఉద్దేశించే బండ్ల గ‌ణేష్ చేశాడ‌ని నెటిజ‌న్లు చెబుతున్నారు. విజ‌య్ కెరీర్ ఎండింగ్‌కు చేరుకుంద‌ని బండ్ల గ‌ణేష్ ఇన్‌డైరెక్ట్‌గా చెప్పాడ‌ని అంటున్నారు. విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను గ‌ణేష్ ఇప్ప‌ట్లో వ‌దిలిపెట్టేలా లేడ‌ని కామెంట్స్ చేస్తున్నారు. ఈ ట్వీట్‌తో ముగిసింది అనుకున్న వివాదం మ‌ళ్లీ మొద‌టికి వ‌చ్చింద‌ని అంటున్నారు. బండ్ల గ‌ణేష్‌కు ఇది అలవాటేన‌ని కామెంట్స్ పెడుతున్నారు.
బండ్ల గ‌ణేష్ లేటెస్ట్ ట్వీట్‌కు విజ‌య్ ఫ్యాన్ ఎలా రియాక్ట్ అవుతార‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.
నిర్మాత‌గా రీఎంట్రీ ఇచ్చేందుకు కొన్నాళ్ల క్రితం బండ్ల గ‌ణేష్ ప్ర‌య‌త్నాలు చేశార‌ట‌. విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో ఓ సినిమా చేయాల‌ని అత‌డిని అప్రోచ్ అయిన‌ట్లు వార్త‌లొచ్చాయి. కానీ బండ్ల గ‌ణేష్ ఆఫ‌ర్‌ను విజ‌య్ దేవ‌ర‌కొండ రిజెక్ట్ చేశాడ‌ట‌. అక్క‌డి నుంచే ఇద్ద‌రి మ‌ధ్య చెడింద‌ని టాక్ వినిపిస్తోంది. విజ‌య్ రిజెక్ష‌న్‌ను స‌హించ‌లేని బండ్ల గ‌ణేష్ అవ‌కాశం దొరికిన ప్ర‌తిసారి అత‌డిపై రివేంజ్ తీర్చుకుంటున్న‌ట్లు కామెంట్స్ పెడుతున్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement