Manjari Fadnnis | కుక్కను చంపేశారంటూ కన్నీళ్లు పెట్టుకున్న హీరోయిన్
తమ అపార్ట్‌మెంట్‌లో ఉండే కుక్కను చంపేశారంటూ హీరోయిన్ మంజరి ఫడ్నిస్ ఎమోషనల్ అయ్యింది. కన్నీళ్లు పెట్టుకుంటూ సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Entertainment | Published On Jun 9, 2026, 4.46 pm IST
Manjari Fadnnis | తమ అపార్ట్‌మెంట్‌లో ఉండే కుక్కను అత్యంత దారుణంగా కొట్టి చంపేశారంటూ హీరోయిన్ మంజరి ఫడ్నిస్ కన్నీళ్లు పెట్టుకుంది. బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్ సినిమాల్లో హీరోయిన్‌గా నటించిన మంజరి ఫడ్నిస్ మంగళవారం సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ పెట్టింది. "2019లో ఓ కుటుంబం తమ అపార్ట్‌మెంట్స్‌లో కుక్కను వదిలిపెట్టి వెళ్లిపోయారు. ఆ కుక్కకు మైకీ అనే పేరు పెట్టాం. ఐదారేళ్లుగా మా సోసైటీలోనే ఉంటుంది. కొద్ది రోజులుగా మైకీ కనిపించడం లేదు. ఆచూకీ కోసం పోస్టర్లు కూడా వేశాం. చివరకు మా సొసైటీలోనే ఉండే ఓ వ్యక్తి మైకీని దారుణంగా చంపారు" అంటూ ఈ వీడియోలో మంజరి ఫడ్నిస్ పేర్కొన్నది.
బాలీవుడ్ హీరోయిన్ల సపోర్ట్...
మైకీ చావుకు కారణమైన వారిని వదిలిపెట్టేది లేదని మంజరి ఫడ్నిస్ చెప్పింది. జంతు హింసకు పాల్పడాలంటేనే భయం కలిగేలా కఠినమైన చట్టాలను తీసుకురావాలని డిమాండ్ చేసింది. కన్నీళ్లు పెట్టుకుంటూ మంజరి ఫడ్నిస్ పోస్ట్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పలువురు బాలీవుడ్ నటులతో పాటు పెట్ లవర్స్ ఆమెకు సపోర్ట్ చేస్తూ ట్వీట్స్, కామెంట్లు పెడుతోన్నారు.
సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం...
అల్లరి నరేష్ హీరోగా నటించిన సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం మూవీతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది మంజరి ఫడ్నిస్. ఇంకోసారి, శుభప్రదంతో పాటు ఎన్టీఆర్ శక్తిలో హీరోయిన్‌గా కనిపించింది. బాలీవుడ్‌లో జానే తు యా జానే నాతో తో ఫేమస్ అయిన ఈ బ్యూటీ గ్రాండ్ మస్తీ, వార్నింగ్, మిస్టర్ ఫ్రాడ్‌తో పాటు చాలానే సినిమాలు చేసింది.
సంబంధిత వార్తలు

Sunny Leone | రూ.2400కోట్ల స్కామ్.. సన్నీ లియోన్‌కు సీఐడీ నోటీసులు..!
జూన్ 9, 2026

Peddi Movie | విమర్శల ఎఫెక్ట్ – ఆ సీన్లను డిలీట్ చేయనున్న మేకర్స్ – రామ్‌చరణ్ పెద్ది రీ సెన్సార్
జూన్ 9, 2026

Kajal Aggarwal | నయనతార ఛాన్స్ కొట్టేసిన కాజల్ – భగవంత్ కేసరి కాంబో రిపీట్
జూన్ 9, 2026
తాజావార్తలు
- ●Nithya Menen | మెగా ఫోన్ పట్టనున్న నిత్యా మీనన్ - థ్రిల్లర్ కథతో డెబ్యూ మూవీ
- ●Toll Tax | టోల్ ఫ్రీకి బ్రేక్.. ఇక ప్రభుత్వ అధికారులు కూడా టోల్ చెల్లించాల్సిందే..?
- ●Hyderabad Rains | హైదరాబాద్‌ను కమ్మేసిన కారుమేఘాలు.. దంచికొడుతున్న భారీ వర్షం..
- ●Tenant Farmers Report | యూరియా రాదు.. పంట కొనరు
- ●Mamata Banerjee | సంతకాల ఫోర్జరీ.. మమతా బెనర్జీ ఇంట్లో సీఐడీ సోదాలు
- ●ITR | ఐటీఆర్ ఫైల్ చేస్తే సరిపోదు.. ఈ కారణాలుంటే తప్పనిసరిగా ఆదాయపు పన్ను శాఖ పరిశీలిస్తుంది..

Nithya Menen | మెగా ఫోన్ పట్టనున్న నిత్యా మీనన్ - థ్రిల్లర్ కథతో డెబ్యూ మూవీ

Toll Tax | టోల్ ఫ్రీకి బ్రేక్.. ఇక ప్రభుత్వ అధికారులు కూడా టోల్ చెల్లించాల్సిందే..?

Hyderabad Rains | హైదరాబాద్‌ను కమ్మేసిన కారుమేఘాలు.. దంచికొడుతున్న భారీ వర్షం..

Tenant Farmers Report | యూరియా రాదు.. పంట కొనరు



