త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telugu OTT | ఓటీటీలోకి మృణాల్ ఠాకూర్ తెలుగు యాక్ష‌న్ ల‌వ్‌స్టోరీ – ఊహించ‌ని క్లైమాక్స్‌తో…

అడివి శేష్‌, మృణాల్ ఠాకూర్ జంట‌గా న‌టించిన డెకాయిట్ డిఫ‌రెంట్ ల‌వ్‌స్టోరీగా నిలిచింది. కానీ క‌మ‌ర్షియ‌ల్‌గా మాత్రం స‌రైన విజ‌యాన్ని సాధించ‌లేదు. డెకాయిట్ ఓటీటీలోకి వ‌స్తోంది. ఈ సినిమా ఏ ఓటీటీలో...ఎప్ప‌టి నుంచి స్ట్రీమింగ్ కానుందంటే?

N

Entertainment | Published On Apr 28, 2026, 11.42 am IST

Telugu OTT | ఓటీటీలోకి మృణాల్ ఠాకూర్ తెలుగు యాక్ష‌న్ ల‌వ్‌స్టోరీ – ఊహించ‌ని క్లైమాక్స్‌తో…
Advertisement

Telugu OTT |  అడివిశేష్, మృణాల్ ఠాకూర్ హీరోహీరోయిన్లుగా న‌టించిన డెకాయిట్ మూవీ రొటీన్‌కు భిన్న‌మైన ల‌వ్‌స్టోరీగా తెలుగు ప్రేక్ష‌కుల‌ను మెప్పించింది. రొమాంటిక్ యాక్ష‌న్ డ్రామాగా రూపొందిన ఈ మూవీతో సినిమాటోగ్రాఫ‌ర్ షానీల్ డియో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. సుప్రియా యార్ల‌గ‌డ్డ ఈ సినిమాను నిర్మించింది.

అమెజాన్ ప్రైమ్ వీడియో...

అడివిశేష్, మృణాల్ ఠాకూర్‌కు ఉన్న క్రేజ్ కార‌ణంగా థియేట్రిక‌ల్ రిలీజ్‌కు ముందే ఈ సినిమా డిజిట‌ల్ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ వీడియో ద‌క్కించుకుంది. తాజాగా ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్ ఖ‌రారైన‌ట్లు స‌మాచారం. మే 8న అమెజాన్ ప్రైమ్‌లో ఈ మూవీ రిలీజ్ కాబోతున్న‌ట్లు చెబుతోన్నారు.

శాడ్ ఎండింగ్ క్లైమాక్‌...

డెకాయిట్‌లో హీరోగా న‌టిస్తూనే ఈ సినిమాకు క‌థ‌, స్క్రీన్‌ప్లేను అందించారు అడివిశేష్‌. రెగ్యుల‌ర్ ల‌వ్‌స్టోరీస్‌కు భిన్నంగా క‌థ‌ను రాసుకున్నారు. ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ ఓ చిన్నారికి త‌ల్లిగా ఛాలెంజింగ్ రోల్‌లో క‌నిపించింది. అడివిశేష్‌, మృణాల్ ఠాకూర్ యాక్టింగ్‌తో పాటు టెక్నిక‌ల్‌గా బ్రిలియెంట్ మూవీ అంటూ ప్ర‌శంస‌లు వ‌చ్చాయి. ట్విస్ట్‌లు పెద్ద‌గా వ‌ర్క‌వుట్ కాక‌పోవ‌డం, స్లో ఫేజ్ స్క్రీన్‌ప్లే సినిమాకు మైన‌స్‌గా మారాయి. శాడ్ ఎండింగ్ క్లైమాక్స్‌పై మిక్స్‌డ్ రెస్పాన్స్ వ‌చ్చింది.
వంద కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన డెకాయిట్ యాభై కోట్ల లోపే వ‌సూళ్ల‌ను ద‌క్కించుకుంది. నిర్మాత‌కు న‌ష్టాల‌ను తెచ్చిపెట్టింది. డెకాయిట్ మూవీకి భీమ్స్ మ్యూజిక్ అందించాడు.

ప్రియురాలిపై ప‌గ‌తో...

హ‌రి దాస్ (అడివి శేష్‌) ఓ మ‌ర్డ‌ర్ కేసులో జైలు శిక్ష‌ను అనుభ‌విస్తుంటాడు. హ‌రిని ప్రేమించి పెళ్లి చేసుకోవాల‌ని అనుకున్న స‌ర‌స్వ‌తి (మృణాల్ ఠాకూర్‌) అత‌డికి వ్య‌తిరేకంగా త‌ప్పుడు సాక్ష్యం చెప్పి జైలుకు పంపిస్తుంది. ప్రియురాలిపై ప‌గ‌తో ర‌గ‌లిపోయిన హ‌రి జైలు నుంచి త‌ప్పించుకుంటాడు. హ‌రికి దూర‌మైన స‌ర‌స్వ‌తి భాస్క‌ర్‌ను పెళ్లిచేసుకుంటుంది. ఆమె భ‌ర్త గుండె సంబంధిత స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతుంటాడు. హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేష‌న్‌కు చాలా డ‌బ్బు అవ‌స‌ర‌మ‌వుతుంది. స‌ర‌స్వ‌తి భ‌ర్త‌కు ట్రీట్‌మెంట్ ఇస్తున్న హాస్పిట‌ల్‌లోనే దొంగ‌త‌నం చేయాల‌ని హ‌రి ప్లాన్ చేస్తాడు. డ‌బ్బు కోసం ఈ రాబ‌రీలో స‌ర‌స్వ‌తి కూడా భాగ‌మ‌వుతుంది. వారి ప్లాన్ వ‌ర్క‌వుట్ అయ్యిందా? హ‌రిని ప్రేమించిన స‌ర‌స్వ‌తి అత‌డిని ఎందుకు జైలుకు పంపించింది? స‌ర‌స్వ‌తి గురించి హ‌రికి తెలిసిన షాకింగ్ నిజం ఏమిటి? ఆమె ప్రేమ కోసం ఎలాంటి త్యాగానికి సిద్ధ‌ప‌డ్డాడు అన్న‌దే ఈ మూవీ క‌థ‌.

 

Advertisement
Advertisement